ఈఎస్ఐసీ-హైదరాబాద్‌లో యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 133 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
స్టెనోగ్రాఫర్-21.
అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ)- 112.
అర్హతలు:
స్టెనోగ్రాఫర్: ఇంటర్మీడియట్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీ స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం. కంప్యూటర్ పరిజ్ఞానం.
యూడీసీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం.
వయసు: 2019, ఏప్రిల్ 15 నాటికి 18-27 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : స్టెనోగ్రాఫర్: తొలుత 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్బీ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలుంటాయి. తుది జాబితా రూపకల్పనకు ఇందులో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. రెండో దశలో కంప్యూటర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటాయి.
యూడీసీ: తొలిదశలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్బీ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. తుది జాబితా రూపకల్పనకు మెయిన్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మూడో దశలో కంప్యూటర్ స్కిల్‌టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ.250బీ మిగిలిన వారికి రూ.500.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 15, 2019.
వెబ్సైట్: www.esic.nic.in
ఎస్ఎస్సీ- సీహెచ్ఎస్ఎల్ - 2019
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్ఎస్ఎల్)-2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఖాళీల వివరాలు త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
పోస్టులు: వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ కార్యాలయా ల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తారు.
అర్హత: లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ మినహా) పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ) పోస్టులకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక: టైర్-1, 2, 3 పరీక్షల ఆధారంగా.
టైర్-1 పరీక్ష విధానం :
ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మొత్తం నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కోక్క సబ్జెక్ట్‌లో 25 ప్రశ్నలుంటాయి. ప్రతి సబ్జెక్ట్ 50 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. 60 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. 2-4 విభాగాల్లో ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.100. (రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 5, 2019.
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 7, 2019.
టైర్-1: 2019, జూలై 1-26.
టైర్-2 (డిస్క్రిప్టివ్): సెప్టెంబర్ 29, 2019.
వివరాలకు వెబ్సైట్: https://ssc.nic.in
ఎఫ్ఎస్ఎస్ఏఐ అసిస్టెంట్ పోస్టులు
భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ డెరైక్టర్-5, అసిస్టెంట్ డెరైక్టర్ (టెక్నికల్)-15, టెక్నికల్ ఆఫీసర్-130, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-37, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-2, అసిస్టెంట్-34, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1- 7, హిందీ ట్రాన్స్‌లేటర్-2, పర్సనల్ అసిస్టెంట్-25, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)-5, ఐటీ అసిస్టెంట్-3, డిప్యూటీ మేనేజర్-6, అసిస్టెంట్ మేనేజర్-4.
వయసు, అర్హతలు తదితర వివరాలు త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 14, 2019.
వివరాలకు వెబ్సైట్: https://fssai.gov.in