1. కింది ఏ సందర్భంలో పంచాయతీ రద్దు అయితే, పంచాయతీ కోసం ప్రత్యేకంగా ఎన్నిక నిర్వహిం చాల్సిన అవసరం లేదు?
ఎ) పంచాయతీ కాలపరిమితి ముగింపునకు మూడు నెలల కన్నా తక్కువగా ఉన్నపుడు
బి) పంచాయతీ కాలపరిమితి ముగింపునకు ఆరు నెలల కన్నా తక్కువగా ఉన్నపుడు
సి) పంచాయతీ కాలపరిమితి ముగింపునకు ఆరు నెలల కన్నా ఎక్కువగా ఉన్నపుడు
డి) పంచాయతీ కాలపరిమితి ముగింపునకు సంవత్సరం కన్నా తక్కువగా ఉన్నపుడు
2. పంచాయతీ కాలపరిమితి?
ఎ) పంచాయతీ ఎన్నికలు జరిగిన తేదీ నుంచి 5 సంవత్సరాలు
బి) పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్జారీ చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాలు
సి) పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి 5 సంవత్సరాలు
డి) పంచాయతీ మొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుంచి 5 సంవత్సరాలు
3. ఐదు సంవత్సరాల పంచాయతీ కాల పరిమితి పూర్తికాక ముందే, పంచాయతీ రద్దు అయితే, నూతన పంచాయతీ ఎంతకాలం కొనసాగుతుంది?
ఎ) నూతన పంచాయతీమొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుంచి ఐదేండ్లు
బి) నూతన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఐదేండ్లు
సి) గతంలో మనుగడలో ఉన్న పంచాయతీ రద్దు అయిన తర్వాత మిగిలిన కాలపరిమితి
డి) నూతన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తేది నుంచి ఐదేండ్లు
4. కింది వాటిని జత పరచండి?
జాబితా 1
1. బల్వంత్రాయ్ గోపాల్ మెహతా కమిటీ
2. దంత్వాలా కమిటీ
3. జి.వి.కె.రావు కమిటీ
4. అశోక్ మెహతా కమిటీ
జాబితా 2
ఎ. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి
బి. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
సి. మూండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
డి. బ్లాక్ వ్యవస్థ రద్దు
ఎ) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
బి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
5. కింది కమిటీల కాలక్రమం ఆధారంగా సరైన సమాధానాలు గుర్తించండి?
ఎ) బల్వంత్రాయ్ గోపాల్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, దంత్వాలా కమిటీ, సి.హెచ్.హనుమంతరావు కమిటీ
బి) బల్వంత్రాయ్ గోపాల్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, సి.హెచ్.హనుమంతరావు కమిటీ, దంత్వాలా కమిటీ
సి) అశోక్ మెహతా కమిటీ, బల్వంత్రాయ్ గోపాల్ మెహతా కమిటీ, దంత్వాలా కమిటీ, సి.హెచ్.హను మంతరావు కమిటీ
డి) బల్వంత్రాయ్ గోపాల్ మెహతా కమిటీ, దంత్వాలా కమిటీ, సి.హెచ్.హనుమంతరావు కమిటీ, అశోక్ మెహతా కమిటీ
6. కింది వాటిని కాలక్రమం ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి?
ఎ) ఎం.ఎల్.సింఘ్వి కమిటీ, ఆర్.ఎస్.సర్కారియా కమిషన్, జి.వి.కె.రావు కమిటీ, పి.కె.తుంగన్ కమిటీ
బి) పి.కె.తుంగన్ కమిటీ, ఆర్.ఎస్.సర్కారియా కమిషన్, ఎం.ఎల్.సింఘ్వి కమిటీ, జి.వి.కె.రావు కమిటీ
సి) ఆర్.ఎస్.సర్కారియా కమిషన్, పి.కె.తుంగన్ కమిటీ, జి.వి.కె.రావు కమిటీ, ఎం.ఎల్.సింఘ్వి కమిటీ,
డి) జి.వి.కె.రావు కమిటీ, ఎం.ఎల్.సింఘ్వి కమిటీ, ఆర్.ఎస్.సర్కారియా కమిషన్, పి.కె.తుంగన్ కమిటీ
7. సమాజాభివృద్ధి పథకానికి సంబంధించి రాష్ట్రస్థాయి లో ఏర్పాటు చేసే రాష్ట్ర అభివృద్ధి సంఘానికి కార్యనిర్వహణాధికారిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) ముఖ్యమంత్రి బి) కలెక్టర్
సి) రాష్ట్ర సమాజాభివృద్ధి శాఖ కమిషనర్
డి) జిల్లా పరిషత్ చైర్మన్
8. సమాజాభివృద్ధి పథకానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే రాష్ట్ర అభివృద్ధి సంఘాన్ని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేస్తారు?
ఎ) ముఖ్యమంత్రి
బి) జిల్లా పరిషత్ చైర్మన్
సి) రాష్ట్ర సమాజాభివృద్ధి శాఖ కమిషనర్
డి)కలెక్టర్
9. సమాజాభివృద్ధి పథకానికి సంబంధించి అమలు పర్యవేక్షణ జిల్లా స్థాయిలో ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది?
ఎ) జిల్లా పరిషత్ చైర్మన్
బి) జిల్లాకు సంబంధించిన మంత్రి
సి) కలెక్టర్
డి) జిల్లా అభివృద్ధి శాఖ కమిషనర్
10. కింది వాటిని జత పరచండి?
జాబితా 1
1. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ప్రణాళిక సంఘాలను ఏర్పాటు చేయాలి
2. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ప్రణాళికలను అమలు చేయాలి
3. జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక పరోక్షంగా జరగాలి
4. పంచాయతీ సమితుల అధ్యక్షుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగాలి
జాబితా 2
ఎ. జి.వి.కె.రావు కమిటీ
బి. అశోక్ మెహతా కమిటీ
సి. బి.జి. మెహతా కమిటీ
డి. సి.హెచ్. హనుమంతరావు కమిటీ
ఎ) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
బి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
11. జిల్లా ప్రణాళికలను జిల్లా స్థాయిలో అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది?
ఎ) ఎం.ఎల్.సింఘ్వి కమిటీ
బి) ఆర్.ఎస్.సర్కారియా కమిషన్
సి) పి.కె.తుంగన్ కేబినెట్ సబ్ కమిటీ
డి) జి.వి.కె.రావు కమిటీ
12. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం రాజ్యాంగంలో 9వ భాగంలో పంచాయతీ చట్టాలకు సంబంధించిన మొత్తం ఎన్ని నిబంధనలు పొందుపరిచారు?
ఎ) 12 నిబంధనలు బి) 14 నిబంధనలు
సి) 16 నిబంధనలు డి) 18 నిబంధనలు
13. పంచాయతీరాజ్ అనే అంశం ఏ జాబితాలో ఉంది?
ఎ) రాష్ట్ర జాబితా బి) కేంద్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా డి) ఏదీకాదు
14. గ్రామసభ అంటే ఏమిటి?
ఎ) గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే వ్యక్తుల సమూహం
బి) గ్రామ పంచాయతీ పరిధిలో ఒక గ్రామంలో నివసించే వ్యక్తుల సమూహం
సి) గ్రామ పంచాయతీ పరిధిలో గవర్నర్ నోటిఫై చేసిన గ్రామంలో నివసించే వ్యక్తుల సమూహం
డి) గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహం
15. ఎంత జనాభా దాటని రాష్ట్రాల్లో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు?
ఎ) 5 లక్షలు బి) 10 లక్షలు
సి) 15 లక్షలు డి) 20 లక్షలు
16. మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు అనే సూత్రానికి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
ఎ) ఆర్మూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వర్సెస్ ఏపీ బి) విలేజ్ పంచాయతీ, కలన్గూటి వర్సెస్ అడిషనల డైరెక్టర్ ఆఫ్ పంచాయతీ
సి) అబ్దుల్ అజీజ్ అసాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్
డి) కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
17. కొన్ని సందర్భాలలో పంచాయతీ రద్దు అయితే, ఎంత కాలపరిమితిలోపు నూతన పంచాయతీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది?
ఎ) 3 నెలల లోపు బి) 6 నెలల లోపు
సి) 9 నెలల లోపు డి) ఏడాదిలోపు
18. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను, ఉద్యోగ నిబంధనలను ఎవరు నిర్ణయిస్తారు?
ఎ) గవర్నర్ బి) రాష్ట్రపతి
సి) రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలకి లోబడి గవర్నర్
డి) రాష్ట్రపతి సూచన మేరకు గవర్నర్ నిర్ణయిస్తాడు
19. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
ఎ) 1992 బి) 1933
సి) 1994 డి) 1995
20. కింది వాటిలో పరోక్ష ఎన్నిక పద్ధతి ద్వారా ఎన్నికైన స్థానిక సంస్థ ఏది?
ఎ) గ్రామ పంచాయతీ సర్పంచ్
బి) జిల్లా పరిషత్ చైర్మన్
సి) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
డి) మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు
21. కింది వాటిలో ప్రత్యక్ష ప్రాతిపదికన ఎన్నికయ్యే స్థానిక సంస్థ పదవి ఏది?
ఎ) మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్
బి) జిల్లా పరిషత్ చైర్మన్
సి) నగర పంచాయతీ చైర్మన్
డి) మున్సిపాలిటీ వైస్ చైర్మన్
22. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ సభ్యుల అనర్హతలను విచారించే అధికారం ఎవరికి ఉంది?
ఎ) రాష్ట్ర హైకోర్టు బి) సుప్రీంకోర్టు
సి) మున్సిఫ్ కోర్టు డి) ఏదీకాదు
23. 243(జి) నిబంధనలో పంచాయతీలకు సంబంధించి ఎన్ని హక్కులు, అధికారాలను గురించి పేర్కొంది?
ఎ) 18 బి) 29 సి) 39 డి) 40
24. రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
ఎ) ముఖ్యమంత్రి బి) రాష్ట్రపతి
సి) విధాన సభ స్పీకర్ డి) గవర్నర్
25. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?
ఎ) ముఖ్యమంత్రి బి) గవర్నర్
సి) రాష్ట్రపతి
డి) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
26. కింది వాటిని జతపరచండి?
జాబితా 1
1. దంత్వాలా కమిటీ
2. సి.హెచ్. హనుమంతరావు కమిటీ
3. అశోక్ మెహతా కమిటీ
4. జి.వి.కె.రావు కమిటీ
జాబితా 2
ఎ. గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి
బి. బ్లాక్‌ను యూనిట్‌గా తీసుకుని ప్రణాళికలు అమలు చేయాలి
సి. జిల్లా అధికారి పదవి ఏర్పాటు చేయాలి
డి. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలి
ఎ) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
బి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
27. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 అమలులోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీ రాజ్ వ్యవస్థను మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ) తమిళనాడు బి) ఆంధ్రప్రదేశ్
సి) కర్ణాటక డి) కేరళ
28. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 మన దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో పంచాయతీ లకు ఎన్నికలు నిర్వహించారు?
ఎ) కర్ణాటక బి) ఆంధ్రప్రదేశ్
సి) తమిళనాడు డి) కేరళ
29. గ్రామసభ తన అధికార బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తిస్తుంది?
ఎ) గవర్నర్ నిర్ధేశించిన విధంగా
బి) తన అధికార బాధ్యతలను తనంతట తానుగా నిర్ధేశించుకుంటుంది
సి) శాసన సభ నిర్ధేశించిన విధంగా
డి)గ్రామపంచాయతీ నిర్ధేశించిన విధంగా
సమాధానాలు
1.బి 2.డి 3.సి 4.సి 5.ఎ 6.డి 7.సి 8.ఎ 9.సి 10.బి
11.సి 12.సి 13.ఎ 14.డి 15.డి 16.సి 17.బి 18.సి 19.సి 20.సి 21.సి 22.సి 23.బి 24.డి 25.బి 26.ఎ 27.సి 28.ఎ 29.సి
Authorization