1. మృత్తికలు అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) పెడాలజీ బి) ఓరాలజీ
సి) సెలియాలజీ డి) ఎఫోలజీ
2. అత్యల్ప ఉష్ణోగ్రతల అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) క్రయోజెనిక్స్ బి) హైడ్రోఫోనిక్స్
సి) లిథోలజీ డి) ఓరాలజీ
3. తేమను అధికంగా ఇముడ్చుకునే సామర్థ్యం కలిగిన నేలలు?
ఎ) ఎర్రనేలలు బి) శుష్కనేలలు
సి) నల్లరేగడి నేలలు డి) లేటరైట్ నేలలు
4. కింది వాటిలో సరైనది ఏది?
1. కొత్త ఒండ్రు నేలలను భంగర్ అంటారు
2. ప్రాచీన ఒండ్రు నేలలను ఖాదర్ అంటారు
3. నవీన ఒండ్రు నేలలను ఖాదర్ అంటారు
4. పాత ఒండ్రు నేలలను భంగర్ అంటారు
ఎ) 1, 2 బి) 2, 4 సి) 1, 4 డి) 3, 4
5. పెన్‌గంగ ఏ నదికి ఉపనది?
ఎ) మహానది బి) గంగ
సి) కృష్ణ డి) గోదావరి
6. అకన్గువా శిఖరాన్ని ఏ ఖండంలోని ఎత్తైన శిఖరం గా చెప్పవచ్చు?
ఎ) యూరప్ బి) ఉత్తర అమెరికా
సి) ఆస్ట్రేలియా డి) దక్షిణ అమెరికా
7. పొటమాలజీ అంటే ఏమిటి?
ఎ) చంద్రుని పుట్టుకకు సంబంధించి అధ్యయనం
బి) భూమి పుట్టుకకు సంబంధించి అధ్యయనం
సి) నదుల అధ్యయనం
డి) పర్వతాల అధ్యయనం
8. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు మొదటిసారి చంద్రునిపై అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు?
ఎ) అలన్ బి షెపర్ట్
బి) ఎరిక్ విహెన్మియర్
సి) టామ్ విట్టేకర్
డి) ఎడ్విన్ ఆల్ట్రిన్
9. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ?
ఎ) చెరిల్ బార్ట్ బి) జుంకోతాబి
సి) తమయివ తనబె డి) మార్క్ ఇంగ్లీస్
10. నీల్ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై మొదటి అడుగుపెట్టిన సంవత్సరం ఏది?
ఎ) 1957 బి) 1961
సి) 1969 డి) 1972
11. ఆసియాను, ఐరోపాను వేరు చేస్తున్న పర్వతాలు?
ఎ) వాస్జెన్ పర్వతాలు
బి) కాకసన్ పర్వతాలు
సి) కార్పేతియన్ పర్వతాలు
డి) అపనైన్ పర్వతాలు
12. ప్రపంచంలోని ఖండాలలో రెండవ చిన్న ఖండం?
ఎ) ఆఫ్రికా బి) ఐరోపా
సి) దక్షిణ అమెరికా డి) ఉత్తర అమెరికా
13. ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణులు ఏవి?
ఎ) యూరల్ పర్వతాలు బి) ఆల్ఫ్ పర్వతాలు
సి) అపలేచియన్ పర్వతాలు
డి) ఆండీస్ పర్వతాలు
14. 'డౌన్'లని వేటిని అంటారు?
ఎ) ఆసియాలోని సన్నని లోయ ప్రాంతాలు
బి) ఆస్ట్రేలియాలోని గడ్డి భూములు
సి) ఆఫ్రికాలోని చిత్తడి భూములు
డి) దక్షిణ అమెరికాలోని చిన్న చిన్న సరస్సులు
15. ఆల్బిడో అంటే ఏమిటి?
ఎ) భూ ఉపరితలంచే పగటి పూట గ్రహించబడే ఉష్ణశక్తి
బి) భూ ఉపరితలం పరావర్తనం చెందించే సౌర వికిరణం
సి) భూ వాతావరణం గ్రహించే సౌరశక్తి
డి) రాత్రిపూట భూమి కోల్పోయే ఉష్ణశక్తి
16. ఏ ప్రకృతి సిద్ధమండలాన్ని ప్రపంచ పండ్ల తోటల మండలంగా పిలుస్తారు?
ఎ) మధ్యధరా ప్రకృతి సిద్ధ మండలం
బి) రుతుపవన మండలం
సి) సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళు
డి) భూ మధ్య రేఖా మండలం
17. పప్పుధాన్యాలు, నూనెగింజలు అధికంగా ఏ నేలలో పండుతాయి?
ఎ) నల్లరేగడి నేలలు బి) ఎర్ర నేలలు
సి) జేగురు మృత్తికలు డి) శుష్క నేలలు
18. కాఫీ, తేయాకు, రబ్బరు వంటి తోట పంటలకు అనుకూలమైన నేలలు ఏవి?
ఎ) వేటరైట్ నేలలు బి) క్షార నేలలు
సి) ఒండ్రు నేలలు డి) పీఠి నేలలు
19. తుఫాను సూచనను ఏ విధంగా తెలుసుకుంటారు?
ఎ) భారమితి కొలమానం ఒక్కసారిగా పెరగడం
బి) భారమితి కొలమానం నెమ్మదిగా పెరగడం
సి) భారమితి కొలమానం ఒక్కసారిగా పడిపోవడం
డి) భారమితి కొలమానం నెమ్మదిగా పెరగడం
20. డిజిటల్ డెల్టా ఏ నదికి చెందినది?
ఎ) గంగ బి) యమున
సి) మహానది డి) గోదావరి
21. బైసన్ గార్జ్ ఏ నది వల్ల ఏర్పడింది?
ఎ) గండక్ బి) కావేరి
సి) దామోదర్ డి) గోదావరి
22. పక్షిపాద డెల్టా ఏ దేశంలో కలదు?
ఎ) మెకాంగ్ బి) మిసిసిపి
సి) నైలు డి) కొలరాడో
23. ఐరావతి నది ఏ దేశంలో కలదు?
ఎ) భూటాన్ బి) నేపాల్
సి) మయన్మార్ డి) ఇండోనేషియా
24. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) ఆస్ట్రేలియా - విల్లీ విల్లీ బి) వెస్టిండీస్ - టోర్నడో
సి) అమెరికా - హరికేన్స్
డి) చైనా , జపాన్ - టైఫూన్స్
25. ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణించే భూకంప తరంగం ఏది?
ఎ) పి - తరంగాలు బి) ఎస్ - తరంగాలు
సి) ఎల్ - తరంగాలు డి) పి, ఎల్ తరంగాలు
26. నల్లరేగడి నేలలకు సంబంధించని పేరు ఏది?
ఎ) జేగురు మృత్తికలు బి) అరిజోనా నేలలు
సి) చెర్నోజెమ్ మృత్తికలు డి) రేగుర్ నేలలు
27. 'యువాలా' భూ స్వరూపం ఏర్పడటానికి కారణం?
ఎ) సముద్రం బి) హిమనీనదం
సి) పవనాలు డి) అంతర్భూజలం
28. అగాధధరులు ఎలా ఏర్పడతాయి?
ఎ) నదీ ప్రవాహం వల్ల అధోముఖ కోత ఎక్కువైనపుడు
బి) అంతర్భూజలం వల్ల భూ ఉపరితలం కుంగిపో వడం వల్ల
సి) హిమనీ నదం జారుతున్నప్పుడు క్రమక్షయం వల్ల
డి) పైవేవీ కాదు
29. కింది వాటిని జతచేయండి?
పట్టిక 1 పట్టిక 2
1. ఐరన్ ఆక్సైడ్ పి. కరి నేలలు
2. జీవ సంబంధ పదార్థం క్యూ. క్షార నేలలు
3. రే, కల్లార్ ఆర్. ఎర్ర నేలలు
ఎస్. ఒండ్రు నేలలు
ఎ) 1-పి, 2-ఎస్, 3-క్యూ
బి) 1-క్యూ, 2-పి, 3-ఆర్
సి) 1-ఆర్, 2-పి, 3-క్యూ
డి) 1-ఎస్, 2-ఆర్, 3-క్యూ
30. కింది వాటిలో సరైనది గుర్తించండి?
ప్రతిపాదన (ఎ) : నీటి ఆవిరి పెరుగుతున్న కొద్ది గాలి పీడనం తగ్గుతుంది
కారణం (ఆర్) : గాలిలో నీటి ఆవిరి శాతం పెరిగితే గాలి బరువు తగ్గుతుంది
ఎ) ఎ ఒప్పు, ఆర్ తప్పు
బి) ఎ, ఆర్ రెండూ సరైనవే, కానీ ఎ కు ఆర్ సరైన కారణం కాదు
సి) ఎ, ఆర్ రెండూ సరైనవే. ఎకు ఆర్ సరైన కారణం డి) ఎ తప్పు, ఆర్ ఒప్పు
31. కింది వాటిని జతచేయండి?
పట్టిక 1 పట్టిక 2
1. కాసినో పి. మధ్యధరా మండలం
2. సెల్వాలు క్యూ. సతత హరితారణ్యాలు
3. కంపాలు ఆర్. సవన్నా ప్రాంతం
4. రాంచీలు ఎస్. స్టెప్పీ ప్రాంతం
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
బి) 1-ఎస్, 2-పి, 3-ఆర్, 4-క్యూ
సి) 1-క్యూ, 2-ఎస్, 3-ఆర్, 4-ఎస్
డి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
32. అగ్నిశిలలకు సంబంధించని లక్షణాలను గుర్తించండి?
1) అగ్ని శిలలు అచ్ఛిధ్ర శిలలు
2) ఇవి స్తరిత శిలలు
3) అగ్ని శిలల్లో శిలాజాలు ఉండవు
4) ఈ శిలలో పొరలు ఉంటాయి
ఎ) 1, 2 బి) 2, 4 సి) 1, 3 డి) 2, 3
33. వెజినర్ ప్రకారం పూర్వం సంఘటితంగా ఉన్న భూఖండం పేరు?
ఎ) పెంథాల్సా బి) పేంజియా
సి) గోండ్వానా డి) అంగారా
34. పూర్వం మహా ఖండంగా ఉన్న పేంజియా మధ్యలో ఉన్న సముద్రం పేరు?
ఎ) పెంథాల్స బి) పసిఫిక్
సి) ఆర్కిటిక్ డి) టెథిస్
35. నెబ్యులా అంటే ఏమిటి?
ఎ) నక్షత్రం అంతరించి పోయే దశ
బి) నక్షత్రాలకు జన్మస్థానం
సి) నక్షత్రాలలో శక్తిని జనింప చేసే ప్రక్రియ
డి) నక్షత్రాలలోని తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు
36. కృష్ణబిలం అంటే ఏమిటి?
ఎ) అతి ప్రకాశవంతమైన నక్షత్ర దశ
బి) అంతరించిపోతున్న నక్షత్రం
సి) అకస్మాత్తుగా కాంతివంతమయ్యే నక్షత్రం
డి) పూర్తిగా అవతరించని నక్షత్ర దశ
37. గ్రానైట్ రూపాంతరం చెంది ఏ శిలగా మారుతుంది?
ఎ) మార్బుల్ బి) నీస్
సి) స్లేట్ డి) గ్రాఫైట్
38. గ్రాఫైట్ ఏ రకమైన శిల?
ఎ) అగ్ని శిల బి) అవక్షేప శిల
సి) రూపాంతర శిల డి) పాతాళ శిల
39. కింది వాటిని జతచేయండి?
పట్టిక 1 పట్టిక 2
1. ఫార్మొజా పి. కాలిమంతన్
2. అబిసీనియా క్యూ. ఘనా
3. గోల్డ్ కోస్ట్ ఆర్. ఇథియోపియా
4. బోర్నియా ఎస్. తైవాన్
టి. సులవేసి
ఎ) 1-ఎస్, 2-క్యూ, 3-ఆర్, 4-టి
బి) 1-క్యూ, 2-టి, 3-ఆర్, 4-పి
సి) 1-టి, 2-ఆర్, 3-ఎస్, 4-క్యూ
డి) 1-ఆర్, 2-పి, 3-క్యూ, 4-ఎస్
40. ఏ జలసంధిని 'మధ్యధరా సముద్రపుతాళపు చెవి' గా పిలుస్తారు?
ఎ) జిబ్రాల్టర్ జలసంధి బి) జేవిస్ జలసంధి
సి) బేరింగ్ జలసంధి డి) బాస్పరస్ జలసంధి
41. బొగ్గు తయారయ్యే క్రమంలో మొదటి దశలో ఏర్పడేది?
ఎ) లిగ్నైట్ బి) పీట్
సి) బిట్యుమినస్ డి) ఆంత్రసైట్
42. బొగ్గు శాతాన్ని అనుసరించి బొగ్గు రకాలను తక్కువ నుంచి ఎక్కువకు వరుస క్రమంలో తెలుపండి?
1. బిట్యుమినస్ 2. ఆంత్రసైట్
3. పీట్ 4. లిగ్నైట్
ఎ) 2, 1, 3,4 బి) 1, 2, 3, 4
సి) 3, 4, 2, 1 డి) 2, 4, 3, 1
43. లిగ్నైట్ బొగ్గు నిక్షేపాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
ఎ) గుజరాత్ బి) ఛత్తీస్‌గఢ్
సి) జార్ఖండ్ డి) తమిళనాడు
44. బొగ్గు క్షేత్రాలను, అవి ఉన్న రాష్ట్రాలకు జత చేయండి?
బొగ్గుక్షేత్రం రాష్ట్రం
1. ఝరియా పి. ఛత్తీస్‌గఢ్
2. తాల్చేరు క్యూ. జార్ఖండ్
3. రాణిగంజ్ ఆర్. పశ్చిమబెంగాల్
4. కోర్బా ఎస్. మధ్య ప్రదేశ్
టి. ఒరిస్సా
ఎ) 1-ఎస్, 2-క్యూ, 3-ఆర్, 4-టి
బి) 1-క్యూ, 2-టి, 3-ఆర్, 4-పి
సి) 1-టి, 2-ఆర్, 3-ఎస్, 4-క్యూ
డి) 1-ఆర్, 2-పి, 3-క్యూ, 4-ఎస్
సమాధానాలు
1.ఎ 2.ఎ 3.సి 4.డి 5.డి
6.డి 7.సి 8.డి 9.బి 10.సి
11.బి 12.బి 13.డి 14.బి 15.బి
16.ఎ 17.బి 18.ఎ 19.సి 20.ఎ
21.డి 22.బి 23.సి 24.సి 25.బి
26.ఎ 27.డి 28.ఎ 29.సి 30.సి
31.డి 32.బి 33.బి 34.డి 35.బి
36.బి 37.బి 38.సి 39.డి 40.ఎ
41.బి 42.సి 43.డి 44.బి
- జి.ఉపేందర్
హైదరాబాద్
ఫోన్ నెం : 9676669049