1. 1.5 టెరాబైట్ మెమరీ కలిగిన అన్నపూర్ణ సూపర్ కంప్యూ టర్ను అభివృద్ధి చేసిన సంస్థ?
ఎ) బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్
బి) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్
సి) ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమాటికల్ సైన్సెస్
డి) విక్రం సారాబాయి స్పేస్ సెంటర్
2. చంద్రయాన్ - 1 ఉపగ్రహంలోని ఏ పరికరం ఉపగ్రహం నుంచి వెలువడి చంద్రునిపైకి చేరి సమాచారం పంపడం జరిగింది?
ఎ) మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
బి) లూనార్ లేసర్ రేజింగ్ ఇన్స్ట్రుమెంట్
సి) టెర్రేయింగ్ మ్యాపింగ్ కెమెరా
డి) హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్
3. ఈ కింది వాటిలో సరికానిది ఏది?
1) భారత ఉపరితల భూభాగంపై అధిక భూకంపాలు హిమాలయ ప్రాంతంలో వస్తాయి
2) జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రకారం 59 శాతం భారత భూభాగం దుర్బల స్థితిలో ఉంది
3) భూకంప తీవ్రత జోన్లలో హైదరాబాద్ 25వ, ఢిల్లీ 4వ జోన్లలో ఉన్నాయి.
4) డిటెక్టర్ల ద్వారా భూకంపాలను ముందే గుర్తించవచ్చు.
ఎ) 1 బి) 3 సి) 4 డి) 2
4. పర్యావరణ విధ్వంసం, క్షీణత వేటి ద్వారా జరుగుతుంది?
1. గాలి, నీరు, నేల వంటి వనరుల తరుగుదల
2. ఆవరణ వ్యవస్థల విధ్వంసం
3. వన్యప్రాణుల పెరుగుదలలో ప్రగతి
4. వన్య ప్రాణులు అంతరించడం
ఎ) 1 బి) 2, 4 సి) 1, 2, 4 డి) 2
5. హంటింగ్టన్వ్యాధి ఈ జన్యులోపం వల్ల కలుగుతుంది?
ఎ) 4వ క్రోమోజోము అదనపు కాపీ
బి) 4వ క్రోమోజోము ఒక జన్యువు లోపించినపుడు
సి) 4వ క్రోమోజోము పై ఒక జన్యువులో సీఏజీ అనే నైట్రోజన్ బేస్‌లు 3 సార్లు పునరావృతం కావడం వల్ల
డి) 4వ క్రోమోజోము ఒక దానితో మరొకటి జత కట్టక పోవడం వల్ల
6. కింది వాటిలో సరికాని జత ఏది?
1. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - 2017 : ఏంజెలా మెర్కెల్
2. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ - ఎన్.కె.సింగ్
3. మిస్ యూనివర్స్ 2017 విజేత - మానుషి చిల్లార్
4. ప్రసార భారతి చైర్మన్ - సూర్యప్రకాశ్
ఎ) 2, 3 బి) 1, 4 సి) 1, 3 డి) 3 మాత్రమే
7. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) విజయ్ ప్రహార్ భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు
బి) అజేయ వారియర్ భారత్, బ్రిటన్ సంయుక్త సైనిక విన్యాసాలు
సి) ఐఎంబిఏఎక్స్ - 2017 భారత్, స్విట్జర్లాండ్ సంయుక్త సైనిక విన్యాసాలు
డి) హరి మౌ శక్తి - 2018 భారత్ మలేషియా మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు
8. కింది వాటిలో సరికానిది ఏది?
1) సౌర కుటుంబంలో సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడటానికి కారణం ధృవణం
2) ఫెర్ని ప్రమాణాన్ని ఉపయోగించి పరమాణు కేంద్రక పరిమాణాన్ని కనుక్కుంటారు
3) సూర్యబింబం అండాకృతిలో కనిపించడానికి కారణం కాంతి వక్రీభవనం
4) ఎండమావులు ఏర్పడడానికి కారణం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
9. కింది వాటిలో సరైనది తెలపండి?
1. అంగారకుడి పైకి ఇన్సైట్ ల్యాండర్‌ను ప్రయోగించిన నాసా.
2. ఇన్సైట్ ల్యాండర్‌ను అట్లాస్ - 5 అనే రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్ళింది.
3. ఇది అంగారకుడి ఉపరితలం కింద ఉష్ణప్రవాహ తీరును పర్యవేక్షిస్తుంది.
4. ఇన్సైట్ ల్యాండర్ అరుణ గ్రహంపై ఎల్సియం ప్లానీషియా మైదాన్ ప్రాంతంలో దిగుతుంది.
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 2, 3, 4 డి) పైవన్నీ
10. కింది వాటిని జతపరచండి?
1. ఇండియన్ చైనావార్ ఎ. బెర్టిల్లింట్నర్
2. చైనీస్ ఇండియావార్ బి. నెవిల్లి మాక్స్వెల్
3. అన్ఫినిష్డ్ సి. సంజరు మంజ్రేకర్
4. ఇమ్పర్ఫెక్ట్ డి. ప్రియాంక చోప్రా
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
11. వ్యవసాయాభివృద్ధికి, పర్యావరణానికి హాని కలిగిం చని సమగ్ర అభివృద్ధి పథకం ఏది?
ఎ) సాగు భూమి విస్తీర్ణం పెంచడం, సూపర్ ఫాస్పేట్ తదితర ఎరువుల వినియోగం పెంచడం
బి) ఎక్కువ ఉత్పత్తినిచ్చే అధిక సాగు విత్తనాలను వాడడం నత్రజని సంబంధ ఎరువులను, పురుగు మందులను వాడడం.
సి) మిశ్రమ పంటలు అంటే నత్రజనిని స్థిరీకరించే మొక్కలు, చీడలను తట్టుకునే పంటలను ప్రోత్సహించడం
డి) ఆధునిక పద్ధతులలో పంటల సాగు, యంత్రాల వినియోగం, ఎప్పుడూ ఒకే రకం పంటలు పండించడం
12. స్పెయిన్ దేశం సుష్మాస్వరాజ్‌కు ఇటీవల గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది సివిల్ మెరిట్ పురస్కారాన్ని ప్రదానం చేయుటకు కారణం?
ఎ) ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు
బి) ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం
సి) నేపాల్ భూకంప సమయంలో ఆపరేషన్ మైత్రి ద్వారా స్పెయిన్ దేశస్థులను ఇండియా రక్షించడం
డి) అంతర్జాతీయంగా సుష్మాస్వరాజ్ నెరుపుతున్న దౌత్య సంబంధాలు.
13. ఇటీవల సౌదీ అరేబియా యువరాజు భారతదేశాన్ని పర్యటించారు. ఈ నేపథ్యంలో కింది వానిలో సరైన ప్రవచనములు ఏవి?
1. పుల్వామా ఉగ్రవాద దాడిని యువరాజు ఖండించారు
2. కౌంటర్ టెర్రరిజంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు కానుంది.
3. ఇరు దేశాల మధ్య పెట్టుబడి అంశంలో 40 అవకాశాలను గుర్తించారు
4. రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి ఏ విధమైన చర్చ జరగలేదు
ఎ) పైవన్నీ బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2, 3
14. ఫిబ్రవరి 17, 2019న ఇరాన్ ఆవిష్కరించిన కొత్త జలాంతర్గామి ఫతేను అభివృద్ధి చేసిన దేశం?
ఎ) రష్యా బి) చైనా
సి) జపాన్
డి) దేశీయంగా అభివృద్ధి చేయబడింది
15. ఇటీవల ఎక్సర్సైజ్ రాహత్ విపత్తు ఉపశమన విన్యాసం ఏయే ప్రదేశాలలో ఒకే సమయంలో నిర్వహించారు?
1) జైసల్మేర్ 2) జైపూర్
3) కోట 4) అల్వార్
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 2, 3 డి) 2,3, 4
16. కింది వాటిని జత పరచండి?
1. అంతరిక్ష విభాగం ఎ. 1986
2. అణుశక్తి సంఘం బి. 1972
3. టెక్నాలజీ మిషన్ కార్యక్రమం సి. 1969
4. ఇస్రో డి. 1948
ఎ) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
17. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) జీఎస్టీ నెట్వర్క్ చైర్మన్ - అజరు భూషణ్ పాండే
బి) పరిశ్రమల సంఘం (ఫిక్కి) డైరెక్టర్ జనరల్ - విజరు గోఖలే
సి) ప్రధాన ఎన్నికల కమిషనర్ - ఓం ప్రకాష్ రావత్
డి) ఎన్ఎఫ్సీ (న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ - దినేష్ శ్రీ వాస్తవ
18. ఏ దశకాన్ని ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ నేచురల్ డిజాస్టర్ రిడక్షన్ అని యూఎన్ఓ ప్రకటించింది?
ఎ) 1990 - 2000 బి) 1980 - 1990
సి) 2000 - 2010 డి) 1995 - 2005
19. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఓజోన్ సాంద్రతపై ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణుల పరిశోధనలో 2001 - 2007 మధ్య ఈ పొర క్షీణత గణనీయంగా తగ్గింది
బి) ఐఐటీలోని సముద్రాలు, నదులు, వాతావరణం ప్రకృతి దర్శా కేంద్రం (కోరల్) నిపుణులు ఈ పరిశోధ నలను చేపట్టారు.
సి) ఇటీవల ఓజోన్ పొర క్షీణత 40 - 60 శాతం వరకు తగ్గింది
డి) 1979 - 2017 మధ్య అంటార్కిటిక్ ఓజోన్ సమాచారాన్ని వీరు పరిశీలించారు
20. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1. 2018 నవంబరు 29న పీఎస్ఎల్వీ సీ - 43 వాహననౌక ద్వారా 31 ఉపగ్రహాలను ప్రయోగించారు
2. భారతదేశానికి చెందిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం - హైసిస్‌ను పీఎస్ఎల్వీ సీ - 43 ద్వారా ప్రయోగించారు
3. అత్యధికంగా అమెరికాకు చెందిన 23 ఉపప్రగహాలను పీఎస్ఎల్వీ సీ - 43 ద్వారా కక్ష్యలోకి ప్రవేవపెట్టారు.
4. పీఎస్ఎల్వీ సీ - 43 అనేది పీఎస్ఎల్వీ సీరిస్‌లో 43వ ఉపగ్రహం
ఎ) 1 బి) 2 సి) 4 డి) పైవన్నీ
21. భారత వైమానిక దళం ఇటీవల నిర్వహించిన వాయుశక్తి 2019లో మొదటిసారిగా ప్రదర్శించబడినవి?
ఎ) ఏఎల్‌హెచ్, అస్త్ర
బి) సుఖోరు 30, ఏఎన్-32
సి) ఏఎల్‌హెచ్, ఆకాష్ డి) సుఖోరు 30, ఆకాష్
22. ఇటీవల ప్రారంభించిన నేషనల్ వార్ మెమోరియల్‌కు సంబంధించి కింది వానిలో సరికాని ప్రవచనం ఏది?
ఎ) దీనిని ఇండియా గేట్ సముదాయానికి అనుబంధంగా నిర్మించారు
బి) దీనిలో 16 గ్రానైట్ ఫలకాలపై అమరవీరుల పేర్లను చెక్కించారు.
సి) గ్రానైట్ ఫలకాలను అమర చక్ర, వీర చక్ర, త్యాగ చక్ర, రక్షణ చక్ర అనే కేటగిరీలుగా విభజించారు
డి) ఈ స్మారక కట్టడం నిర్మాణాన్ని 2013లో ప్రారంభించారు
23. కింది వాటిలో అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్జీ) సంబంధించి సరికానిది ఏది?
ఎ) అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే పదార్థాలు, సామాగ్రి, సాంకేతికత ఎగుమతులను నియంత్రించడం ద్వారా అణువ్యాప్తిని నివారించడం ఎన్ఎస్జీ ఉద్దేశం.
బి) భారత అణు ఆయుధాలు పరీక్షల నిర్వహణకు (స్మైలింగ్ బుద్ధ) స్పందనగా 1974లో ఎన్ఎస్జీ ఆవిర్భవించింది.
సి) అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (1970)పై సంతకం చేయని కారణం చేత చైనా అణు సరఫరాదారుల గ్రూపులో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తుంది.
డి) పాకిస్తాన్ అణు సరఫరాదారుల గ్రూపులో సభ్య దేశం
24. ఇటీవల వార్తల్లో నిలిచిన మధ్యంతర శ్రేణి అణ్వస్త్ర బలగాల ఒడంబడిక (ఐఎన్ఎఫ్)కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) 1987లో ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ఈ ఒడంబడిక కుదిరింది
2) రెండు దేశాలలో అణు ఆయుధాలు కలిగిన క్షిపణుల సంఖ్య తగ్గించడం దీని లక్ష్యం. ఇది 2021లో గడువు ముగుస్తుంది.
3) ఈ ఒడంబడిక నిబంధనలను రష్యా ఉల్లంఘించిం దని అమెరికా ఆరోపిస్తూ వైదొలుగుతానని పేర్కొంది.
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 డి) 1, 2, 3
25. ఒక ప్రభుత్వ ఉద్యోగి సివిల్ లేదా క్రిమినల్ కేసులలో నేరం రుజువైతే ఈ కింది ఏ అంశాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు?
ఎ) భారతీయ శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు
బి) కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు.
సి) ఎ, బి రెండూ
డి) ఏ విధమైన చర్యకు అర్హుడు కాదు
26. భావోద్వేగమైన మనస్సు ఈ కింది ఏయే అంశాల మీద దోహదం చేస్తుంది?
ఎ) నిర్ణయాత్మక అంశాలను
బి) ఎదుటి వారి భావోద్వేగాలను అంచనా వేయుటకు
సి) వ్యక్తి గుణగణాలను
డి) పైవన్నీ
27. కింది వారిలో ప్రజల అధికారిగా గుర్తింపు పొందినది?
ఎ) అశోక్ ఖేమ్కా బి) ఎస్.ఆర్.శంకరన్
సి) కిరణ్‌బేడి డి) దుర్గాశక్తి నాగపాల్
సమాధానాలు
1.సి 2.ఎ 3.సి 4.సి 5.సి
6.సి 7.సి 8.ఎ 9.బి 10.డి
11.డి 12.సి 13.డి 14.డి 15.డి
16.బి 17.బి 18.ఎ 19.సి 20.సి
21.సి 22.డి 23.డి 24.డి 25.సి 26.డి 27.సి
Authorization