భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రి కల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 24 ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పని ప్రదేశం: హైదరాబాద్, బెంగళూరు, ఇండిస్టీస్ సెక్టార్-న్యూఢిల్లీ. విభాగాలు: సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ డీజీఎం. అర్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులతో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: పోస్టులను బట్టి 2019, జూన్ 1 నాటికి 32-48 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.300జీఎస్టీ. దరఖాస్తులు ప్రారంభం: జూన్ 10, 2019. దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 25, 2019. వెబ్సైట్:https://careers.bhel.in