మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో.. సివిల్ సర్వీస్ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ అంతే ముఖ్యం. వెన్నెముక లేకుండా మనిషి ఎలా నిలబడలేడో.. కరెంట్ అఫైర్స్‌పై పట్టు లేకుండా సివిల్స్ పరీక్షలో నెగ్గడం కూడా అసాధ్యం. సివిల్ సర్వీస్‌లో కరెంట్ అఫైర్స్‌కు ఉన్న అధిక ప్రాధాన్యత మరో దానికి ఉండదు. జనరల్ సైన్స్ విభాగంలో కరెంట్ అఫైర్స్ అరవై శాతం ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వీటిపై పట్టు సంపాధించడం సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా అవసరం...
రెండవ పేపర్లో అప్షనల్ సబ్జెక్టులైన జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ వంటి అంశా ల్లోనూ కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ సబ్జెక్టులతో ఎంపిక చేసుకునే రెండో పేపర్లో భారతదేశానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుబంధంగా ఉన్న అంశాలు సరిగా తెలుసుకోలేకపోతే సరైన సమాధానాలు రాయడం కష్టతరమే. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి ఈ దృగ్విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అభ్యర్థులు నిరాశకు గురికావాల్సి వస్తుంది. అందువల్ల సివిల్ సర్వీసెస్ పరీక్షలో కరెంట్ అఫైర్స్‌ను అభ్యర్థులు ఎలా తయారు చేసుకోవాలి, వాటి ద్వారా దిశా నిర్దేశం ఎలా చేసుకోవాలి అనే అంశాలను పరిశీలిద్దాం.
ఎందుకు అవసరం..
సివిల్ సర్వీసెస్ అనేది ఒక రంగానికి పరిమితం కాదు. అందరికీ ఉపయోగపడే వ్యక్తులను ఎంపిక చేసుకునేందుకు నిర్వహించే పరీక్ష. పాలనా అధికారులుగా ఎంత మేరకు తమ బాధ్యతలను నిర్వహిస్తారనేది ముఖ్యమైన అంశం. అంటే, సామాజిక, ఆర్థిక, రాజకీయాలతో పాటు నిర్వహణ బాధ్యతలకు సంబంధించి అవగాహన కలిగి ఉండడం, సమయానుకూలంగా స్పందించడం వంటివి ఎంత మేర ప్రదర్శిస్తారనేది చాలా ప్రధానంగా చూస్తారు. సివిల్ సర్వీసెస్‌ను వృత్తిగా ఎంచుకునే వారికి ప్రస్తుత పరిస్థితు లపై అవగాహన ఉన్నప్పుడే ఆ పరిస్థితులకు తగినట్లు స్పందిం చడం సాధ్యమవుతుంది. 1853 చట్టం కింద మెరిట్ ఆధారిత సివిల్ సర్వీసులు ప్రారంభించిన మెకాలే ఒక సందర్భంలో 'జ్ఞానం మార్చుకోదగినది' అని చెప్పారు. దాని అర్థం ఒక వ్యక్తికి విభిన్న అంశాలకు సంబంధించి జ్ఞానం ఉంటే, దానిని ఉత్తమంగా పరిపా లించేందుకు ఉపయో గించుకోవచ్చని ఆయన అభిప్రాయం. మరోలా చెప్పాలంటే, సివిల్ సర్వెంట్‌కు విభిన్న అంశాలలో జ్ఞానం ఉంటే, ప్రజా ప్రయోజనాల కోసం విస్తృతమైన పరిపాలనా లక్ష్యాలు చేరుకోవడానికి, తన విధులను సక్రమంగా నిర్వర్తించ డానికి దోహదం చేస్తుంది. అందువల్ల, మెకాలే సూచించిన 'జ్ఞానం' అనేది కరెంట్ అఫైర్స్ ద్వారా సాధించవచ్చు. అందుకు వార్తాపత్రికలు, జర్నల్స్, వెబ్‌సైట్స్, టీవీలు వంటివి దోహదం చేస్తాయి.
ప్రిలిమ్స్, మెయిన్స్‌తో సమన్వయం
ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్ : ప్రిలిమ్స్ అనేవి ప్రస్తుత సివిల్ సర్వీసెస్‌లో చాలా క్లిష్టంగా మారాయి. చాలా మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌ను 2 నుంచి 3 ప్రయత్నాలలో సైతం పూర్తి చేయలేక పోతున్నారు. మరికొంత మంది అయితే 5 ప్రయత్నాలలో కనీసం క్వాలిఫై కాలేకపోతున్నారు. ఇలాంటి భారీ వైఫల్యాన్ని కొన్ని భాగాలుగా విభజించవచ్చు.
1. ప్రిలిమ్స్ ఒక స్క్రీనింగ్ పరీక్ష. ఇది ఎంపిక విధానం కంటే ఎక్కువ శాతం తొలగించేందుకే నిర్వహించే పరీక్ష.
2. ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల్లో నెగ్గేందుకు ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ప్రిలిమ్స్‌లో ఉండే జనరల్ సైన్స్‌లో 100 ప్రశ్నలకు 25 నుంచి 30 ప్రశ్నలు ఉంటు న్నాయి. అంటే ఇవి ఒక్కింట మూడో వంతు భాగాన్ని అక్రమిస్తున్నాయి. కొన్ని సార్లు అంతకంటే ఎక్కువగానూ ఉంటున్నాయి. అందువల్ల కరెంట్ అఫైర్స్‌పై పట్టు లేక పోతే ప్రిలిమ్స్‌లో విజయం సాధించడం కష్టమే.
కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్‌ను ఎలా శాసిస్తున్నాయంటే, ఎక్కడ నుంచైనా, ఏ అంశం గురించైనా, ఏ విధంగానైనా ప్రశ్న ఎదురుకావచ్చు. 'ఏది, ఏ విధంగా' అనే అంశాన్ని అర్థం చేసుకోవడం అంటే, కొన్ని విస్తృత పరిస్థితులు ఆయా సమయాలను బట్టి కలుపుకునే విధానంపై ఆధారంపడి ఉంటుంది. గడిచిన 3 సంవత్సరాలలో వచ్చిన ప్రశ్నలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అందుకు అభ్యర్థి చేయాల్సింది.. గడిచిన ఏడాది పేపర్ తీసుకుని ఈ విభాగానికి సంబంధించి ఇచ్చిన ప్రశ్నలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే ఏ విధంగా ప్రశ్నలు వస్తున్నాయనేది అర్థం అవుతుంది. గతేడాది, ప్రస్తుతం కలుపుకుని రెండు సంవత్సరాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ను కూడా ఒకసారి తిరగేస్తే ఉపయుక్తంగా ఉంటుంది.
ప్రిలిమ్స్‌లో ....
1. రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన సమస్యలపై : ఎక్కువగా రాజ్యాంగపరమైన సవరణలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్టీఏ చట్టంలోని సమస్యల గురించి అడుగు తుంటారు.
2.ఆర్థికాంశాలు: ఇందులో వ్యవసాయ రంగం, పరిశ్రమలు, దేశీ-విదేశీ వాణిజ్యం, ద్రవ్యోల్బణం, ఎగుమతులు, ఆర్బీఐ, బడ్జెట్ వంటివి ఉంటాయి.
3. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు : ప్రతి యేటా అనేక రకాల పథకాలు ప్రారంభమవుతుంటాయి. వీటన్నింటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ప్రభుత్వ అధికార వెబ్సైట్ నుంచి సమాచారం సేకరించవచ్చు. లేదా యోజన, కురుక్షేత్ర వంటి మాగజైన్ల ద్వారా తెలుసుకోవచ్చు.
1) పర్యావరణం : ఈ విభాగాన్ని ఇటీవలే ప్రిలిమ్స్‌లో చేర్చారు. జీవావరణం, పర్యావరణం గురించి కనీస అవగాహన అవసరం. వీటితో పాటు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఓవర్ షూట్స్ డే, ఎర్త్ అవర్, ఎర్త్ డే వంటివి. వాతావరణంలో చోటుచేసు కునే మార్పులు, ఐపీసీసీ, యూఎన్ రిపోర్టుల గురించి ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉంటుంది. భారత్‌లోని పర్యావర ణానికి సంబంధించి వార్తలలో వచ్చిన వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
2) అవార్డులు : క్రీడలు, సినిమా రంగం, సాంస్కృతిక అవార్డులతో పాటు, భారతీయ ప్రముఖులు అందుకున్న అవార్డులకు సంబంధించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు పీఎం నరేంద్ర మోడీ ఈ ఏడాది అందుకున్న యూఏఈ జాయెద్ మెడల్, పిన్న వయస్కురాలైన అమికా జార్జ్ అందుకున్న గోల్ కీపర్స్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు వంటివి.
3. సైన్స్ అండ్ టెక్నాలజీ : సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్తగా వచ్చిన ఆవిష్కరణలు, అభివృద్ధి వంటివి. అందు లోనూ మన దేశానికి సంబంధించిన సమాచారం నిశితంగా తెలిసుండాలి. ఉదాహరణకు.. బ్లాకహేోల్ (కృష్ణబిలం)కు సంబంధించి ఈవెంట్ హారిజోన్ టెలిస్కోప్ తీసిన మొదటి ఫొటో, ఈ ఫొటోకు సంబం ధించి అల్గారిథమ్‌ను రూపొందించిన కంప్యూటర్ శాస్త్రవేత్త ఎంఎస్ కేటీ బౌమన్ వంటి సంఘటనలకు సంబంధించిన పరిజ్ఞా నం, అంతరిక్ష విజయాలకు సమాచారం అవసరం అవుతుంది.
మెయిన్స్ కోసం :సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలపై విశ్లేషణ, కచ్చితమైన రచనా నైపుణ్యాలను పొందుపరచాలంటే కరెంట్ అఫైర్స్ మీద పట్టు చాలా అవసరం. కచ్చితంగా చెప్పాలంటే జనరల్ సైన్స్ పేపర్ కరెంట్ అఫైర్స్‌తో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీద పట్టు లేకుండా మెయిన్స్‌లో నెగ్గడమనేది అసంభవం.
జనరల్ సైన్స్ పేపర్ 1 (మెయిన్స్) : ఇందులో జాగ్రఫీ ఒక విభాగం. ప్రస్తుత భౌగోళిక సమస్యలపై ప్రశ్నలు ఇస్తుంటారు. ఉదాహరణకు హిమనీ నదాలు కరిగి పోవడం, అంటార్కిటా ప్రాంతం వేడెక్కడం, గాలి కలుషితం, ఎల్‌నినో కారణంగా వర్షాకాలంలో మార్పులు వంటివి. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలకు సంబంధించి సామాజిక సమస్యలపై ఒక విభాగంలో ప్రశ్నలు ఉంటాయి.
జనరల్ సైన్స్ పేపర్ 2 (మెయిన్స్) : రాజకీయాలు, అంతర్జాతీ యాంశాలపై పాలనాపరంగా ప్రస్తుత సమస్యల గురించి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. రాజకీయ పరంగా ఎన్నికల సంస్కర ణలు, న్యాయ నిర్ణయాలు, న్యాయ సంస్కరణలు, రాజ్యాంగ సవరణలు, పార్లమెంట్, పార్లమెంటరీ వ్యవస్థల నిర్వహణ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీ యాంశాలకు సంబంధించి ఇరుగు పొరుగు దేశాలతో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలు, భారతదేశ విదేశీ విధానం, యునైటెడ్ నేషన్స్, ఎస్సీఓ, ఈయూ, బ్రిక్స్, ఏయూలలో భారతదేశ పాత్ర వంటి అంశాలపై ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రశ్నలు వస్తుంటాయి.
జనరల్ సైన్స్ పేపర్ 3 (మెయిన్స్) : విపత్తు నిర్వహణ, అంతర్గత భద్రతా సమస్యలు, ఆర్థిక వ్యవస్థ, ప్రకృతికి సంబంధిం చిన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇవి కూడా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించినవే ఉంటాయి. వాణిజ్యం, వ్యవసాయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ఇతర దేశాల వాణిజ్యంతో భారతదేశంలో ఎదురవుతున్న సమస్యలు, ఇతర దేశాలు ఉన్న సమస్యల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశ అంతరిక్ష ప్రయోగాలు, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, కృత్రిమ మేధస్సు వంటివి తెలుసుకోవడం అవసరమే. విపత్తు నిర్వహణ, మన జాతీయ విపత్తు విధానం, ప్రకృతి, మానవుల వల్ల ఏర్పడిన వైపరీత్యాలు, అంతర్గత భద్రత, సరిహద్దు నిర్వహణ, అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తిరుగుబాట్లు, జాతి విబేధాలు, నక్సలిజంకు సంబంధించి ముఖ్యమైన ప్రాంతాలు వంటి అనేకాంశాలపై అవగాహన అవసరం.
జనరల్ సైన్స్ పేపర్ 4 (మెయిన్స్) : ఇందులో విలువలు, అభిరుచి (ఆప్టిట్యూడ్), సమగ్రత వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. అయినప్పటికీ ఈ పేపర్ కూడా కరెంట్అఫైర్స్ తోనే ముడిపడి ఉంటుంది. అవినీతి, నైతిక పాలన, అంతర్జాతీయ సంబంధాలు, నిధులపై ప్రశ్నలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు ఉంటేనే సమాధానం రాయడం సాధ్యమవుతుంది.
కరెంట్ టాపిక్స్‌పై వ్యాసరచన పేపర్ : ఇది రెండు విభాగాలుగా ఉంటుంది. 1.తత్వశాస్త్ర వ్యాసాలు (ఫిలాసఫికల్ ఎస్సేస్), 2. కరెంట్ అఫైర్స్‌పై వ్యాసాలు. ఉదాహరణకు నామ్ ప్రస్తుత పరిస్థితులు, కార్పొరేట్ ఫెడరలిజమ్, వ్యవసాయంలో ఎదురవుతున్న బాధలు వంటివి గతంలో అడిగిన ప్రశ్నలకు అనుబంధంగా కరెంట్ టాపిక్స్‌పై అడుగుతుంటారు. అందువల్ల వ్యాసాలు రాయడంలోనూ కరెంట్ అఫైర్స్ దోహదం చేస్తాయి.
సివిల్స్ ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రవర్తనతో పాటు ఏ అంశాలపై ఎంత వరకు పరిజ్ఞానం ఉందో పరిశీలిస్తారు. ఒక్కొక్కసారి కరెంట్ ఇష్యూస్‌కు సంబంధించిన ప్రశ్నలను సందిస్తారు. అలాంటప్పుడు కరెంట్ ఇష్యూస్, కంరెంట్ టాపిక్స్‌పై అప్డేట్గా ఉండటం వల్ల బోర్డు సభ్యులను మెప్పించవచ్చు. వారి దృష్టిలో పడవచ్చు. సరైన అవగాహన లేకుండా ఇంటర్వ్యూకు హాజరు కావడం అనేది చాలా సమస్యాత్మకమే కాదు కొన్ని మార్కుల తేడాతో ఎంపిక జాబితాలో మన పేరు లేకుండా పోవచ్చు. అందుకే ఇంటర్వ్యూలోను ప్రతిభ చూపించాల్సిన అవసరం ఉంది.
Authorization