1. కింది వాటిని జత చేయండి?
జాబితా -1
1) ఎపికల్చర్ 2) సెరి కల్చర్
3) పిసి కల్చర్ 4) వర్మికల్చర్
జాబితా -2
పి) వానపాములు క్యూ) చేపలు
ఆర్) పట్టుపురుగులు ఎస్) తేనేటీగలు
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
బి) 1-ఎస్ 2-ఆర్, 3-క్యూ, 4-పి
సి) 1-పి, 2-ఆర్, 3-క్యూ, 4-ఎస్
డి) 1-ఆర్, 2-ఎస్, 3-పి, 4-క్యూ
2. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్‌కు ఆధ్యుడు ఎవరు?
ఎ) జోనాస్ సాల్క్ బి) అలెక్ జెఫ్రి
సి) ఆల్బర్ట్ సాబిన్ డి) ఫ్లోరీ
3. కింది వాటిలో అను వంశిక వ్యాధులు ఏవి?
1) బ్లీడర్ వ్యాధి 2) వర్ణాంధత్వం
3) ఎనీమియా 4) తలసేమియా
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) పైవన్నీ సరైనవే
4. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా చైనా ప్రభుత్వం అంతరింప చేయాలనుకున్న పక్షి?
ఎ) పావురం బి) పిచ్చుక
సి) బాతు డి) హమ్మింగ్ బర్డ్
5. దప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియాగా పిలిచే ఫలం పేరు?
ఎ) మామిడి బి) సీతాఫలం
సి) పనస డి) సపోట
6. 1. నీటి మాలిన్యం వల్ల జలచర జీవులకు శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది.
2) నీటి మాలిన్యం వల్ల నీటిలో కరిగే ఆక్సిజన్ శాతం తగ్గుతుంది.
ఎ) 1, 2 రెండూ సరైన వాక్యాలు. 2, 1 కి సరైన వివరణ.
బి) 1, 2 రెండూ సరైన వాక్యాలు. 2, 1 కి సరైన వివరణ కాదు.
సి) 1, 2 రెండూ సరైనవి కావు
డి) 1 సరైన వాక్యం కానీ, 2 సరైన వాక్యం కాదు
7. కిందివాటిలో సరైన దానిని గుర్తించండి?
1) ఓజోన్ వాతావరణంలోని స్ట్రాటో స్పియర్ అనే పొరలో ఉంటుంది.
2) ఓజోన్ పొర మందాన్ని డాబ్సన్ ప్రమాణాల్లో కొలుస్తారు
3) మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ సంరక్షణకు సంబంధించినది.
4) సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ సంరక్షణా దినంగా నిర్వహిస్తారు.
ఎ) 1, 3 బి) 2, 4
సి) 1, 2, 3 డి) పైవన్నీ సరైనవే
8. బ్లాక్వుట్ వ్యాధికి కారణమైనన కాలుష్య కారకం ఏది?
ఎ) ఫ్లోరిన్ బి) కాల్షియం
సి) అర్సెనిక్ డి) నైట్రేట్స్
9. ఏ విటమిన్ లోపం వల్ల స్ప్రూ వ్యాధి వస్తుంది?
ఎ) అస్కార్బికామ్లం బి) ఫోలికామ్లం
సి) కాల్సిఫెరాల్ డి) టోకోఫెరాల్
10. ఈఈజీ (ఎలక్ట్రోఎన్సెప్లోగ్రాఫీ) అనేది ఏ అవయవం పని తీరును తెలుపుతుంది?
ఎ) హృదయం బి) మూత్రపిండం
సి) కాలేయం డి) మెదడు
11. రాజస్థాన్‌లోని బిష్నోరు తెగకు చెందిన అమృతా దేవి దేనికి కోసం కృషి చేశారు?
ఎ) వన సంరక్షణ
బి) భ్రూణ హత్యల నివారణ
సి) బాల్య వివాహాల నిర్మూలన
డి) కౌమార బాలికల ఆరోగ్యం
12. వేడి వాతావరణంలో మానవునిలో ఉష్ణోగ్రత క్రమతకు జరిగే సంఘటనలు?
1) రక్తనాళవిప్పారం 2) స్వేదనం
3) కేశస్తంభీకరణ చర్య 4) కేశసడలింపు చర్య
ఎ) 1, ,2 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 3, 4
13. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) టైఫాయిడ్- వైడల్ 2) ఎయిడ్స్- ఎలీసా
3) కుష్టు- మాంట్యూ 4) కలరా - పాప్ పరీక్ష
ఎ) 1, 2 బి) 2, 3 సి) 3,4 డి) 1, 4
14. ఆకుపచ్చ కాంతిలో కిరణజన్య సంయోగ క్రియ రేటు?
ఎ) సాధారణంగానే జరుగుతుంది
బి) రెట్టింపవుతుంది
సి) అసలు కిరణజన్య సంయోగ క్రియ జరగదు
డి) ఆగి ఆగి జరుగుతుంది
15. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) నాడీ స్పందన రేటు ొ హృదయ స్పదన రేటు
బి) అన్ని జీవకణాల్లో బ్రౌనియన్ చలనం జరుగుతుంది
సి) రక్తపీడనం చేసే పనిని బట్టి జరుగుతుంది
డి) రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలే పసుపు రంగు ద్రవం ప్లాస్మా
16. సూక్ష్మ జీవ రహిత విధానం (స్టెరిలైజేషన్)కు మూలం?
ఎ) వాక్సినైజేషన్ బి) పాశ్చరైజేషన్
సి) కిణ్వనం డి) రోమినేషన్
17. ఇటీవల గోవాలో కనుగొన్న కీటకం పేరు?
ఎ) పోలిస్టెస్ కరోలినా బి) వెస్పా వెలూటినా
సి) పోలిస్టెస్ డొమిన్యులా
డి) కుడికూమియా రంగేకరి
18. 'గల్ఫ్ ఆఫ్ ఏడెన్' పర్యవేక్షణ కోసం భారత నౌకాదళం ఒమన్‌లోని నుంచి ప్రారంభించిన దీర్ఘశ్రేణి మ్యారీటైం సర్వీలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్?
ఎ) పీ-8 ఇండియా (పీ-8ఐ) బి) మిగ్ - 29
సి) హెచ్ఏఎల్ కిరణ్ డి) హెచ్ఏఎల్ చేతక్
19. సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు మరిగే స్థానం విలువలు వరుసగా?
1) 0°C, 32°F, 273K
2) 100°C, 212°F, 273K
3) 100°C, 212°F, 373K
4) 100°C, 212°K, 373°F
20. ద్రవ గాజు థర్మామీటర్లలో అధికంగా ఉపయో గించే పదార్థాలు?
ఎ) నీరు - పాదరసం బి) నీరు - ఆల్కహాల్
సి) పాదరసం- ఆల్కహాల్ డి) పాదరసం - నూనె
21. ద్రవాన్ని వేడి చేసినపుడు అందులో ఉండే వాయువుల ద్రావణీయత..?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) తగ్గి పెరుగుతుంది డి) పెరిగి తగ్గుతుంది
సమాధానాలు
1.బి 2.బి 3.సి 4.బి 5.ఎ
6.ఎ 7.డి 8.సి 9.బి 10.డి
11.ఎ 12.సి 13.సి 14.సి 15.డి
16.బి 17.డి 18.ఎ 19.సి 20.సి
21.బి
Authorization