1. సంపూర్ణపోటీ మార్కెట్లో మూసి వేత బిందువు ఎక్కడ వుంటుంది?
ఎ) ధర = సగటు చర వ్యయం
బి) ధర = సగటు స్థిర వ్యయం
సి) ధర = ఉపాంత వ్యయం
డి) ధర = ఉపాంత రాబడి
2. నిశ్చల, చలన అనే పదాలను మొదటగా సామాజిక శాస్త్రంలో ఉపయోగించిందిఎవరు?
ఎ) జె.ఎస్. మిల్ బి) అగస్టీ కొమ్టే
సి) రాగ్నార్ ఫ్రిచ్ డి) డేవిడ్ రికార్డో
3. సంపూర్ణ పోటి మార్కెట్లో స్వల్ప కాలంలో ఏ రేఖను సప్లరు రేఖగా పేర్కొంటారు.
ఎ) ఉపాంత వ్యయ రేఖ
బి) సగటు వ్యయ రేఖ
సి) ఉపాంత రాబడి రేఖ
డి) సగటు రాబడి రేఖ
4. సగటు వ్యయం అనగానేమి ?
ఎ) AFC + TC
బి) TC÷ వస్తురాశి
సి)TC x వస్తురాశి
డి) AVC + TVC
5. మార్కెట్ కాలంలో సప్లరు రేఖ ఏ ఆకారం కల్గి ఉంటుంది.?
ఎ) OY - అక్షానికి సమాంతరం
బి) OX- అక్షానికి సమాంతరం
సి) రుణాత్మకవాలు
డి) ధనాత్మకవాలు
6. సరికాని జత ఏది ?
ఎ)TFC - OX అక్షానికి సమాంతరం
బి) AFC - హైపర్ బోలా
సి) AC- U ఆకారం
డి) MC- రుణాత్మకవాలు
7. డిమాండ్ రేఖ హైపర్ బోలా ఆకారంలో వుంటే, ఉపాంత రాబడి రేఖ ఎట్లా ఉంటుంది.
ఎ) OY అక్షంలో కలిసి ఉంటుంది.
బి) OX అక్షంలో కలిసి ఉంటుంది.
సి) ధనాత్మకవాలు
డి) రుణాత్మకవాలు
8. ఆదాయం పెరిగినప్పుడు వినియోగదారుడు %x% వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తే ?
ఎ) X మేలురకమైనది బి) X నాసిరకమైనది
సి) X తటస్థ వస్తువు డి) X నశ్వర వస్తువు
9. ధర నిర్ణయంలో కాలవ్యవధి ప్రాముఖ్యాన్ని పేర్కొన్న అర్థిక వేత్త ఎవరు?
ఎ) లర్నర్ బి) జోన్ రాబిన్సన్
సి) చేంబర్లిన్ డి) ఆల్ఫ్రెడ్ మార్షల్.
10. శ్రేయస్సు నిర్వచనాన్ని నూతన శిఖరాలకు చేర్చినదెవరు?
ఎ) ఆల్ఫ్రెడ్ మార్షల్ బి) ఎ.సి పిగూ
సి) బెవరిడ్జ్ డి) పారిటో
11. అర్థ శాస్త్రంలో మార్కెట్ అనే దాని విషయంలో నిజం కాని అంశం ఏది ?
ఎ) మార్కెట్ కు స్థలంతో నిమిత్తం లేదు
బి) మార్కెట్ ను సప్లరు, డిమాండ్ కలిసి నిర్ణయిస్తాయి
సి) మార్కెట్ కు దూరంతో నిమిత్తం లేదు
డి) అమ్మకం దారులు కొనుగోలు దారులు ప్రత్యక్షంగా కలుసుకొనడం.
12. ఒకే కొనుగోలుదారుడు, ఒకే అమ్మకందారుడు వుండే మార్కెట్ ఏది?
ఎ) ఏకస్వామ్యం బి) ధ్విస్వామ్యం
సి) ద్వైపాక్షిక ఏకస్వామ్యం డి) మోనోప్సనీ
13. ఏకస్వామ్యాన్ని ఏక సంస్థ పరిశ్రమ అంటారు ఎందువల్ల?.
ఎ) ఏకస్వామ్యదారుడు ధరవిచక్షణ చేయడం వలన
బి) డిమాండు రేఖ ఋణాత్మకంగా వుండడం వలన
సి) వస్తువైవిధ్యం వుండడం వలన
డి) ఒకే అమ్మకందారుడు వుండడం వలన
14. కింది వానిలో దీర్ఘకాలిక సగటు వ్యయరేఖ ఏది?
ఎ) కప్పేరేఖ బి) లెర్నింగ్ రేఖ
సి)ఎ, బి డి) ఏదీకాదు
15. %అసంపూర్ణపోటీ మార్కెట్లో AR రేఖ కింద MR రేఖ వుండడానికి కారణం?
ఎ) ఉత్పత్తదారులు అధిక లాభాలు ఆర్జించడం
బి) ఎక్కువ ధరకు తక్కువ వస్తువులను అమ్మడం
సి) తక్కువ ధరకు ఎక్కువ వస్తువులను అమ్మడం
డి) బి, సి
16. ఏ సమస్యను ''ఆర్థిక సమస్య'' గా పేర్కొంటారు?
ఎ) ఉత్పత్తి సమస్య
బి) పంపణీ సమస్య
సి) ఎంపిక సమస్య
డి) వినిమయ సమస్య
17. పరిశ్రమలో తయారైన వస్తువులను వినియోగ ప్రదేశాలకు తరలించడాన్ని ఏ ప్రయోజనంగా చెప్పవచ్చును?
ఎ) ఆకార ప్రయోజనం బి) కాల ప్రయోజనం
సి) స్థాన ప్రయోజనం డి) సేవ ప్రయోజనం
18. క్షీణోపాంత ప్రయోజన సూత్రంలో నిజమైనవి ఏవి?
1) ప్రయోజనాన్ని ''యూటిల్స్''లలో కొలుస్తారు.
2) ద్రవ్యం ఉపాంత ప్రయోజనం స్థిరంగా వుంటుంది.
3) మొత్తం ప్రయోజనం పెరుగుతున్నప్పుడు, ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది.
4) మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకమౌతుంది.
5) మొత్తం ప్రయోజనం తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకమౌతుంది.
ఎ) 1,2,3,5 బి) 1,2,3,4
సి) 2,3,4,5 డి) 1,2,4,5,
19. అదనపు వస్తువును వినియోగించడం వలన పొందిన ప్రయోజనాన్ని ఏమంటారు?
ఎ) మొత్తం ప్రయోజనం
బి) కార్డినల్ ప్రయోజనం
సి) ఆర్డినల్ ప్రయోజనం
డి) ఉపాంత ప్రయోజనం
20. డిమాండు ఫలం Qdx = 40 - 5P గా వున్నప్పుడు, ధర రూ. 3 అయితే వినియోగదారుడు ఎన్ని వస్తు వులను డిమాండు చేస్తాడు?
ఎ) 15 బి) 20 సి) 25 డి) 30
21. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రాముఖ్యత లోని అంశాలేవి?
1.పన్నుల విధానానికి దోహదపడుతుంది
2.విలువ సిద్ధాంతానికి ప్రాతిపదిక.
3.డిమాండు రేఖ వాలును తెలియజేస్తుంది.
4.జాతీయాదాయాన్ని తెలుసుకొనవచ్చును.
5.దేశంలోని ఆదాయ అసమానతలు తెలుసుకొనవ చ్చును.
6.సామ్యవాదుల వాదనకు బలం చేకూర్చుతున్నది
ఎ) 1,2,3,4 బి) 1,2,3,6
సి) 2,3,4,5 డి) 3,4,5,6
22. డిమాండును నిర్ణయించే అంశాలలో లేనిది ఏది?
ఎ) వస్తువు ధర
బి) వినియోగదారుని ఆదాయం
సి) ఉత్పత్తికారకాల ధరల
డి) ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు
23. స్వతంత్ర చలాంకం కానిది ఏది?
ఎ) వినియోగదారుని ఆదాయం
బి) వస్తువు ధర
సి) ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు
డి) వస్తువు డిమాండు
24. ఉత్పన్న డిమాండు వుండే వస్తువు ఏది?
ఎ) యంత్రం బి) ఆహారం
సి) పాదరక్షలు డి) సైకిలు
25. డిమాండు అంటే వస్తువును కొనాలనే కోరికతో పాటు కలిగి వుండడం.
ఎ) వినియోగించగలిగే శక్తి
బి) ఉపయోగించగలిగే శక్తి
సి) ఉత్పత్తి చేయగలిగే శక్తి
డి) కొనుగోలుచేసే శక్తి
26. భిన్నమైనది ఏది?
ఎ) పాలు - పంచదార బి) వెన్న - రొట్టె
సి) సిమెంటు - ఇసుక డి) టీ - కాఫీ
27. బడ్జెట్ రేఖ దేనిపై ఆధారపడి వుంటుంది?
ఎ) వినియోగదారుని ఆదాయం
బి) వినియోగించే వస్తువుల సాపేక్ష ధరలు
సి) ఎ, బి
డి) అభిరుచులు, అలవాట్లు
28. పూరక వస్తువుల ఉదాసీనతా వక్ర రేఖ ఏ ఆకారం లో వుంటుంది?
ఎ) రుణాత్మకవాలు బి) ధనాత్మకవాలు
సి)Z ఆకారం డి) L ఆకారం
29. లెర్నింగ్ బై డూయింగ్ (Learning by doing)L ఆకారంలో వుండే రేఖ ఏది?
ఎ) దీర్గకాలిక ఉపాంత రాబడి రేఖ
బి) దీర్గకాలిక సగటు రాబడి రేఖ
సి) దీర్గకాలిక ఉపాంత వ్యయ రేఖ
డి) దీర్గకాలిక సగటు వ్యయ రేఖ
30. సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలు రుణాత్మక వాలు కలిగివుండని మార్కెట్ ఏది?
ఎ) ఏకస్వామ్యం
బి) ఏకస్వామ్యపోటీ
సి) పరిమిత స్వామ్యం
డి) సంపూర్ణపోటీ
31. X,Y వస్తువులు రెండూ మేలు రకమైనవైతే ఆదాయ వినియోగ రేఖ ఏ ఆకారంలో వుంటుంది?
ఎ) రుణాత్మకవాలు కలిగి వుంటుంది
బి) ధనాత్మకవాలు కలిగి వుంటుంది
సి) OX అక్షానికి సమాంతరంగా వుంటుంది
డి) OY అక్షానికి సమాంతరంగా వుంటుంది
32. ఏ విశ్లేషణలో ధరలో వచ్చే మార్పును ఆదాయ, ప్రత్యామ్నాయ ప్రభావాలుగా విడదీసి చూపవచ్చును?
ఎ) క్షీణోపాంత ప్రయోజన విశ్లేషణ
బి) సమోపాంత ప్రయోజన విశ్లేషణ
సి) ఉదాసీనతా రేఖల ప్రయోజన విశ్లేషణ
డి) సమోత్పాదక రేఖల విశ్లేషణ
33. కొరత నిర్వచనం ఏ గ్రంథంలో ఇచ్చారు?
ఎ) An Inquiry into the Nature and Causes of Wealth of Nations
బి) Principles of Economics
సి) An Essay on the Nature and Significa nce of Economic Science.
డి)On the Principles of Political Economy and Taxation
34. ఒక వస్తువు ధరలో మార్పు రావడం వల్ల, ఆ వస్తువు డిమాండులో వచ్చిన మార్పును సంఖ్యాత్మకంగా తెలిపేది ఏది?
ఎ) పూరక జాత్యంతర డిమాండు వ్యాకోచత్వం
బి) ప్రత్యమ్నాయ జాత్యంతర డిమాండు వ్యాకోచత్వం
సి) ఆదాయ డిమాండు వ్యాకోచత్వం
డి) ధర డిమాండు వ్యాకోచత్వం
35. ఏ రంగాన్ని దష్టిలో వుంచుకొని మార్షల్ '' క్షీణ ప్రతిఫల సూత్రం'' ను వివరించినాడు?
ఎ) పారిశ్రామిక రంగం
బి) వ్యవసాయ రంగం
సి) సేవల రంగం డి) పైవన్నీ
36. వ్యక్తుల వద్ద దయనందిన వ్యవహారాల కోసం నగదు రూపంలో వున్న ద్రవ్యాన్ని ఏమంటారు ?
ఎ) ఆక్టివ్ మనీ బి) ఐడిల్ మనీ
సి) స్టాండర్డ్ మనీ డి) నియర్ మనీ
37. ఈ కింది వానిలో భిన్నమైనది ఏది?
ఎ) ఉపాంత మూలధన సామర్థ్యం
బి) సార్థక డిమాండు
సి) ద్రవ్యోల్భణ విరామం
డి) సే మార్కెట్ సూత్రం
38. కీన్స్ ప్రకారం పెట్టుబడిని నిర్ణయించడంలో దేనికి ప్రధాన పాత్ర వుంటుంది?
ఎ) ఉపాంత వినియోగ ప్రవృత్తి
బి) సగటు వినియోగ ప్రవృత్తి
సి) గుణకం
డి) ఉపాంత మూలదన సామర్థ్యం
39. సంప్రదాయ వాదుల ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో నిజం కానిది ఏది?
ఎ) దీర్ఘకాలం-సప్లరులకు ప్రాధాన్యత
బి) స్వేచ్ఛా వ్యాపార విధానం (Laissez Faire).
సి) సప్లరు తనకు తాను డిమాండు సష్టించుకొంటుంది.
డి) ప్రభుత్వ జోక్యం వుండాలి.
40. సంపద నిల్వ చలాంకం కాగా ఆదాయం ....?
ఎ) స్థిర చలాంకం
బి) స్వతంత్ర చలాంకం
సి) అస్వతంత్ర చలాంకం
డి) ప్రవాహ చలాంకం.
సమాధానాలు
1.ఎ 2.బి 3.ఎ 4.బి 5.ఎ
6.డి 7.బి 8.ఎ 9.డి 10.డి
11.డి 12.సి 13.డి 14.సి 15.డి
16.సి 17.సి 18.ఎ 19.డి 20.సి
21.బి 22.సి 23.డి 24.ఎ 25.డి
26.డి 27.సి 28.డి 29.డి 30.డి
31.బి 32.సి 33.సి 34.డి 35.బి
36.ఎ 37.డి 38.డి 39.డి 40.డి
Authorization