హజోంగ్ తెగ ప్రజలు ఈశాన్య భారతంలోను, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్లో ఎక్కువగా నివసిస్తున్నారు. ముఖ్యంగా మేఘాలయలో నివసించే తెగల్లో వీరు నాలుగో అతి పెద్ద తెగవారు. వీరు తమ తెగవారిని తప్ప వేరేవారిని పెండ్లాడరు. మాతృస్వామిక వ్యవస్థ ఉన్న ఈ తెగలో హిందు |
జాతర
| www.NavaTelangana.com
హజోంగ్ తెగ ప్రజలు ఈశాన్య భారతంలోను, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్లో ఎక్కువగా నివసిస్తున్నారు. ముఖ్యంగా మేఘాలయలో నివసించే తెగల్లో వీరు నాలుగో అతి పెద్ద తెగవారు. వీరు తమ తెగవారిని తప్ప వేరేవారిని పెండ్లాడరు. మాతృస్వామిక వ్యవస్థ ఉన్న ఈ తెగలో హిందు
హజోంగ్ తెగ ప్రజలు ఈశాన్య భారతంలోను, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్లో ఎక్కువగా నివసిస్తున్నారు. ముఖ్యంగా మేఘాలయలో నివసించే తెగల్లో వీరు నాలుగో అతి పెద్ద తెగవారు. వీరు తమ తెగవారిని తప్ప వేరేవారిని పెండ్లాడరు. మాతృస్వామిక వ్యవస్థ ఉన్న ఈ తెగలో హిందు మత ప్రభావం వల్ల మార్పులు వస్తున్నాయి. శృంగార ప్రేమలు, వితంతు వివాహాలకు అనుమతి ఉంది. ఒకరిని మాత్రమే పెండ్లి చేసుకునే ఆచారం ఉంది. చాలా కాలం నుండే వీరు హిందు ఆచార సంప్రదాయాలను పాటిస్తున్నారు. వీరు చేత్తో నేసిన సంప్రదాయ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. స్త్రీలు పాతిన్ అనే ప్రత్యేకమైన డ్రెస్ ధరిస్తారు. ఈ దుస్తుల వల్ల వీరిని ఎక్కడున్నా గుర్తించవచ్చు. ధులుక్, ఖుల్, దోతర అనే సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారు.