ఆచార సంప్రదాయాలు చాలా బలమైనవి. వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు ఏవైనా... పాటించడానికే ప్రపంచవ్యాప్తంగా జనం ఇష్టపడతారు. అందుకు అభివృద్ధి చెందిన దేశాలని, వెనుకబడిన దేశాలనే మినహాయింపు ఏమీ ఉండదు. జర్మనీలోని ఈ సంప్రదాయం చూస్తే ఇట్లాగే అనిపిస్తుంది. జర్మనీలో పెళ్ళికి ముందు ఓ విచిత్రమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఆ సంప్రదాయం పేరు పొల్టరాబెండ్. పెళ్ళి కుదిరిన తరువాత ఒక విందు ఏర్పాటు చేస్తారు. ఈ విందుకు బంధువులు, స్నేహితులు హాజరవుతారు. భోజనాలు అయినతరువాత చేతికి దొరికిన వస్తువును దొరికినట్లు పగలగొడతారు అతిథులు. గాజుతో చేసిన పాత్రలు, అద్దాలు తప్ప అందుబాటులో వున్న పూల కుండీలు, టైల్స్, టాయిలెట్స్... ఇలా ఏదీ విధ్వంస కాండకు మినహాయింపు కాదు. ఈ పగలగొట్టే కార్యక్రమం అయిపోయిన తరువాత పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కలిసి పగిలిన ముక్కలను ఏరి శుభ్రం చెయ్యాలి. వివాహానంతరం భవిష్యత్తులో రాబోయే కష్టాలను కలిసి ఎదుర్కోవడానికి కావలసిన సంసిద్ధతతకు ప్రతీకగా కాబోయే దంపతుల చేత ఈ పని చేయిస్తారు. ఇది తరతరాలుగా జర్మనీలో అనుసరిస్తున్న ఓ సంప్రదాయం.