మధ్య విదేశీ పర్యటనలకు వెళ్లేవారి శాతం బాగానే పెరిగిపోయింది. విమాన ప్రయాణం చౌక అవ్వడంతో వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, అచారాలు తెలుసుకోవాలని, చూడాలని అనుకునేవారు విమాన యాన సంస్థలు ఇచ్చే ప్యాకేజీలను బాగానే ఉపయోగించుకుంటున్నారు. కేవలం వినోదం కోసమే కాకుండా అనేక దేశాలకు ఉద్యోగ రిత్యా వెళ్లేవారి సంఖ్యా పెరిగింది. వీరందరూ ఆయా దేశాలకు వెళ్లేటప్పుడు స్థానిక సంస్కృతులు, ఆచారాలపై కొంత అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. ఆయా దేశాలకు వెళ్లినప్పుడు మనకు తెలియకుండా ఒక్కోసారి ఆ సంప్రదాయాలను అతిక్రమిస్తూ ఉంటాం. ఫలితంగా స్థానికుల మనసులను గాయపరచినవారం అవుతాం. అందుకే వివిధ దేశాల్లో ఉన్న కొన్ని సంప్రదాయాలు మీ కోసం...
ఉప్పు తక్కువయింది కదాని...
ఈజిప్టులో ఆతిథ్యం స్వీకరించేటప్పుడు... ముఖ్యంగా భోజనం చేసేటప'డు కొన్ని మర్యాదలు పాటించాలి. ఉదాహరణకు ఆతిథ్యం ఇచ్చినవారు వడ్డించిన ఆహారంలో ఉప్పు 'తక్కువయింది కదా అనిచెప్పి సాల్ట్ కలుపుకుని తినే ప్రయత్నం చెయ్యకూడదు. అది భోజనం పెడుతున్నవారిని అవమానించడమే అవుతుంది.
స్పూన్, ఫోర్కులు ఉపయోగించాల్సిందే
నార్వేలో టేబుల్ మేనర్స్ని చాలా కచ్చితంగా పాటించాలి. తినవలసిన ఆహార పదార్థేలేవైనా సరే స్పూన్, ఫోర్క్ వంటి వస్తువులను ఉపయోగించి తినాల్సిందే. పొరపాటున కూడా చేత్తో డైరెక్టుగా పట్టుకుని తినకూడదు.
ఎత్తిన గ్లాసు దించకూడదు
రష్యాలో 'మందు'కొట్టేవాళ్లు ఓ నియమం తప్పనిసరిగా పాటించాలి. మత్తుపానీయాలు (ఆల్కహాల్ డ్రింక్స్) తాగే ముందు 'ఛీర్స్' అంటూ మందు గ్లాసులను ఒకదానికొకటి తగిలించుకుని ఎత్తిన గ్లాసును మళ్లీ టేబుల్ మీద పెట్టకుండా తాగెయ్యాలి. అంతేకానీ కొద్దిగా సిప్ చేసి గ్లాస్‌ని టేబుల్‌పై పెట్టి మళ్లీ తాగడం అక్కడ మర్యాద కాదు.
అరికాలు చూపిస్తే అవమానించినట్టే
థాయిలాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎవరికీ అరికాలు కనిపించకుండా జాగ్రత్తపడాలి. అరికాలు చూపిస్తే చాలా అవమానకరంగా భావిస్తారు అక్కడి ప్రజలు.
అక్కడ ఆలస్యంగా వెళ్లాలి
చిలీ, ఈక్వెడార్, వెనిజూలా వంటి దేశాల్లో భోజనానికి పిలిచారు కదా అని పిలిచిన సమయానికి కరెక్టుగా వెళ్లాం అనుకోండి... ఇంత ఆత్రమా అని చీదరించుకునే (మనసులోనే సుమా!) ప్రమాదం ఉంది. అందుకే ఎప్పుడైనా ఆ దేశాల్లో ఉన్నప్పుడు ఎవరైనా భోజనానికి పిలిస్తే పిలిచిన టైం కన్నా ముందుగాని, సరైన సమయానికి గానీ వెళ్లవద్దు. ఒక పావుగంట లేటుగా వెళ్లండేం..!
పసుపు రంగు మోసానికి గుర్తు!
రష్యాలో ఎవరికైనా పూలను బహుమతిగా ఇవ్వాలనుకుంటే కొన్ని ముఖ్యమైన సంగతులను మరిచి పోకూడదు. మీ స్నేహాన్నో, లేక ప్రేమనో చాటుకోవడం కోసం పువ్వు ఇవ్వాలనుకుంటే.. ఆ పువ్వు పసుపు రంగులో ఉన్న పువ్వు కాకుండా చూసుకోండి. అక్కడ పసుపు మోసానికి, విడిపోవడానికి చిహ్నంగా భావిస్తారు.
Authorization