తమిళనాడు రాష్ట్రంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి కడలూర్. ఇది బంగాళాఖాతం తీరంలో ఉంది. కడలూర్ అంటే తమిళంలో ''సముద్ర పట్టణం'' అని అర్థం. ఈ పట్టణం నిజంగానే అందమైన బీచ్లతో నిండి ఉంటుంది. కడలూర్ను పర్యాటక గమ్యస్థానంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కడలూర్లో పాత, కొత్త పట్టణాలు ఉంటాయి. పాత పట్టణాన్ని మొఘలుల పాలనలో ''ఇస్లామాబాద్''గా పిలిచేవారు. ఇప్పటికి అక్కడ ముస్లిం ప్రాబల్యం కొనసాగుతున్నది. 1748-1752 వరకు కడలూర్ బ్రిటిష్ పాలనలోనే ఉండేది. కడలూర్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు సిల్వర్ బీచ్, డేవిడ్ కోట, గార్డెన్ హౌస్, ఇతర చూడదగిన ప్రాంతాలు. ఇక్కడ ఉండే పిఛావరం అనే ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి. ఎందుకంటే ఇది జల క్రీడలకు ప్రసిద్ధి చెందినది. విస్తారమైన మడ అడవులు, పక్షుల కిలకిల రావాలను ప్రత్యేకంగా తిలకించాలనుకునే వారికి చక్కటి ప్రదేశం. దీంట్లో ఆకట్టుకునే దీవులు చాలా ఉన్నాయి. వాటితో పాటు లిగ్నైట్ గనులు, గడిలం కోట, క్యాపర్ కొండలు, చిదంబరం, శ్రీవైష్ణం వంటివి పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలు.