చరిత్రలోకి తొంగి చూస్తే ఎన్నో చిత్రమైన అంశాలు కని పిస్తాయి. అబ్బురపరిచే ఆనవాళ్ళు అనేకం దిగ్భ్రమకులోను చేస్తాయి. గత కాలపు వైచిత్రిని చూసి ముచ్చటపడతాం. అలాంటి వాటిలో సౌదీ అరేబియాలో వెలుగులో కొచ్చిన ఓ విచిత్ర గుహాలు సముదాయం మదైన్ సాలెV్‌ా. ఇక్కడ ప్రాచీన కాలం నాటి సమాధులను గుర్తించారు. ఇవి నబతియ రాజుల కాలానికి చెందిన శిథిలాలు. మదైన్ సాలెV్‌ా అనగా అరబ్బీ భాషలో 'సాలెV్‌ా నగరాలు.' దీన్ని ' అల్-హిజ్ర్', ' హిగ్ర' గా కూడా పిలుస్తారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు వాయువ్య దిశలో 1043 కి.మీ దూరంలో ఉంది. ఇస్లాం కు పూర్వం వెలసిన పురాతత్వ ప్రదేశం. మదైన్ సాలెV్‌ా ప్రాంతం అల్-ఉల నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సౌదీ అరేబియా లో 4000 పురావస్తు ప్రాంతాలలో ''స్మారక కట్టడాల రాజధాని' గా పేరొందింది.
ఇక్కడ ఇసుక రాళ్ళచే నిర్మించిన 131 స్మారక చిహ్నాలు గల గుహల రూపంలో ఉన్న సమాధులు. మదైన్ సాలెV్‌ా లో నబేతియనులు నివసించేవారు. వీరే ఇక్కడి కట్టడాలకు నాంది పలికిన వారు. నబతియనులు అరేబియన్ ప్రొవిన్సులకు చెందిన వారని పరిశోధకుల అభిప్రాయం. చరిత్ర కారుడైన దీదోర్ అల్ సకాలి ప్రకారం వీరు వ్యవసాయం తెలియని సంచార కాపరి తెగకు చెందిన వారు. అంతేకాకుండా వీరు నివసించిన ప్రాంతం రాళ్ల, రప్పల మయం కావడం చేత వీరికి నివాసయోగ్యం కాలేదు. నిశ్చలంగా ఓ చోట జీవించలేక పోయారు. ఇక్కడి పురాతత్వ ప్రదేశంలోని సమాధులలో ఉన్న నబతియనులు ధనవంతులైన వారు. ఈ సమాధులు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ల మధ్య కాలంలో భారీ సున్నపురాయి తో కళాత్మకంగా వివిధ ఆకతులలో కట్టారు. కొన్ని చోట్ల యజమానులు, వారి కుటుంబాలు, వత్తుల గురించిన సమాచారంతో ఈ సమాధి సొరంగాలు ఉంటాయి. ఇతర సమాధులు నబతియనుల పేర్లను, వారి సాంఘిక స్థితి, జీవన శైలి, ఖనన ఆచారాలను బట్టి కళాత్మకంగా సున్నపురాయి తో విభిన్న ఆకతులతో చెక్కారు. వీటి సింహా ద్వారాల పై డేగ, సింహిని, కుండలు, పాములు, పువ్వులు, రోసెట్టెలు, సౌర డిస్క్ ల ఆకతులు మొదలైనవి చెక్కారు. ఈ సమాధుల పరిరక్షణకు, అతిక్రమించిన లేదా ఉల్లంఘించిన వారికి శాపనార్ధాలు కూడా లిఖించారు. ఈ సమాధులను కట్టిన వారి పేర్లు, సంతకాలు వాటి పై ఉన్నాయి. చట్టపరమైన పరిమితులు, యజమాని జీవితం, మరణం గురించిన సమాచారాన్ని కూడా పొందుపరిచారు. సమాధి బాహ్యరూపాలు రేఖాగణిత నమూనాతో అలంకరించారు. ప్రాధమికంగా నిలువు, అడ్డంగా కొన్ని రేఖలు చిత్రించారు.
భారీ సమాధులు బహుశా ఉన్నత కుటుంబాలకు చెందినవారివే అయినప్పటికీ, పర్వత ప్రాంతాలలో శిలలతో చేసిన ఇతర సరళమైన సమాధుల గుహలు కూడా ఉన్నాయి. కాని ఇవి గొప్ప కళాత్మక నమూనాలను అనుసరించి లేవు. ప్రతి సమాధిలో అనేక శ్మశాన స్థలాలు ఉన్నాయి. వీటిలో చిన్న పిల్లలకు ప్రత్యేకమైన స్థలాలున్నాయి. ఈ సమాధులలో లిఖితమై నబతియన్ శాసనాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సమాధుల కట్టడాలలో చెప్పుకోదగ్గవి ''గస్ర్ అల్ ఫరీద్ '' : ఇది అల్-హిజ్ర్ (మదైన్ సాలెV్‌ా) లో ఉన్న అతి పెద్ద పురాతత్వ ప్రదేశం. ఇది ఉత్తరాన పెద్ద ముఖభాగాన్ని కలిగి ఉంది. అది ఒంటరిగా స్వతంత్రంగా నిలబడి ఉంది. ఒకే ఒక రాతి పై నిర్మించారు. మదైన్ సాలెV్‌ా లోని ఇతర సమాధులతో పోల్చగా దీని శిల్పం, సౌందర్యం చూడ ముచ్చటగా ఉంది. దాని సింహద్వారానికి ఓ పెద్ద ముఖభాగం ఉంది. ఈ ప్యాలస్ ను నిర్మించిన వాడు హయన్ బిన్ కొజ.
''గసర్ అల్ బింత్ '', 'ప్యాలెస్ ఆఫ్ డాటర్ ' గా ప్రసిద్ధి చెందినది. ఇది మరో పెద్ద సమాధి. దీని ఎత్తు 16 మీటర్లు. ఇందులో 19 సమాధులున్నాయి. ఇక్కడ ఎలాంటి అలంకరణలు చిత్రించ లేదు. ఏకాంత ప్రాంతం లో ఉన్న ఒకే ఒక ప్యాలెస్ లాంటి కట్టడం. ఓ సమాధి కట్టడంలో 'దివాన్ ' అనే స్థలం ఉంది. ఇది సభ ప్రాంగణం. మీటింగ్ హాల్ లాంటి విశాలమైన గది ఉన్నది. మదైన్ సాలెV్‌ా లో 130 బావుల ద్వారా నీటి సరఫరా ఉండేది. ఇండ్ల నిర్మాణానికి ఎండబెట్టిన ఇటుకలను వాడారు. ప్రస్తుతం పర్యాటక ప్రదేశంగా సౌదీ ప్రభుత్వం దీన్ని ప్రకటించింది.
నబతియ కాలం లో అతి ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి సుప్రసిద్ధం. వ్యాపార మార్గాల గుండా ముఖ్యంగా సువాసన గమ్, రెసిన్, అగరవత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి సరఫరా అయ్యేవి. గ్రీకులు, రోమన్స్, ఫోయొనేషియన్లు, ఇతర మధ్యధరా ప్రాంతీయులు తమ తమ వ్యాపారాలను కొనసాగించేవారు. మదైన్ సాలెV్‌ా నబతియన్ రాజ్యంలో 'పెట్ర' (జోర్డాన్ దేశం) తరువాత రెండవ పెద్ద నగరంగా ప్రాచుర్యం పొందింది. దీన్ని ''దక్షిణ రాజధాని'' గా కూడా పిలుస్తారు. మదైన్ సాలెV్‌ా సౌదీ అరేబియాలో మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది జూలై 6, 2008 న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నది. సౌది అరేబియాకు ఇది తొలి అంతర్జాతీయ పర్యాటక వరం! మదైన్ సాలెV్‌ా లో భుజించడం, పానీయాలు సేవించడం, నిద్రించడం నిషేధం. ఇక్కడి వాస్తు కళా వైభవం, చిత్రమైన గుహల సముదాయం ఓ ప్రత్యేక ఆకర్షణ.
- అమ్జద్
Authorization