సాహస యాత్ర, యాత్ర అనుభవాలు అనగానే రాహుల్ సాంకృత్యాయాన్, చే గువేరాల విశ్వదర్శనం, మోటార్ సైకిల్ డైరీస్ గుర్తొచ్చాయి. ఇక్కడా యాత్ర చేసింది ఒంటరిగానే. కానీ మహిళలు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాడాన్నే సాహసకత్యంగా చూస్తున్న చోట, దేశాలు దాటడం మాములు విషయం కాదు. నిజంగా సాహసకత్యమే. బజారుకు పోతానే లక్ష జాగ్రత్తలు చెప్పడాన్ని చూస్తున్నాం. వీళ్లకు అట్లే చెప్పి ఉంటారు. వెళ్లొద్దనే చెప్పారు. అయినా వాళ్ళు చూడాలనుకున్న ప్రపంచానికి వారి జెండర్ అడ్డంకి కాలేదు. జెండర్ చట్రాలను దాటి ప్రపంచాన్ని వాళ్ళు అనుకున్నట్లుగా తిరిగి రాసిన కథలివి.
రాబిన్ డేవిడ్సన్
ఆస్ట్రేలియా ఎడారుల గుండా, ఖండపు కొసకు నాలుగు ఒంటెలు, ఓ కుక్కతో కలిసి 1700 మైళ్ళు చేసిన యాత్ర. ఆ క్రమంలో ప్రకతితో ప్రేమలో పడడం. అది తన దేహానికి, మైండ్ కి, విశ్వాసానికి విసిరే సవాళ్ళు. ఇంతకమునుపు ఎన్నడూ ఎదుర్కోని సవాళ్ళు. ఆ సవాళ్లను ఎదుర్కొంటూ తాను తెలుసుకున్న లోతులు. తన బలం. తన ధైర్యం. అక్షరీకరిస్తే ట్రాక్స్: '' ఏ విమన్స్ సోలో ట్రాక్ ఆక్రాస్ 1700 మైల్స్ ఆఫ్ ఆస్టేలియన్ అవుట్ బ్యాక్'' చదువుతుంటే మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపించదు. మనం వెంటనే భుజాన సంచి తగిలించుకుని గడపదాటాలి అనిపించేలా ఉంటుంది.
అమంద లింధౌట్
ఈ పేరు పత్రికలు చదివేవారికి కాస్త పరిచయం ఉండే ఉంటుంది. ప్రపంచ యాత్రకు బయలుదేరిన ఒక టీనేజర్ కథ . కథ అనడం అన్నా గాథ అనడం సబబు. ప్రపంచాన్ని చుట్టడానికి ప్రతి పెన్నీ దాచుకొని లాటిన్ అమెరికా, లావోస్, బంగ్లాదేశ్, ఇండియా, సిరియా, పాకిస్థాన్ లు చుట్టింది. ఆమె ఒక ప్రఖ్యాత టివిలో జర్నలిస్టుగా పని చేయడానికి మునుపు ఇరాక్‌లో పర్యటించింది. కానీ 2008లో సోమాలియా పర్యటన పోయినప్పుడు 460 రోజులు అక్కడి మిలిటెంట్ల చేతిలో బందీగా ఉన్నది. బలవంతంగా ఇస్లాంలోకి మార్పిడి. లైంగిక దోపిడీకి గురి అయింది. ఆ స్థితుల నుండి తప్పించుకుని వెళ్లడం మాములు విషయం కాదు. అది ప్రాణాంతకమైనది. చివరికి తప్పించుకొని, ప్రపంచానికి తాను చాటిన విషయాలు ఒళ్ళు గగుర్పొడిచేవి. అయినా అవి ఏవి తన స్పిరిట్ ని దెబ్బతీయలేదని అంటారు. తన పుస్తకం '' ఏ హౌస్ ఇన్ ద స్కై''. ఆకాశంలో తాను నిర్మించాలకున్న కలలసౌధం ధ్వంసం అయిన. తిరిగి నిర్మించుకుంది. ఒక మహిళ యాత్రికురాలి పట్ల జరిగే అత్యంత జుగుప్సాకరమైన విషయాలు ఉన్న, చెక్కు చెదరని విశ్వాసమూ ఉన్న కథ.
సాహస యాత్రికురాళ్ళ కథలు
ఫెయిత్ కాన్లలోన్ కూర్చిన మహిళ సాహస యాత్రికురాళ్ళ కథలు ''ఏ విమన్ ఆలోన్, ట్రావెల్ టెక్స్ ఫ్రమ్ ఆరౌండ్ ద గ్లోబ్''. ఒంటరిగా యాత్రలు చేయాలనుకునే మహిళలు తప్పక చదవాల్సిన పుస్తకం. ప్రపంచాన్ని చుట్టిన ఒంటరి మహిళ కథలివి. సరైన ప్రణాళికతో కొందరు. అసలు ప్రణాళికలు అంటూ ఏమి లేకుండా వెళ్లాలనిపించి వెళ్లిన వాళ్ళు కొందరు. ఈ కథలన్నీ వారి పరిణామానికి గుర్తులు.
తాన్య షఫర్
ఆఫ్రికాకి యాత్ర కోసం పోవడమే కాదు. అక్కడి ప్రజలకు ఎదో చేయాలనే సంకల్పంతో పోయిన తాన్య గాథనే ''సమ్బడీస్ హర్ట్ ఈస్ బర్నింగ్''. ఘనా ఆఫ్రికాలో ఒకానొక దేశం. అక్కడికి ఓ సంవత్సరకాలం పాటు గడపడానికి వెళ్లడమే కాదు. ఆఫ్రికా ఖండంలో నిర్మించే బడులు, ఆసుపత్రులకు తానో వాలంటీర్ గా పనిచేసింది. ఒక దేశం నుండి మరొక దేశానికి అలానే పనిచేస్తూ పయనించింది.ఆ కాలమంతా తన రచన శక్తితో, తనకున్న సమయస్ఫూర్తి, నిజాయితీతో ఉత్తర అమెరికా సంస్కతి , ఆఫ్రికా ఖండ సంస్కతి మధ్య ఉన్న బేధాలను రాసింది.
Authorization