మీ పర్యటనకు సంబంధించిన విశేషాలను పోస్ట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తుంది ట్రావెల్ డైరీ అప్లికేషన్. సోషల్ నెట్వర్క్స్లాగానే పనిచేస్తుంది కానీ ఇందులో మీరు చేసిన పోస్ట్‌లు మీ ఫోన్లో మాత్రమే స్టోర్ అవుతాయి. తమ ట్రావెలింగ్ జ్ఞాపకాలను ప్రపంచానికి తెలియచేయడం ఇష్టంలేని వాళ్లు ఆ జ్ఞాపకాలను తమతో మాత్రమే భద్రంగా తీసుకెళ్లేందుకు సాయం చేస్తుంది ఈ అప్లికేషన్. ట్రావెల్ డైరీ ఫీచర్స్ ఏంటంటే...
మీ ట్రావెల్‌కు సంబంధించిన పోస్ట్‌లను డైరీలో చేర్చొచ్చు. ప్రతీ పోస్టులో ఫోటోలతో పాటు దానికి సంబంధించిన సమాచా రాన్ని కూడా రాసుకోవచ్చు. పోస్ట్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. అవసరం లేదనిపిస్తే డిలీట్ కూడా చేసు కోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఇ-మెయిల్ ద్వారా సింగిల్ పోస్ట్‌లను షేర్ చేసుకోవచ్చు. వేరు వేరు ట్రిప్స్‌కు సంబంధిం చిన పోస్ట్‌లను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎస్డి కార్డులో డేటాను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోర్టు చేయడంతోపాటు బ్యాకప్ తీసు కునే సౌకర్యం కూడా ఉంది. డైరీలో రంగులు మార్చుకోవచ్చు. ఏ ఫొటోకి సంబంధించిన సమాచారాన్ని ఆ ఫొటో కింద రాసుకునే సౌకర్యం ఉంది. మీ ట్రిప్ డైరీలను ఓపెన్ ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్‌లోకి ఎక్స్‌పోర్టు చేసుకోవచ్చు.
చేత్తో నోటు పుస్తకం పట్టుకుని రాసే పనిలేకుండా ఫోన్లోనే రాసుకోవడం బాగుంది కదా. అంతా బాగానే ఉంది కాని ఈ అప్లికేషన్లో మీ పోస్ట్‌లకు వీడియోలు, మ్యాప్‌లు పొందుపరిచే ఆప్షన్ ఇంకా చేర్చలేదు. అలాగే సోషల్ నెట్‌వర్క్స్‌లో ఈ పోస్ట్‌లు పంచు మీ ట్రిప్ డైరీను మిగతా డివైజ్లతో సింక్రనైజ్ చేయలేరు. ఒకవేళ మీ డేటాను పాత ఫోనులోకి మార్చుకోవాలంటే 'ఎక్స్‌పోర్టు', 'ఇంపోర్టు' మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రైవసీ విషయానికి వస్తే... మీ డేటా మీ సొంతమే. అంటే హండ్రెడ్ పర్సంట్ సేఫ్ అన్నమాట. ఇదే కాకుండా ట్రావెల్‌కి సంబంధించిన మరికొన్ని అప్లికేషన్లు... ట్రిప్ఇట్, టూరిస్ట్ ఐ, ప్యాక్ పాయింట్ ట్రావెల్, ఎక్స్పీడియా హౌటల్స్, ట్రావెల్ మ్యాప్ మేకర్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, హు పెయిడ్ లాస్ట్ వంటివెన్నో ఉన్నాయి. వీటిని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.మరెందుకు ఆలస్యం ట్రావెల్ డైరీలో మీ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోండి.
Authorization