కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. సరదాగా స్నేహితులతో ఎంజారు చేసినప్పుడు.. సెల్ఫీలు, ఫొటోలు దిగలాను కుంటారు చాలామంది. అలాంటి మధురమైన జ్ఞాపకాలను మీ కండ్లతో బంధించాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు...
- బరువైన కెమెరాలు విమానాల్లో తీసుకెళ్ల డానికి నిబంధనలు ఉంటాయి. బట్టలకంటే తేలికైన కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వెంట తీసుకెళ్ల డానికి ఇబ్బందిలేని పాకెట్ కెమెరాలు ఇంకా ఉత్తమం. ముందుగా మీరు వెళ్లబోయే చోటు ఎలాంటిదో తెలుసుకోండి.
- సూర్యాస్తమయానికి ముందే నిద్రలేవాలి. అప్పుడే ఉషోదయ వేళలో ఉండే ప్రకృతి అద్భుత సౌంద ర్యాన్ని కెమెరాలో బంధించవచ్చు. అలాగే సూర్యా స్తమ సమయమూ అత్యద్భుతంగా ఉంటుంది.
- ప్రయాణంలో కెమెరా ఫీచర్స్ గురించి తెలుసుకుంటూ వెళితే, సరైన ఫొటో మీకు లభించదు. బయల్దేరక ముందే కెమెరా, లెన్స్, ఫ్లాష్.. వంటివి ఇంటి వద్దే చూసి నేర్చుకోవాలి.
- దేవాలయాలు, ఆర్ట్ గ్యాలరీలు, నృత్యం, సంగీతం.. వంటివి ఫొటోలలో బంధించేముందు వాటికి సంబంధించిన కొన్ని పుస్తకాలను చదవడం వల్ల మరింత పరిజ్ఞానం లభిస్తుంది. దీని వల్ల ఒక క్రమపద్ధతిలో కళాత్మకంగా ఫొటోలు తీసే నేర్పు అలవడుతుంది.
- టూర్ అన్నాం కదా అని అన్నీ వేగంగా చూసేస్తే సరిపోతుంది అనుకోకూడదు. దారిలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. ఆ ప్రాంత ప్రత్యేకత ఫొటోల ద్వారా తెలియజేయాలనుకుంటే స్థానికులతో మాట్లాడితే సరైన సమాధానం లభిస్తుంది.
Authorization