పర్యాటక ప్రదేశాలకు వెళ్ళడం.. అక్కడి అందాలను వీక్షించడం.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడం.. ఇది చాలా మంది పర్యాటకులు చేసే పనే. కానీ అదే టూరిస్ట్ ప్లేస్‌లో సాహసం చేస్తే ఎలా ఉంటుంది ? భలే థ్రిల్ గా ఉంటుంది కదూ..! సాహసాలను ఇష్టపడే టూరిస్టుల కోసం ప్రత్యేక మైన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవేంటంటే...
న్యూజిలాండ్: ఇక్కడి పలు కొండలు మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఉంటాయి. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎవరైనా ఎంజారు చేస్తారు. ఇక్కడి క్వీన్స్ టౌన్ అనే ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న కొండల వద్ద స్కీయింగ్ స్పాట్ ఉంది. హెలికాప్టర్ నుంచి కిందకు దూకి స్కీయింగ్ చేస్తే వచ్చే మజాయే వేరు. స్కీయింగ్ చేస్తూ అలా అలా నేషనల్ పార్క్‌ను చుట్టేసి రావచ్చు. ఇష్టంగా ఉంటే మీరూ ఒకసారి వెళ్లిరండి మరి.
కాంబోడియా: ఇక్కడి బీచ్‌లు ఫ్లై బోర్డింగ్ సాహస క్రీడకు పెట్టింది పేరు. అలలపై 10 మీటర్ల ఎత్తులో ఈ సాహసాలను చేయాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉంటే కాంబోడియాకు మీరు నిరభ్యంతరంగా వెళ్లి అడ్వెంచర్స్ చేయవచ్చు.
థారులాండ్: మీకు షార్క్ లంటే ఏమాత్రం భయంలేదా..? అయితే బ్యాంగ్కాక్లోని ప్లానెట్ స్కూబాకు వెళ్లి షార్క్‌ల నడుమ ఈత కొట్టవచ్చు. ఒకవేళ ఈత కొట్టకున్నా అక్కడి అక్వేరియం అందాలను ఎంజారు చేయవచ్చు.
సింగపూర్: సింగపూర్‌లోని సెంటోసా ఐల్యాండ్‌లో ఉన్న మెగా అడ్వెంచర్ పార్క్‌లో మెగాజిప్ పేరిట ఓ జిప్‌లైన్ ఉంది. సముద్రానికి పక్కనే ఉన్న అడవికి మధ్యలో ఉంటుంది. దీని గుండా వెళితే సముద్రం అందాలను, అడవి ఆహ్లాదాన్ని ఏక కాలంలో ఆస్వాదించవచ్చు. ఈ జిప్‌లైన్ 450 మీటర్ల పొడవుంటుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. సముద్ర మట్టానికి 75 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది.
హాంగ్ కాంగ్: హాంగ్ కాంగ్ పేరు చెప్పగానే మనకు మొదట బంగీ జంపింగ్ గుర్తుకు వస్తుంది. ఇక్కడి ఏజే హాకెట్ మకౌ టవర్ పైనుంచి బంగీ జంప్ చేయవచ్చు. కానీ చేసేందుకు మాత్రం చాలా ధైర్యం ఉండాలి.
Authorization