ప్రస్తుతం పైన సూర్యుడు భగభగ మండుతుంటాడు. ఈ ఎండల నుంచి తప్పించుకోడానికి హిల్ స్టేషన్లను సందర్శించడానికి ఎవరైనా ఇష్టపడతారు. అయితే వీటి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. హైదరాబాద్‌కు దగ్గరలోనే ఎన్నో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వేసవిని తక్కువ ఖర్చుతోఎంజారు చేద్దాం.
దండేలి: హైదరాబాద్ సమీపంలోని అడ్వెంచర్ హిల్ స్టేషన్స్‌లో దండేలి ఒకటి. వివిధ సంస్కృతులకు, ఆకుపచ్చ పరిసరాలకు ఇది ఎంతో ప్రసిద్ధి. ఏడాది మొత్తం అనుకూలమైన వాతావరణం ఉండే ఓ గొప్ప హిల్ స్టేషన్ ఇది. హైదరాబాద్ నుంచి ఈ ప్రదేశం 595 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ లోని కాచీగూడ స్టేషన్ నుండి హుబ్లీ జంక్షన్ వరకు ప్రయాణం చేయాలి. హుబ్లీకి దండేలి అతి తక్కువ దూరంలోనే ఉంది. ఉష్ణమండల వర్షారణ్యం ప్రాంతమైన దండేలి ట్రెక్కింగ్‌కు ఎంతో అనువైనది. అలాగే వాటర్ స్పోర్ట్స్‌కు ఇది ఎంతో ప్రసిద్ధి. దండేలి వన్యప్రాణుల అభయారణ్యం కూడా తప్పకుండా సందర్శించాల్సిందే.
అనంతగిరి హిల్స్: హైదరాబాద్‌లోనున్న అనంతగిరి హిల్స్ అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఇది ఓ అనుకూలమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఈ హిల్ స్టేషన్లో ప్రకృతిని ఎంతగానో ఆశ్వాదించవచ్చు. హైదరాబాద్‌కి ఈ హిల్ స్టేషన్ 81 కిలోమీటర్ల దూరం ఉంది. వికారాబాద్ రైల్వేస్టేషన్ నుంచి అనంతగిరి హిల్ స్టేషన్‌ను చేరుకోవచ్చు. మొదటిసారి ట్రెక్కిక్ చేయాలనుకునే వారికి ఇది ఓ చక్కని ప్రదేశం. అనంతగిరి అడవులలో అందమైన జలపాతాలు, లోయలు మనకు కనివిందు చేస్తాయి. రాక్ క్లైంబింగ్, బ్యాలెన్సింగ్ బోర్డులు, స్పైడర్ వెబ్, టార్జాన్ స్వింగ్ వంటి ఆక్టివిటీస్‌లో కూడా పాల్గొనవచ్చు.
లంబసింగి: దక్షిణ భారతదేశంలో నిజంగా ఓ అద్భుతమైన ప్రదేశం లంబసింగి అని చెప్పుకోవచ్చు. దక్షిణ భారత కాశ్మీర్‌గా ఇది గుర్తింపు పొందింది. వేసవి వేడిని తరిమి కొట్టేందుకు పర్ఫెక్ట్ ప్రదేశం ఈ లంబసింగి. శీతాకాలంలో స్నో ఫాల్ ఎంజారు చేయాలంటే మీరు తప్పకుండా అక్కడకు వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి ఈ హిల్ స్టేషన్ కి 571 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కి చేరుకొని అక్కడ నుంచి ఈ ప్రదేశానికి క్యాబ్ ద్వారా వెళ్ళవచ్చు. ఈ హిల్ స్టేషన్లో చల్లటి, నిశ్శబ్దపు ప్రకృతి అందాలు ఉంటాయి. ఇంకా కాఫీ, మిరియాల పంటలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు.
శ్రీశైలం: శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రమైన శ్రీశైలం నల్లమల అడవుల్లో ఉంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఇక్కడకు దాదాపు నాలుగు గంటల ప్రయాణం. ఇష్టకామేశ్వరి దేవాలయాన్ని మీరు దర్శించుకోవచ్చు. ఈ దేవాలయాన్ని చేరుకోవాలంటే మీరు అడవి మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అడవి నుంచి చేసే సాహసోపేతమైన ప్రయాణం ఎంతో రిఫ్రెష్ చేస్తుంది. అక్కమహాదేవి గుహలను చేరుకోవడానికి మీరు రోప్ వే ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 80 అడుగుల లోతైన గుహల లోపల ఎంత చీకటిగా ఉంటుందో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.
Authorization