ఆఫీసుకు వెళ్లడం.. రావడం.. ఇంట్లో పనులు చేసుకోవడం.. ఎప్పుడూ ఇదేనా జీవితం.. అని ఒక్కొక్కప్పుడు విసుగేస్తుంది. రోజూ వారీ పనుల నుంచి కాస్తంత బ్రేక్ తీసుకొని ఎటైనా వెళ్లిరావాలనిపిస్తుంది. సుదూర ప్రదేశాల్లో ప్రశాంతంగా గడపాలనిపిస్తుంది. అలాంటప్పుడు టూర్‌కి వెడితే బాగుంటుంది. కానీ..అలా వెళ్లడం వల్ల రోజు వారీ వ్యాయామాలు చేయలేకపోతాం అని ఆందోళనపడతాం. దేనికైనా మనసుంటే మార్గముంటుంది. పర్యటనా సమయాల్లో కూడా వ్యాయామాలు చేసే అవకాశాలు బోలెడు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం...
- ఎత్తుగా ఉన్న ప్రాంతాలను ఎక్కడం, నడవడం చేస్తే కార్డియో వర్కవుట్స్ చేసినంత ఫలితం ఉంటుంది. దీని వల్ల శరీర కింద భాగంపై ఒత్తిడి బాగా పడి వ్యాయామం అవుతుంది. ఇలా చేయడం వల్ల ఎముకలు కూడా ద ఢంగా తయారవుతాయి. అలాగే ఒత్తిడితగ్గుతుంది. నిద్రలేమి సమస్య ఉండదు.
- వాలుగా ఉండే కొండ ప్రాంతాల్లో పరిగెత్తినా, సైక్లింగ్ చేసినా కూడా బరువు తగ్గుతారు. మూఢతీనం పోయి హుషారుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది.
నహౌటల్స్లో ఉన్నప్పుడు అక్కడి స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొట్టొచ్చు. అలాగే బీచ్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈత కొట్టొచ్చు. స్విమ్మింగ్ శరీరానికి మంచి వ్యాయామాన్నిస్తుంది. నీళ్లల్లో ఆక్వా ఏరోబిక్స్ కూడా చేయొచ్చు. స్విమ్మింగ్, ఆక్వా ఏరోబిక్స్ రెండూ చేయడం వల్ల శరీరం మృదువుగా తయారవడమే కాదు ఎటుపడితే అటు శరీరాన్ని విల్లులా వంచగలుగుతాం.
నమీరున్న రిసార్ట్‌లో ఫిట్నెస్ సెంటర్ ఉంటే అక్కడికెళ్లి వ్యాయామాలు చేయొచ్చు. లేదా దగ్గరలో ఫిట్నెస్ సెంటర్ ఉన్నా అక్కడికైనా వెళ్లి వ్యాయామాలు చేయొచ్చు. నైట్ క్లబ్స్ కెడితే అక్కడ డాన్స్ చేయడం ద్వారా ఎంజారు చేయడంతోపాటు శరీరబరువు పెరగకుండా ఫిట్నెస్ను కాపాడుకోవచ్చు.
- రిసార్ట్‌లో ఉన్నప్పుడు శరీరం నాజూగ్గా ఉండడానికి అవసరమైన థెరపీలు, మసాజులు కూడా చేయించుకోవచ్చు. ఇలా చేస్తే శరీరం ఫిట్నెస్ బాగుంటుంది. కండరాలు బలంగా తయారవుతాయి. శరీరం శిల్పాక తిలో ఉండి చూడడానికి అందంగా కనిపిస్తారు. మసాజ్ చేయించుకోవడం వల్ల శరీరంలో రక్తప్రవాహం బాగా అయి చర్మానికి మంచి మెరుపు వస్తుంది.
- ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగే జిమ్ ఎక్విప్మెంట్తో బీచ్ ఒడ్డున వ్యాయామాలు చేస్తే శరీరంపై అది ఎంతో ఎఫెక్ట్‌ను చూపిస్తుంది. స్పాట్ జాగింగ్, యోగాలాంటివి అక్కడ చేయొచ్చు. స్కిప్పింగ్ రోప్, రెసిస్టెన్స్ బ్యాండ్స్, లైట్ డంబల్స్‌తో వ్యాయామాలు చేయొచ్చు. సమయం దొరికినప్పుడల్లా స్కిప్పింగ్ ఆడొచ్చు. డంబుల్స్తో వ్యాయామాలు చేస్తే బలంగా ఉంటాం.
- చుట్టాల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి ఇంటిపనుల్లో మీరూ పాలుపంచుకోండి. అలా ఇంటిపనులు చేయడం వల్ల శరీరానికి బాగా వ్యాయామం అవుతుంది.
- మెట్లు ఎక్కడం, దిగడం వల్ల ఊపిరితిత్తులకు బాగా వ్యాయామం అవుతుంది. వంగడం, లేవడం, కూర్చోవడం వంటి స్ట్రెచింగ్ వ్యాయామాలు శరీరాన్ని తేలికపరుస్తాయి.
- మీ టూర్లో యోగసాధకులు ఎవరైనా ఉంటే వారి సహాయంతో యోగాను సైతం ఖాళీ సమయాల్లో చేయొచ్చు.
Authorization