ఆకాశం నుంచి పడ్డ ఓ పెద్ద ఉల్క వల్ల ఏర్పడిన సరోవరం ఎక్కడుందో తెలుసా.. అసలు అటువంటి సరోవరం ఉందన్న విషయం మీరెప్పుడైనా విన్నారా.. ప్రపంచంలో ఇటువంటి సరోవరం ఒకటే ఒకటి ఉంది. అది ఎక్కడో కాదు మన దేశంలోని మహారాష్ట్రలోనే. కొన్ని వేల సంవత్సారాల కిందట భూమిపై పడిన ఉల్క వల్ల ఈ సరోవరం ఏర్పడింది. ప్రస్తుతం ఇది పర్యాటక ప్రియులను ఆకర్షిస్తోంది. అసలు ఈ సరోవరం ఎక్కడుందో.. ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం...
మహారాష్ట్రలోని లోనార్ ప్రాంతంలో ఈ సరోవరం ఉంది. అసలు విషయం ఏమిటంటే ఇది ఉప్పునీటి సరస్సు. ముంబై నుంచి ఇక్కడకు 550 కిలోమీటర్లు కాగా మీరట్, ఔరంగాబాద్ నుంచి 160 కిలోమీటర్లు ఉంటుంది.
గుంత ఏర్పడి: సుమారు 52,000 ఏండ్ల కిందట విశ్వం నుంచి పడిన ఉల్క వల్ల మొదట ఇక్కడ పెద్ద గుంత ఏర్పడింది. అటు పై కొన్ని సంవత్సరాలకు భూమి లోపలి నుంచే నీరు వచ్చి ఆ గుంత సరస్సుగా మార్పు చెందింది. ఇలా ఉల్క వల్ల ఏర్పడిన సరస్సు ప్రపంచంలో ఇక్కడ తప్ప మరెక్కడా లేదు.
ఘర్షణ బలాన్ని దాటుకుని: సాధారణంగా ప్రతి ఏడాది ఆకాశం నుంచి తమ కక్షలు గతి తప్పి 30 వేల నుంచి 1,50,000 వరకూ ఉల్కలు భూ వాతావరణంలోకి అత్యంత వేగంగా చొచ్చుకుని వస్తాయి. అయితే గురుత్వాకర్షణ, ఘర్షణ బలం వల్ల ఆ ఉల్కలు భూ వాతవరణంలోకి చేరిన వెంటనే కాలిపోతాయి. సదరు గురుత్వాకర్షణ, ఘర్షణ బలాన్ని కూడా దాటుకుని వచ్చి ఓ ఉల్క వల్ల ఈ సరస్సు ఏర్పడింది.
పక్షి ప్రేమికులకు: ఈ సరస్సు పక్షి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం స్థానిక పక్షులే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా పక్షులు వలస వస్తాయి. ముఖ్యంగా షెల్డక్, స్కిల్ట్స్, బ్రాహినీ జాతికి చెందిన బాతులు, ఎర్రని వ్యాటల్డ్ ల్యాఫ్టింగ్, నీలం రంగు జేస్, బేవే వివర్స్, హోపోస్, బార్న్ జాతికి చెందిన గుడ్లగూబలు, గోల్డన్ ఓనియల్, ల్యాక్కర్, రంగరంగుల చిలుకలు, ఫీఫల్ తదితర పక్షలను ఇక్కడ చూడవచ్చు.
ఔషద మొక్కలకు నెలవు: ఈ లోనార్ సరస్సు చుట్టూ అనేక ఔషద గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. అందువల్ల ఆయుర్వేద వైద్యులు ఇక్కడకు ఎక్కవ సంఖ్యలో వస్తుంటారు. ఇక ఇక్కడ రామగయ దేవస్థానం, కమల్జా దేవి దేవాలయం, కొంత నీటిలో మునిగిన శంకర గణేశ దేవాలయాలు కూడా ఉండటం వల్ల భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.
Authorization