డిప్రెషన్ ఇప్పుడు ఇది ఓ సాధారణ పదంగా మారిపోయింది. విరామం లేని నిరంతర పని ఒత్తిడి ఫలితంగా డిప్రెషన్ ప్రతి ఒక్కరికీ అనుకోకుండానే చేరువవుతుంది. అయితే దీన్ని తగ్గించడానికి కొంత మంది రకరకాల మందులు వాడుతుంటారు. డిప్రెషన్‌కు మందులకంటే కూడా మానసిక చికిత్స చాలా ముఖ్యం. దీనికి ఆహ్లాదకరమైన ప్రయాణాలు ఎంతో బాగా పని చేస్తాయి. భారతదేశంలో చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. మీరు కూడా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లైతే ఒక్కసారి ప్రయాణాలపై దృష్టి పెట్టండి.
- ఒంటరితనం అనేది డిప్రెషన్‌కు డైరెక్ట్ గా లింక్ అయ్యి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ ఒంటరిగా ఉంటే డిప్రెషన్ లక్షణాలు మిమ్మల్ని అంతగా బాధపెడతాయి. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు, క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి హోటల్ స్టాఫ్, ఇతర ప్రయాణికులు, స్థానికులు వంటి ఎంతోమంది కొత్తవారిని కలిసే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ రకరకాల కథలు ఉంటాయి. మీతో ఎవరైనా వారి గురించి షేర్ చేసుకుంటే వారి గురించి మీకు తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా కొత్తవారిని కలవడం ద్వారా కూడా డిప్రెషన్ లక్షణాలు తగ్గే ఛాన్సస్ ఉంటాయి.
ష ప్రకృతికి దగ్గరగా ఉంటూ హాయిగా సమయం గడపడం వలన డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయని ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి. దట్టమైన అడవులలో, నదుల పక్కన, పర్వతాల మధ్య, పువ్వులు ఉండే చోట ప్రశాంతత ఎక్కువ దొరుకుతుంది. ప్రకృతికి దగ్గరగా సమయాన్ని గడిపితే మీరు అక్కడ ఉన్నంతసేపు డిప్రెషన్ మీ నుంచి సెలవు పుచ్చుకుంటుంది. అందుకే ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం అనేది కూడా డిప్రెషన్‌తో ఫైట్ చేసే ఓ శక్తివంతమైన మార్గం.
- ఆఫీస్, ఇల్లు.. ఈ రొటీన్ నుంచి కాస్త బ్రేక్ తీసుకొని మరీ ఓ వెకేషన్‌కి ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అందులో ట్రెక్కింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోండి. శారీరక శ్రమతో డిప్రెషన్‌తో ఫైట్ చేసే ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. మీకు నచ్చిన రాక్ క్లైంబింగ్ సెషన్లని ఎంజారు చేయడానికి రెడీ అయిపోండి. హైక్ తరువాత పై నుంచి కనిపించే అద్భుతమైన దృశ్యాలు కూడా మిమ్మల్ని ఎంతో సంతోషపెడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
- డిప్రెషన్ వల్ల కలిగే మొట్టమొదటి ఇబ్బంది నిద్రలేమి. ప్రయాణం వల్ల మీరు మీ లాప్టాప్స్, ఫోన్స్ నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ప్రయాణంలో భాగంగా చుట్టుపక్కలున్న ప్రదేశాలను చూడడానికి, ఇష్టమైన పనులు చేయడానికి మీరు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఒక పక్క ప్రయాణపు అలసట, మరోపక్క కొత్త ప్రదేశం దగ్గర దిగిన దగ్గర నుండి రాత్రి వరకు ఉండే హడావుడి.. అన్నీ కలిపి మీకు రాత్రి హాయి నిద్రను కలిగిస్తాయి. ఏదో ఒక విధంగా.. మీరు రాత్రి సమయానికి ఎక్కువ అలసిపోయి ఉంటారు కాబట్టి మీకు హాయిగా నిద్ర పట్టేస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు.
- ఎప్పుడూ మన పనులతో బిజీగా ఉన్నప్పుడు ప్రపంచం గురించి మనకు అంతగా తెలిసే అవకాశాలు ఉండవు. అదే ప్రయాణం చేస్తూ ఉంటే మీకు తెలియని ఎన్నో జీవన పరిస్థితులు, ఈ అందమైన ప్రపంచంలో ఎవరు ఎలా బతుకుతున్నారో తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మీకు మీరే డిప్రెషన్‌ని తరిమికొట్టే అవకాశాలుంటాయి.
ఇలా ప్రయాణాలతో కూడా డిప్రెషన్‌ని తగ్గించుకోవచ్చు. అవసరం ఉన్నా లేకున్నా అప్పుడప్పుడు కుటుంబసభ్యులతో ఎక్కడికైనా ప్రయాణాలు చేయడానికి ప్రయత్నించండి. దాంతో మీకు డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి.
Authorization