వల్పరై... సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉన్న ఓ అందమైన హిల్ స్టేషన్. ఇది కోయంబత్తూరు జిల్లాలో ఉన్న అన్నామలైలో పర్వత శ్రేణిలో భాగంగా ఉంది. తమిళనాడులో ఉన్న ఎన్నో అందమైన పర్వతాలలో ఇది ఒకటి. టీ, కాఫీ తోటలకు ప్రసిద్ధి. అలాగే దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన వాగులు ఉన్నాయి. వల్పరైకి దగ్గరగా 65 కిలోమీటర్ల దూరంలో పొల్లాచి మైదానాలు ఉన్నాయి. వల్పరై నుండి 108 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ ఉన్నది.
పర్యాటక స్థలాలు
చిన్నకలర్ ఫాల్స్ నుంచి వల్పరైకి వెళ్ళుతూ ఉంటే చుట్టూ పక్కల చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాలాజీ దేవాలయం ఉంది. అంతే కాకుండా నిరర్ ఆనకట్ట, గణపతి ఆలయం, అన్నై వేలన్కాన్ని చర్చి ,శోలయర్ ఆనకట్ట, పచ్చగడ్డి కొండలు, వ్యూ పాయింట్లు ఇలా ఎన్నో అత్యద్భుతమైన అంద లను వల్పరై పర్యటనలో భాగంగా చూడవచ్చు. ఈ వల్పరైలో పెద్దపెద్ద అడవులు, అభయారణ్యాలు లోతైన జలపాతాలు ఉన్నాయి.
వన్యప్రాణి ఆకర్షణలు
వల్పరైలో తప్పకుండా చూడవల్సిన అనేక వన్యప్రాణి ఆకర్షణలు ఉన్నాయి. దీనికి ఉదాహరణగా చిన్నకల్లర్ ను చెప్పవచ్చు. అత్యదిక వర్షపాతం కారణంగా దక్షిణ భారతదేశంలో గ్రాస్ హిల్స్‌గా పిలువబడే ''చిరపుంజి'' ని చిన్నకల్లర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం కూడా మొక్కలు, తేయాకు కర్మాగారాలు, ఆనకట్టలతో ప్రసిద్ధి చెందింది. ఉదయం పూట టీ తోటల మధ్యలో సరదాగా నడిచివెళ్లి ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు. మంచి ఫొటోగ్రఫి హాబి ఉన్నవారు వైల్డ్ లైఫ్‌తో పాటు అక్కడి సహజ అందాలను ఆస్వాదించవచ్చు.
ఎలా వెళ్ళాలి?
వల్పరైకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. వల్పరైకు120 కిలో మీటర్ల దూరంలో కోయంబత్తూర్ విమానాశ్రయం ఉంది. కోయంబత్తూర్ నుండి అద్దె కార్ల ద్వారా వల్పరైకు సులభంగా చేరుకోవచ్చు. పొల్లాచి, కోయంబత్తూర్ నుండి బస్ ద్వారా వల్పరైకు సులభంగా చేరుకోవచ్చు.
Authorization