మహారాష్ట్రలో ట్రెక్కింగ్ ప్రదేశాలు, జలపాతాలు పుష్కలంగా ఉన్నాయి. పిక్నిక్ స్పాట్లు కూడా ఉన్నాయి. అలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో ఓ ప్రదేశం గురించి తెలుసుకుందాం. అదే దేవకుండ్. ఇక్కడ మీరు ట్రెక్కింగ్, క్యాంపింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడలన్నింటికి అనుకూలంగా ఉంటుంది. వీటన్నింటినీ ఒకే ప్రదేశంలో అనుభవిస్తూ అందించవచ్చు.
దేవకుండ్ జలపాతం మహారాష్ట్రంలోని రాయగడ్ జిల్లాలో భైరాలో ఉంది. రాయగఢ్‌లోని దేవకుండ్ జలపాతం ఓ ప్రసిద్ద పర్యాటక ఆకర్షణ, అందమైన పిక్ నిక్ స్పాట్. కుంకులికా నది నుండి ఉద్భవించినట్టు భావిస్తున్న మూడు జలపాతాల కలయికతో దేవకుండ్ జలపాతాలు కలవు.దేవ్ కుండ్ ఓ చిన్న గ్రామం. దేవకుండ్ నుండి 25కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడాల పట్టణంలో ఎంతో ఐకమత్యంతో పండుగలు జరుపుకుంటారు. జనవరిలో జరిగే పంటకోత పండుగ సంక్రాంతి సమయంలో దేవకుండ్ సందర్శిస్తే ఎంతో అందంగా ఉంటుంది. దేవకుండ్లో ప్రత్యేకంగా జరుపుకునే ఈ పండుగలు, వేడుకలు సందర్శకుల అందరి హృదయాలను చూరగొంటాయి.
దట్టమైన అటవీ ప్రాంతం
దేవకుండ్ గ్రామంలో ట్రెక్కింగ్‌కు మూడు గంటలు పడుతుంది. దేవకుండ్ వాటర్ ఫాల్ సందర్శించడానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ జలపాతాల్లో ఆడిపాడవచ్చు, స్నానాలు చేయవచ్చు. ఈ జలపాతాలు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అంతే కాదు విదేశీ పర్యాటకులను కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది. దేవకుండ్ అసలు గ్రామమైన భిరా చేరుకున్న తర్వాత మీరు 3 నుండి 4 కిమీ అడుగుల ట్రెక్కీని బిర్రా డ్యాంతో పాటు దట్టమైన అటవీప్రాంతంలో చూడవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ మార్గంలో నీటి ప్రవాహం, విశాలమైన స్థలం ఉంటుంది. ఫారెస్ట్‌లో కాలిబాటలో వెళ్ళాల్సిందే. అలాగే కాలిబాట పొడవున మట్టి , రాతి మార్గాలు ట్రెక్కింగ్‌కు కష్టం అవుతుంది. ట్రెక్కీ బిరాతో మొదలవుతుంది. అక్కడ మీరు అనేక బోర్డ్‌లు, చిహ్నాలు చూస్తారు. ట్రెక్కింగ్ ప్రారంభించడానికి ముందే భీరా డ్యామ్ రిజర్వాయర్ మీదుగా నడవాలి. ఇక్కడ కొంత సమయం గడపాలని కోరుకుంటే శిభిరాలను ఎంపిక చేసుకోవచ్చు. 45-50 నిముషాల పాటు నడక సాగించాలి. అలాగే రాఖీ ప్యాచ్ నుండి పది నిముషాల పాటు నడవాలి. దారి పొడవునా దుకాణాలు ఉంటాయి. అలాగే నిమ్మరసం అందుబాటులో ఉంటుంది.
ఆనందంగా తిరిగి రావచ్చు
దేవకుండ్ జలపాతం మార్గం గుండా వెళుతుంటా మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ జలపాతంకు చేరే మార్గంలో ట్రెక్కింగ్, హైకింగ్ లాంటివి ఆనందించడానికి అవకాశం ఉంది. ఇక్కడ పర్యాటకులు పూర్తి క్యాంపిగ్తో హ్యాపిగా తిరిగి రావచ్చు. క్యాంపింగ్ చేస్తున్నప్పుడు భోగి మంటలు, బార్బెక్యూ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్ సమయంలో మాత్రమే శిబిరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే స్విమ్మంగ్ కూడా మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తుంది. దేవకుండ్ అడువుల అందమైన దృశ్యాలతో మొత్తం పర్యాటన అంతా హ్యాపిగా సాగుతుంది.
సెప్టెంబర్‌లో అనుకూలం
వర్షాకాలం ముందు లేదా తర్వాత దేవకుండ్ జలపాతం సందర్శించేందుకు అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో జలపాతాలు నిండిపోతాయి. అలాగే చుట్టు పక్కల గుట్టలు జలధారలతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల సెప్టెంబర్ తర్వాత జలపాతాలను సందర్శించడానికి చాలా మంచి సమయం . అలాగే అక్టోబర్ నుండి నవంబర్ మధ్య వరకు కూడా వెళ్ళి రావచ్చు.
చేరుకోవాలంటే..?
దేవకుండ్ జలపాతం లోనావాల నుండి 52కిలోమీట దూరంలో ఉంది. ముంబై నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఈ దేవకుండ్ జలపాతాలున్నాయి. ఇది ముంబై మహానగరంతో పాటు ఇతర ప్రధాన నగరాలు అనుసంధానింపబడినవి. ఇక్కడ నుండి రైలు, విమానాల్లో ముంబై చేరకోవచ్చు. ముంబై నుండి లోనావాలా వరకు స్థానిక రైళ్ళు, బస్సుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. లోనావాల నుండి ట్యాక్సీ లేదా కాబ్ లను అద్దెకు కూడా తీసుకోవచ్చు. లోనావాల నుండి భైరా వరకు స్థానిక బస్సులు అందుబాటులో ఉంటాయి.
Authorization