ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఈ మధ్య కాలంలో సమయం వృధా చేసుకోకుండా విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. కాస్త ముందే రిజర్వ్ చేసుకుంటే అతి తక్కువ ఖర్చులో విమాన యానం చేయవచ్చు. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని మొదటి సారి విమానం ప్రయాణం చేసే వారు ఎంతో మంది ఉన్నారు. అలా మొదటి సారిఫ్లైట్ జర్నీ చేసేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన కొన్ని పద్దతుల గురించి చూద్దాం.
టికెట్ కొంటే చాలు హాయిగా వెళ్లి విమానంలో విహారయాత్ర చేయొచ్చు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఇప్పటివరకు ఎంతోమందిని ప్రయాణికులను ఫ్లైట్ ఎక్కనీయకుండా అడ్డుకున్న కేసులు వున్నాయి. అందుకే తప్పకుండా అందరూ ఫ్లైట్ ఎక్కేముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి.
- మీరు ఫ్లైట్ ఎక్కేముందు కచ్చితంగా ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్‌ను ఓసారి చదవి దానికి అనుగుణంగా ముందే అన్నీ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. లేకపోతే మీ ప్రయాణానికి బ్రేక్ పడే అవకాశాలున్నాయి.
- ఫ్లైట్ ఎక్కేముందు మీరు మద్యం సేవించి ఉంటే అది ఫ్లైట్ అధికారుల దృష్టికి వెళ్ళినట్లైతే పక్క ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మీ ప్రయాణాన్ని నిలిపివేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఫ్లైట్ ఎక్కేముందు మద్యం కానీ డ్రగ్స్ కానీ తీసుకోకూడదు. అలాగే వెంట తీసుకెళ్లకూడదు కూడా.
- మరో వింత విషయం ఏమిటంటే చెప్పులు, షూస్ లేకుండా ఫ్లైట్ ఎక్క కూడదు. ఎందుకంటే అక్కడి సిబ్బంది మీరు కచ్చితంగా పాదరక్షలు వేసుకొని వస్తేనే ఫ్లైట్ ఎక్కనిస్తారు. లేదంటే లోపలికి అంగీకరించరు.
- మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం వేసుకునే దుస్తులు. ఇవి కూడా డిగ్నిటీగా ఉండాలి. అక్కడ ఫ్లైట్ సిబ్బందికి మీ బట్టలు అసభ్యకరంగా కనిపిస్తే వెంటనే మీ ప్రయాణాన్ని నిలిపివేసే అవకాశాలున్నాయి. కాబట్టి మనం ఫ్లైట్ జర్నీ చేసేముందు మన బట్టలపై కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి.
- గర్భిణీలు తొమ్మిదో నెలలో ఉన్నప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కనివ్వరు. అయితే ఈ నిబంధనలు మాత్రం ఒక్కో ఎయిర్‌లైన్స్‌కు ఒక్కోలా ఉంటాయి. అంతేకాకండా గర్భిణీలు ఫ్లైట్ ఎక్కాలంటే డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కావాలి.
- ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్ పట్టించుకోకుండా టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయంలో కానీ పొగతాగారా ఇక మీరు ఇబ్బందుల్లో పడినట్లే.
- ఫ్లైట్ లాండింగ్, టేక్ ఆఫ్ సమయంలో సిగల్ జాం అవ్వకుండా ఉండటానికి ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళ ఫోన్లు అన్నీ ఫ్లైట్ మోడ్‌లో పెట్టమంటారు. అంతేకాకుండా అక్కడ నిబంధనలను అతిక్రమించి వాయిస్ కాల్స్ కూడా మాట్లాడకూడదు.
- ఎయిర్‌పోర్టులో ఉండే సిబ్బంది దగ్గర నుండి ఫ్లైట్‌లో క్రూ మెంబెర్స్ దాకా అందరితో మర్యాదగా నడుచుకోవాలి. అంతేకాకుండా తోటి ప్రయాణికులకు కూడా మీవల్ల ఎటువంటి ఇబ్బంది రాకూడదు. అలా ప్లాన్ చేస్కోండి లేదంటే లేనిపోని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
Authorization