కర్ణాటకలోని షిమోగా జిల్లాలో మూడు చదరపు కి.మీచిన్న గ్రామం అగుంబే. జనాభా దాదాపు ఐదువందలు. పక్షుల కిలకిలలు తప్ప పట్టణ ప్రాంతపు రణగొణధ్వనులేవీ ఇక్కడ వినిపించవు. పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ప్రదేశం ఇది. నింగిని తాకే కొండలు, నీలిమబ్బులను చుంబించే దృశ్యాలు ఈశాన్యంలోని చిరపుంజిలోనే కాదు, దక్షిణాదిలో అగుంబెలోనూ చూడవచ్చు. అందుకే, కర్ణాటకలోని అగుంబెను చిరపుంజి ఆఫ్ సౌత్ అంటారు. అరేబియన్ సముద్ర తీరానికి 55 కి.మీ దూరంలో పడమటి కనుమల్లోని ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.
అందుకే పచ్చదనానికి చిరునామాలా ఉంటుంది. అగుంబె (పొగమంచుతో కూడిన అడవి అందాలు అగుంబెలో కనువిందు చేస్తాయి) ఈ ప్రదేశాన్ని దక్షిణ భారతదేశపు చిరపుంజి అని పిలుస్తారు. పశ్చిమ కనుమలకలోని ఈ ప్రదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. ఈ మాన్సూన్ సీజన్లో అడవి మొత్తం పొగమంచుతో ఉంటుంది. వాటర్‌ఫాల్స్ కనువిందు చేస్తా యి. కుంచికల్ ఫాల్స్, బర్కానా ఫాల్స్ అందాలు తనివితీరా చూడాల్సిందే. ఇక్కడున్న అగుంబె రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్‌ను ప్రతి ఒక్కరు సందర్శించాల్సిందే. అగుంబె చుట్టుపక్కల ముఖ్యంగా చూడాల్సినవి ఇక్కడి జలపాతాలనే. కొండల మీదుగా నేల మీదకు ఉరికే జలపాతాలు ఇక్కడ అడుగడుగునా తారసపడతాయి. ముఖ్యంగా బర్కానా జలపాతం, కూడ్లుతీర్థ జలపాతం, జోగిగుండి తదితర జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
Authorization