నవతెలంగాణ-వీణవంక ప్రమాదవశాత్తూ బావిలో పడి నల్ల ఆగామరెడ్డి (73) అనే వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన ఆగమరెడ్డి సోమవారం తనకున్న వ్యవసాయ భూమివద్దకు నీరు పెట్టడానికి వెళ్లగా వ్యవసాయ బావివద్ద కాలుజారి ప్రమాదవశాత్తూ బావిలో పడడంతో తలకు తీవ్రగాయాలైయ్యాయి. సమీప గ్రామస్తులు అది గమనించి ఆయనను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్టు తెలిపారు. మృతుని అల్లుడు ఎడెల్లి సంజీవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు ఎస్సై దామోదర్‌రెడ్డి తెలిపారు.