- జిల్లా రెవెన్యూ అధికారి ఆయేషా మస్త్రత్ ఖానం
నవతెలంగాణ-మంకమ్మతోట
ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజలు తెలిపే సమస్యలకు జిల్లా అధికారులు అధిక ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఆయేషా మస్త్రత్ ఖానం అన్నారు. సోమవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రాలేకపోయిన వారి కోసం ప్రతీ సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఉదయం 10గంటల నుండి 10.30 వరకు నిర్వహిస్తూ, ప్రజలు ఫోను ద్వారా తెలిపే సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వీణవంక మండలం నర్సింగాపూర్ నుండి స్వరూప మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు బిల్లులు ఇంతవరకు రాలేదని తెలుపగా, పరిశీలించి ఖాతాలో జమ చేస్తామని అన్నారు. జమ్మికుంట మండలం కోరెపల్లి నుండి ప్రకాశ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగంపై విచారణ జరిపి రెండు నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోలేదని తెలుపగా విచారణ నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామడుగు మండలం గోపాలరావు పేట నుండి రాజయ్య, తిమ్మాపూర్ మండలం నుండి తిరుమల మాట్లాడుతూ మూకు పింఛన్ ఇంతవరకు మంజూరు కాలేదని తెలపగా వెంటనే సంబంధిత ఎంపీడీవో కు దరఖాస్తు చేసి సదరు దరఖాస్తు కాపీని డీఆర్టివో కార్యాలయంలో సమర్పిస్తే వెంటనే పరిశీలించి మంజూరు చేస్తారని తెలిపారు. తిమ్మపూర్ మండలం రావుహనుమాన్ నగర్ నుండి రమేష్ మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రం సరిగా నడవడం లేదని నలుగురైదుగురు పిల్లలు మాత్రమే ఉన్నారని రికార్డుల్లో ఎక్కువ మందిని చూపిస్తున్నారని తెలుపగా, వెంటనే తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని సంక్షేమ అధికారిని డీఆర్వో ఆదేశించారు. జమ్మికుంట మండలం అంకుశాపూర్ నుండి లింగం పెల్లి షాజీ మాట్లాడుతూ పద్మశాలి సంఘం భవన నిర్మాణం పేరిట జిల్లా పరిషత్ నిధులతో స్వంత భవనం నిర్మించుకున్నారని తెలుపగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రాజేశం, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఈవో రాజీవ్, జిల్లా పరిషత్ సీఈవో పద్మణారాణి, జిల్లా వ్యవసాయనాధికారి 3,055 జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజి, రెవెన్యూ డివిజినల్ అధికారి రాజా గౌడ్, కలెక్టరేటు పాలనాధికారి రవీందర్జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
Authorization