- నిందుతులపై కేసు నమోదు
- కారు, రెండు బైక్‌లు స్వాధీనం
- చొప్పదండి, తిమ్మాపూర్‌లో ఘటనలు
నవతెలంగాణ-చొప్పదండి
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, తిమ్మాపూర్ మండలాల్లో శనివారం అక్రమంగా తరలిస్తున్న రూ.78,060 విలువ గల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్‌లో కారు, చొప్పదండిలో రెండు బైక్‌లు స్వాధీనం చేసుకుని నిందుతులపై కేసు నమోదు చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని రాగంపేట, ఆర్నకొండ గ్రామాల్లో శనివారం అక్రమంగా తీసుకెళ్తున్న రూ.3,440 మద్యాన్ని పట్టుకోవడంతో పాటు నిందుతులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ బీ.చేరాలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాగంపేట గ్రామంలో వార్డు సభ్యు రాలుగా పోటీ చేస్తున్న సోనియాకు మద్యాన్ని పంపిణీ చేసేం దుకు గ్రామానికి చెందిన కుతికల మహేష్, మోధుం పెళ్లి ప్రవీణ్ కుమార్‌లు మోటార్ సైకిల్ పై పది బీర్లు, 10 ఆఫీసర్స్ క్వాటర్స్ తీసుకెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకుని మద్యాన్ని సీజ్ చేశామ న్నారు. మండలంలోని ఆర్నకొండ గ్రామానికి చెందిన చతర్ల ప్రేమ్ కుమార్ వార్డు సభ్యునిగా గ్రామంలో పోటీ చేస్తున్నాడు. ఆయన మందు పంపిణీ చేసేందుకు అదే గ్రామానికి చెందిన చతర్ల జివయ్య, చతర్ల ప్రవీణ్ కుమార్‌లు మోటార్ సైకిల్‌పై 12 కింగ్ ఫిషర్ బీర్లు తరలిస్తు ండగా వారిని అదుపులోకి తీసుకుని మద్యాన్ని సీజ్ చేసి బైకులను స్వాధీనం చేసుకున్నామ న్నారు. నిందుతులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
తిమ్మాపూర్: మండలంలోని అలుగునూరు వద్ద అక్రమంగా సాన్‌ట్రో కార్లో తరలిస్తున్న రూ.57,960 విలువ గల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. కారులో 126 ఐబీ బాటిళ్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కాకతీయ కాలువవద్ద స్పెషల్‌టీం సిబ్బంది పట్టుకున్నట్టు ఎస్ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు. నిందితులు అల్గునూర్‌కు చెందిన వీర్ల తిరుపతి, తిమ్మాపూర్‌కు చెందిన నెల్లి సంపత్‌లను పట్టుకుని వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మద్యంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మద్యం సరఫరా చేయించుకుంటున్న వారి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. మారుతిజెన్ కారులో అక్రమంగా రూ.16,660 విలువైన మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ నుంచి ఎల్‌ఎండీకాలనీ వైపు వెళ్తున్న కారులో ఉన్న మద్యం బాటిళ్లను స్పెషల్‌టీం సిబ్బంది పట్టుకున్నారని ఆయన చెప్పారు.నిందుతుడు రామకృష్ణకాలనీకి చెందిన గంది సతీష్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మద్యం సరఫరా చేయించుకుంటున్న వారి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
Authorization