నవతెలంగాణ-మానకొండూర్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు( ఆదివారం) మండల కేంద్రంలోని స్థానిక కేఎస్ఆర్ కల్యాణ మండపంలో పంచాయతీ ఎన్నికలల్లో సర్పంచ్, వార్డ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన సమావేశాన్ని నిర్వహించనున్నట్టు మండల పరిషత్ అధికారి వినోద్ తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని పోటీ చేసే అభ్యర్థులు అందరూ పాల్గొనాలని అన్నారు.