గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 35-39 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 16-25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతా వరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగలు 28 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి 16 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
వరి: వరిలో కాండం తొలుచు పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్తగా నాటిన 15-20 రోజుల లోపు కార్బోప్యూరాన్ 3జి గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. వరిలో జింకు ధాతు లోపం గమనించినట్టయితే 2గ్రా. జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి 5-7 రోజుల వ్యవధిలో రెండు, మూడుసార్లు పిచికారి చేయాలి. వరిలో అగ్గితెగులు నివారణకు 0.6 గ్రా. ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మి.లీ ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ కాసుగామైసిన్ మందును లీటరు నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
మొక్కజొన్న: మొక్కజొన్నలో బెట్ట వాతావరణ పరిస్థి తులలో పేనుబంక ఆశించే సూచనలు న్నాయి. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మిరప: ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు కానోఫోరా కొమ్మ కుళ్లు తెగులు, బూడిద తెగులు, తామర పురుగులు సోకుటకు అనుకూలం. నివారణకు కానోఫోరా కొమ్మకుళ్లు తెగులుకు 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్, 1 గ్రా. ప్లాంటామైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. బూడిద తెగులుకు 3 గ్రా. నీటిలో కరిగే గంథకం లేదా 1 గ్రా. మి.లీ కారాథీన్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. తామర పురుగుల నివారణకు 1.5 గ్రా. అసిపిట్ లేదా 2 మి.లీ ఫిప్రోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనె మంచు పురుగులు, పక్షి కన్ను తెగులు, బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ 1 గ్రా. కార్బండజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బూడిద తెగులుకు 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ కారాతేన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కూరగాయలు: కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించి నట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. క్యాబేజీ, కాలిఫ్లవర్ పంటలో డైమండ్ రెక్కల పురుగు గమనించడమైంది. నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 0.3 మి.లీ స్పినోసాడ్ మందును లీటరు నీటిలో కలిపి పంట కోతకు 15 రోజుల ముందు పిచికారి చేయాలి.
పశుపోషణ: గొర్రెలలో చిటుకు, మశూచి వ్యాధి, అవులు, బర్రెల్లో గొంతువాపు వ్యాధి, ఆవులు, ఆంబోతులలో జబ్బవాపు వ్యాధి సోకేందుకు అనుకూలం కనుక వీటి నివారణకు టీకాలు వేయించాలి.
Authorization