గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 21 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 35 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 08 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
వరి: వరిలో కంకి నల్లి ఆశించి గింజ రంగు మారడం నివారించేందుకు 5 మి.లీ డైకోఫాల్ 1 మి.లీ ప్రొపికొనజోల్ లేదా 1 మి.లీ స్పైరోమేసిఫిన్ 1 మి.లీ ప్రొపికొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండంతోలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 8కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలను ఎకరం పొలంలో వేసుకోవాలి.వరిలో సుడిదోమ గమనించడమైంది. దోమ ఉధృతిని బట్టి ఎసిఫేట్ 1.5 ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మి.లీ ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ కాసుగామైసిన్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మొక్కజొన్న: రబీ మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్టు గమనించడమైంది. నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2నుంచి 3 లీ. నీటిని చేర్చి సుమారు 12 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100గ్రా. థైడికార్బ్ను కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి. ఎమమేక్టిన్ టెంజోయేట్ 0.4 గ్రా. లేదా థైమేమిధాక్సాన్ 9.5 శాతం, లానుసైహలోత్రిన్ 12 శాతం 0.5 మి.లీ లేదా క్లోరాన్ట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పత్తి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో తామర పురుగులు, తెల్లదోమ ఆశించడమైంది. నివారణకు
తామర పురుగులు : 2 మి.లీ పిప్రోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ: 2 మి.లీ ట్రైజోఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పత్తిలో పచ్చదోమ ఉదృతి గమనించడమైంది. నివారణకు 2 మి.లీ ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రా. ఎసిటామిఫ్రిడ్ లేదా 0.3 గ్రా. ప్లోనికామిడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పత్తిలో సేర్కొస్పోరా ఆకుమచ్చ తెగులు ఆశించడమైంది. నివారణకు 2.5 గ్రా. మాంకోజెబ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పత్తిలో బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు గమనించడమైంది. నివారణకు 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ 1 గ్రా. ప్లాంటామైసిన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
కంది: కందిలో మారుకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు గమనించడమైంది. నివారణకు మారుకా మచ్చ పురుగు 2.5 మి.లీ క్లోరిపైరీస్ లేదా 0.75 మి.లీ నోవోల్యూరాన్తోపాటు 1.0 మి.లీ డైక్లోరోఫాస్ మందును లీటరు నీటి కలిపి పిచికారి చేయాలి. శనగపచ్చ పురుగు నివారణకు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరానికి 10లేదా 15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. శనగపచ్చ పురుగుల ఉనికి గమనించేందుకు నాలు లింగాకర్షక బుట్టలు అమర్చాలి. పురుగు గుడ్లు తొలిదశ లార్వాల నివారణకు 5శాతం వేపగింజ కషాయాన్ని పిచికారి చేయాలి.
ద్రాక్ష: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ద్రాక్షలో పక్షికన్ను తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 3 గ్రా. ప్రొఫినెట్ మందును లీటరు నీటిలోకలిపి కత్తిరింపుల తరువాత 20 రోజులలోపు పిచికారి చేయాలి. ద్రాక్షలో పెంకు పురుగు గమనించడమైంది. నివారణకు 2.5 మి.లీ క్లోరిపైరాపాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితులు ద్రాక్షలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. ఉదృతి గమనించి 2 మి.లీ ఫిప్రోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనె మంచు పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మి.లీ డైక్లోరోవాస్, 2.5 మి.లీ వేపనూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కూరగాయలు: ప్రస్తుత పొడి వాతావరణ పరస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో ఆకుమాడు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1మి.లీ ప్రోఫికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
సేకరణ : మోత్కూరు యాదయ్య
Authorization