పంట సాగులో ప్రధాన కారకాలు ఎరువులు. పోషకాన్నిందించే ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. అసంబర్థంగా వాడడం వల్ల వినియోగ సామర్థ్యం తగ్గిపో తుంది. పంట ఖర్చులు పెరిగిపోతాయి. పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది.వీటి నష్టాలను తగ్గించడానికి, పంటలు వీటిని సమర్థవంతంగా వినియో గించడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.పంట డిమాండ్‌ను బట్టి అందుకు తగ్గ ఎరువులను ఎంచు కోవడంతోపాటు ఎరువు స్వభావాన్ని బట్టి తగిన సమయం, తగిన మోతాదులో సరైన పద్దతిలో వాడితే పోషకాల నష్టం తగ్గుతుంది.వీటి వాడుక సామర్థ్యం పెరుగుతుంది.
నత్రజని ఎరువులు
నత్రజని ఎరువులో కేవలం 25నుంచి 35శాతం మాత్రమే నత్రజని చాలా పంటలక అందుతుంది. అమ్మె నియా రూపంలో ఆవిరి కావడం, సేంద్రియ రూపాన్ని సంతరించుకోవడం, భూమిలోకి స్థాపించబడే రూపంలో నష్టం జరుగుతుంది. కనుక మిగతా పోషకాల మాదిరిగా కాకుండా అవసరం ఉన్న సమయంలోనే పంట పొలాలకు ఈ షోషకాలు అందించాలి. ఎరువు వేసే పద్దతి ముఖ్యమైనదే. నీరు ఎక్కడా నిల్వఉంచాల్సిన వరి పొలంలో యూరియా రూపంలో అందిస్తే అత్యంత స్థిరత్వం కలిగిన అమ్మోనియ రూపంలో నత్రజని ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. అమ్లత్వం కలిగిన ఎతైన నేలల్లో కూడా అమ్మెనియా ఆధారిత నత్రజని ఎరువులు వేయడం ద్వారా వర్షాకాలంలో అమ్మెనియా మృతికా కణాలకు అతుక్కొని నష్టపోకుండా ఉంటుంది. అతకబడిన అమ్మోనియా నైట్రిఫికేషన్ పద్దతి ద్వారా నెమ్మదిగా విడుదలవుతూ దీర్ఘకాలం పంటలకు నత్రజని అందిస్తుంది. అత్యధిక అమ్లత్వం కలిగిన మెరక నేలల్లో అమ్మోనియం సల్పేట్కు బదులుగా యూరియా రూపం లోనే ఇవ్వడం మేలు. తక్కువ వర్షపాతం కలిగిన క్షారత్వ మెరక నేలల్లో నైట్రేట్ రూపంలో అందించాలి. యూరియా లేదా అమ్మోనియా ఆధారిత ఎరువుల రూపంలో వాడితే అవిరి రూపంలో నష్టం జరిగే అవకాశం ఉంది. అన్ని ఎరువులు కోల్పోయే స్వభావం ఎక్కువ. పంట మొత్తం కాలంలో నత్రజని పోషకం అవసరం ఉంటుంది. పంట ఎక్కువ మోతాదులో తీసుకో వాలంటే దశల వారీగా అందించాలి. దీర్ఘకాలిక పంటలు, బహువార్షిక పంటలకు ఎక్కువ దశలలో ఎరువులు వేయాలి. అందుకు అనుగుణంగా సిఫార్సు చేసిన మొత్తం ఎరువును ముందే విభజించుకోవాలి. తక్కువ థన అయాను మారక సామర్థ్యం కలిగిన మొరపు, ఇసుక నేలల్లో నత్రజని నష్టం ఎక్కువ.కనుక ఇసు నేలలు, ఇతర తేలికపాటి నేలల్లో ఎక్కువ దఫాలుగా ఎరువులు వేయాలి. మధ్యకాలిక వరి వంగడాలకు మూడు దఫాలు గా దమ్ము చేసేటప్పుడు పిలకల దశ, కంకి పడే దశలో వేయాలి. ముతక నేలల్లో మొత్తం ఎరువు వివిధ దశల్లో మూడు నాలుగు దఫాలుగా వేయాలి. పంట వేసేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు నీటి నిల్వ వల్ల నత్రజని ఎరువులను వేయడం కుదరకపోతే మొత్తం ఎరువును వేప లేదా బగ్గు పూసిన నత్రజని ఎరువులను ఒకే దఫాగా దమ్ము చేసేటప్పుడే వేసుకోవచ్చు. రెండు పంటలు వేసే మాగాణి నేలల్లో మొదటి పంటకు సిఫార్సు చేసిన ఎరువలలో 50శాతం సేంద్రియ ఎరువుల రూపంలో అందించడ మేలు. తర్వాత పంటకు అందుబాటులో ఉంటుంది. భూముల భౌతిక స్థితి మెరుగవుతుంది. అమ్ల భూములను సవరించాలంటే సున్నం ఆధారిత పదార్ధాలు వాడాలి. అయితే యూరియా లాంటి అమ్మో నియా రూపంలో నత్రజనిని అందించే ఎరువులు వాడేట ప్పుడు సున్నం ఒకటి రెండు వారాల ముందే వేయాలి. ఒకేసారి వేస్తే అమ్మోనియా రూపంలో అవిరయ్యే ప్రమాదం ఉంది. యూరియాను ఎదజల్లి నప్పుడు 70శాతం నత్రజని వివిధ రూపాలలో నష్టం జరిగే అవకాశం ఉంది.
యూరియా నుండి నత్రజని నష్టాన్ని తగ్గించే మార్గాలు
బంక మట్టి నేలలు, కిలో మృతికలో 10సీఎండీ కంటే ఎక్కువ ధన అయానుమారక సామర్థ్యం ఉన్న నేలల్లో యూరియాను గుళికలు, గుండ్ల రూపంలో అందించాలి. నీటి నియంత్రణ కష్టమైన నేలలు, తరచుగా ముంపు ఎదురయ్యే నేలల్లో సల్ఫర్ లేదా లక్కపొర వేసిన యూరియాను వాడాలి. నేరుగా విత్తిన పంటలకు లోతైన నేలల్లో నత్రజని, యూరియా రూపంలో వాడేందుకు ముందు ఇంకా ఇది మేలు. తడిచిన మట్టితో యూరియా కలిపి 24నుంచి 48 గంట లలు నీడలో ఆరబెట్టాలి. యూరియాను ఐదు రెట్లబరు వున్న వేప చెక్కతో కలిపి వాడితే నత్రజని నెమ్మదిగా ఎక్కువ కాలం పంటకు అందుతుంది. మాగాణి వరి పొలాల్లో వేప చెక్కతో కలిపే ముందు యూరియాను బగ్గుతారు, కిరోసిన్, రెండు కిలోల కొల్తార్ను ఒక టీటరు కిరోసిన్‌తో కలపి 100 కిలోల యూరియాతో కలపాలి. ఐదు శాతం వేప పదార్ధా లతో శుద్ధి చేసిన యూరియాను గంట లేదా గంటన్నర ఆరబెట్టి నేరుగా విత్తే దమ్ము చేసిన లోతట్టు నేలల్లో వాడితే నత్రజని వాడక సామర్థ్యం రెట్టింపు అవుతుంది.సాధ్యమైనంత వరకు యూరియాను తోతుల్లో వేయడం లేదా లోతు సాళ్లలో వేయాలి. దున్ని, దమ్ము చేసిన తర్వాత తేలికపాటి నేలల్లో యూరియా చెక్కలు లేదా యూరియా గుళికల రూపంలో లోతుగా వేయాలి. ప్రధాన పొలంలో వరి నాటిన తర్వాత గ్రాన్సూన్స్ లేదా యూరియా చెక్కల రూపంలో అందించాలి. అదే విధంగా గంధకం లేదా లక్కతో శుద్ధి చేసిన యూరియా అయితే వెదజల్లవచ్చు.త్వరితగతిన నత్రజని స్పందనను పంటలో చూడాల నుకుంటే 5శాతం యూరియా ద్రావణం తయారు చేసి పిచికారి చేయాలి. పవర్ స్ప్రేయర్ వాడితే 15శాతం అదనంగా యూరియా వాడాలి. తాజా యూరియాను వాడకపోవడం (నేరుగా పిచికారికి) మేలు. తాజా యూరియా ఉండే బైయూరెట్ వల్ల ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది.
Authorization