గడిచిన మూడు రోజులలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 28 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతారణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 36 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
వర్షాదార పంటలలో పైపాటు ఎరువులను వేసుకోవాలి. పొద్దుతిరుగుడు, నవ్వులు, అలసందలు వంటి పంటలు విత్తుకోవాలి. వర్షాదార పంటలలో నిలిచిన నీటిని తీసేయాలి.
వరి:వరి నారుమళ్లలో కార్యోప్యూరాన్ 3 జి గుళికలలను 200 చ.మీ నారుమడికి (5 సెంట్లకు) ఒక కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి. దోమపోటు ఉధృతి తగ్గించుటకు ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ కాలిబాటను వదులుకొని తూర్పు పడమర దిశలలో వరుసలను ఉండే విధంగా వరినాట్లు వేసుకోవాలి.
పత్తి:ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మొనోక్రోటోఫాస్ మందును నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్‌తో విత్తిన 30 రోజుల పైరుకు పూయాలి. నేలలో ఎక్కువ మోతాదులో తేమ ఉన్నట్టయితే పత్తిలో వడలు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు వ్యాప్తి నివారణకు తెగులు సోకిన మొక్కలకు వాటి చుట్టూ ఉన్న మొక్కలకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్ల చుట్టూ నేలపై పోయాలి. అధిక వర్షాల నుండి పంట కోలుకొని త్వరగా అభివృద్ది చెందేందుకు 10. గ్రా. పొటాషియం నైట్రేట్ లేదా 20. గ్రా. యూరియా లేదా 10 గ్రా, నీటిలో కరిగే ఎరువులైన 19:19:19ని లీటరు నీటిలో కలిపి పంటపై వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారి చేయాలి.
మొక్కజొన్న:
ప్రస్తుత మేఘావృతమైన వాతావరఱ పరిస్థితులు మొక్కజొన్నలో ఎర్వినియా ఎండు తెగులు ఆశించుటకు అవకాశం ఉంది. తెగులు గమనించినట్టయితే నివారణకు ఎకరానికి 100 కిలోల వేపపిండి, 10 కిలోల 35శాతం క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి పొలంలో నేలపై తేమ ఉన్నప్పుడు మొక్కల మొదళ్లకు దగ్గరగా వెదజల్లాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్టు గమనించినట్టయితే విషపు ఎర తయారు చేసుకోవడానికి 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లం కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటుపులియనిచ్చి, మరుసటి రోజు 100 గ్రా. థైడికార్బ్‌ను కలుపుపుకుని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేయాలి.
కూరగాయలు:
ప్రస్తుత పొడి వాతావరణ పరస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో ఆకుమాడు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1మి.లీ ప్రోఫికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఆలస్యంగా నాటిన టమాట పైరులో శనగ పచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.25 మి.లీ నోవాల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాటలో తామర పురుగులు కూడా ఆశించేందుకు అనుకూలం. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Authorization