ప్రశ్న: నేను ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు డీఎస్ఈ అనుమతితో యుఎస్ఏకు వెళ్ళడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన ఏప్రిల్ 12న విధులలో చేరలేకపోయాను. జూన్ 1న విధులలో చేరాను, నా సెలవు కాలానికి అర్హత గల సెలవు మంజూరు చేయాలని కోరగా హెచ్ఎంగారు డీఎస్ఈ అనుమతి కావాలంటున్నారు. సమంజసమేనా? నాకు వేసవి సెలవు వేతనం వస్తుందా? రాదా? తెలుపగలరు?
- వి.సునీత, జగిత్యాల
జవాబు: సమంజసమే. మీకు సెలవు మంజూరు చేసిన డీఎస్ఈ ఉత్తర్వుల ప్రకారము మీరు తేదీ 12.4.2018న విధులలో చేరలేదు. కనుక ఏప్రిల్ 12 నుండి మీరు ఇండియాకు తిరిగివచ్చిన తేదీ వరకు విదేశీ పర్యటన అనుమతి పొడిగింపు ఉత్తర్వులు డీఎస్ఈ నుండి తీసుకోవాలి. ఏప్రిల్ 13 నుండి మే 31 వరకు వేసవి సెలవుల కాలాన్ని సఫిక్స్ చేసుకుని వేతనంపొందే అవకాశం ఉంది.
ప్రశ్న: నేను వరంగల్ అర్బన్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. మా తల్లికి అనారోగ్యరీత్యా విజయవాడలో చికిత్స చేయించాము. విజయవాడలో చికిత్స చేయించుకున్న సందర్భంలో తెలంగాణలో మెడికల్ రీయింబర్స్‌మెంటుకు అవకాశం ఉంటుందా? లేదా? తెలుపగలరు?
- రవీందర్, వరంగల్ అర్బన్
జవాబు: సాధారణ పరిస్థితుల్లో అవకాశం లేదు. కాని జీఓ నెం: 105 ప్రకారం అత్యవసర సందర్భాలలో ఇతర రాష్ట్రాలలో వైద్య చికిత్సకు అయిన ఖర్చును ప్రత్యేక అనుమతితో పొందవచ్చును. డీఎస్ఈ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోండి.
- టి. లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి,
టీఎస్‌యుటీఎఫ్
Authorization