ప్రశ్న: నేను ఎస్జీటీ ఉద్యోగం చేస్తూ జిల్లా విద్యాధికారిగారి అనుమతితో టీఎస్పీఎస్సీ పంచాయితీ సెక్రటరీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. నేను ఆ పోస్టు సాధిస్తే నాకు పే ప్రొటెక్షన్ వర్తిస్తుందా? ఎందుకంటే పంచాయితీ సెక్రటరీలు మూడు సంవత్సరాలు 15వేల రూపాయల కన్సాలిడేటెట్ పే పొందవలసి ఉంటుందని ఆ మధ్య సీఎం కేసీఆర్ క్రటించడం జరిగింది...
- జి.విశాల్, కోమటి కొండాపూర్, జగిత్యాల జిల్లా.
జవాబు: ప్రస్తుతం నిబంధనల ప్రకారం కన్సాలిడేటెడ్ వేతనం ఉన్న పోస్టులలో పే ప్రొటెక్షన్ ఉండదు.
ప్రశ్న: నేను 1996 డీఎస్సీ ద్వారా 1997 ఆగస్టులో నియామకం అయినాను. 2009 ఫిబ్రవరిలో సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతిని పొందాను. మరొక ఉపాధ్యాయుడు 1998 డీఎస్సీ ద్వారా నియామకం అయి 2009లోనే నా కంటే ఒకరోజు ముందుగా జరిగిన కౌన్సిలింగ్లో ఎస్ఏ గణితం పదోన్నతిని పొందాడు. మా ఇద్దరిలో ఎవరిని సీనియర్‌గా పరిగణించాలో తెలుపగలరు?
- పి.మధు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
జవాబు: మీరే సీనియర్. తెలంగాణ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు రూల్ 33(ఎ) ప్రకారం మొదటి నియామకం తేది ఆధారంగా మీరు 1997 ఆగస్టులో నియామకం అయినందున మీరే సీనియర్‌గా పరగణించబడుతారు. అలాగే పదోన్నతుల సందర్భంగా రూల్ 33(సి) ప్రకారం ''ఫిడర్ కేటగిరిని'' ఆధారంగా చేసుకొని సీనియారిటీని నిర్దారిస్తారు. అతనికంటే ముందుగానే 1997లోనే నియమితులైనందున ఫీడర్ కేడర్ సర్వీసు ప్రకారం మీరే సీనియర్‌గా పనిగణించబడుతారు. ఒకేసారి పదోన్నతులు నిర్వహిస్తున్న సందర్భంలో వేర్వేరు సబ్జెక్టులకు వేర్వేరు తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికి అందరిని ఒకే పూల్‌కింద పరిగణిస్తారు.
Authorization