ప్రశ్న: చైల్డ్‌కేర్ లీవ్ పెడుతున్న సమయంలో స్పెల్‌కి 15 రోజులు మించకుండా వినియోగించుకోవాలని అంటున్నారు. నేను చైల్డ్‌కేర్ లీవ్ పెట్టిన తేదికి ముందుగానీ, పూర్తయిన తర్వాత గాని పబ్లిక్ హాలిడేస్ కూడా పరిగణలోకి తీసుకోబడతాయని అంటున్నారు, నిజమేనా? తెలుపగలరు?
- మాధవి, పటాన్చెరు
జవాబు: నిజం కాదు. జీఓ యం.ఎస్.నెం.209, తేది: 21.11.2016 ప్రకారం చైల్డ్‌కేర్ లీవ్ 15 రోజులకు మించి మంజూరు చేయకూడదనే నిబంధన ఉంది. కాబట్టి చైల్డ్‌కేర్ లీవ్ పెట్టుకునే సందర్భంలో ఆకస్మికేతర సెలవులలాగనే పబ్లిక్ హాలీడేస్‌ను సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ చేస్తూ కలిపి వాడుకొనవచ్చు.
ప్రశ్న: నేను 2006 -2011 సంవత్సరాల మధ్య ఐదున్నర సంవత్సరాలు వైద్యకారణాలచే సెలవులో ఉన్నాను. 2011 ఆగస్టులో విధులలో చేరిన తర్వాత నా పీరియడ్ సెటిల్మెంట్ సందర్భంలో నా సెలవు కాలపు సర్వీసును ''డైస్‌నాన్''గా ప్రకటిస్తూ మూడు ఇంక్రిమెంట్లు కూడా నిలుపుదల చేశారు. 2015లో ఇచ్చిన ఈ ఉత్తర్వుల వలన నేను చాలా నష్టపోయాను, దీనిపై పున:సమీక్ష కోరుకునే అవకాశం ఉందా? తెలుపగలరు?
- ఆదిలాబాద్, ఈమెయిల్
జవాబు: అవకాశం లేదు. సీసీఏ రూల్స్ 1991లోని రూల్ 35 ప్రకారం మీరు ఐదు సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక సెలవులో ఉన్న మీకు ఉద్యోగంలో చేరడానికి అనుమతించి సెలవు కాలాన్ని ''డైస్‌నాన్'' ప్రకటించిన ఉత్తర్వులు మరియు పనిష్మెంట్గా మేజర్ పెనాల్టీ ఉత్తర్వులు కూడా ప్రభుత్వం నుండే జారీ చేయబడినందును అప్పీలు చేసుకునే అవకాశం లేదు. ఏ విధమైన ఉత్తర్వులు అయిన 3 నెలల్లోపు అప్పీలుకు వెళ్ళాల్సి ఉంటుంది.
Authorization