- దళిత యువకుడి పెండ్లిని బహిష్కరించిన కులస్తులు
- భూమి రాసిస్తేనే బొట్టు పెట్టుకుంటామని షరతు
''నీకున్న ఎకరం భూమిలో అరెకరం భూమి ముత్యాలమ్మ గుడికి ఇవ్వాలి. అలాగని కుల పెద్దలకు బాండ్ పేపర్‌పై వివరంగా రాసి, సంతకం చేసి ఇవ్వు. లేకుంటే నీకు, కులానికి సంబంధం లేదు'' అంటూ కుల పెద్దలు ఓ దళిత కుటుంబాన్ని బహిష్కరించారు. ''మాకు ఉన్నదే ఒక ఎకరం. అందులో అర ఎకరం రాసిస్తే మీమెలా బతకాలి. మేము రాసివ్వం'' అని ఆ కుటుంబ సభ్యులు కుల పెద్దలకు తమ బాధ చెప్పుకున్నారు. దీంతో కులం నిర్ణయాన్నే ధిక్కరిస్తావా? అంటూ ఆ కుటుంబాన్ని బహిష్కరించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో చోటు చేసుకుంది.
బట్టు యాదయ్య కుమారుడు బట్టు విజరుకుమార్ ఉన్నత చదువు చదివాడు. ఉద్యోగావకాశాలు లేక ఇంటివద్దే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. తన తాతగారు బట్టు సోమయ్య పేరున సర్వే నెంబర్ 612లో ఉన్న ఒక ఎకరం భూమిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ మిగతా సమయాల్లో కూలి పనులకు వెళ్తున్నాడు. అయితే ఆ భూమిలోనే ముత్యాలమ్మ గుడి ఉంది. తెలంగాణలో పెద్ద పండుగల్లో బోనాల పండుగ ఒకటి. ఎన్నో ఏండ్లుగా దళితులు బోనాల పండుగకు ఆ గుడి వద్దే బోనం సమర్పించుకుంటారు. నిరుద్యోగి అయిన బట్టు విజరుకుమార్ ఇటీవల ఉన్న భూమిని మరింత బాగు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆ భూమికి నీటి సదుపాయం కల్పించే పనుల్లో ఉన్నాడు. దీనిని జీర్ణించుకోలేని గ్రామ దళితులు ముత్యాలమ్మ గుడిని ఆయుధంగా చేసుకున్నారు. ఆ గుడి బట్టు సోమయ్య పొలంలోనే ఉంది. కాబట్టి ఆ గుడికి కొంత భూమిని వదిలిపెట్టాలని పట్టుబట్టారు. బాధిత కుటుంబాన్ని కుల పంచాయితీలోకి పిలిపించి ''మేము ప్రతి సంవత్సరం వైభవంగా పండుగ చేసుకుంటాం. గుడి చుట్టూ ట్రాక్టర్లు, బండ్లు తిరగాల్సి ఉంటుంది. అరెకరం భూమిని వదిలిపెడితేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి నీ భూమిలో అరెకరం వదిలిపెట్టి మిగతాది సాగు చేసుకోవాలి'' అని గ్రామ కుల పెద్దలు నిర్ణయించారు. దానికి బాధిత కుటుంబం ఒప్పుకోలేదు. ''మాకు ఉన్నదే ఒక ఎకరం. అందులో అర ఎకరం గుడికిస్తే మాకేం ఉంటుంది. కాబట్టి మీరు పండుగ చేసుకోండి. ఒక్కరోజు పండుగ కోసం మా పొట్ట కొట్టొద్దు'' అంటూ బాధిత కుటుంబం కుల పెద్దలకు తెలిపింది. దీనిని కుల పెద్దలు అంగీకరించలేదు. ''భూమి ఇస్తేనే నీతో మాట్లాడతాం. లేకుంటే మీ ఇంటికి ఎవరు రారు'' అంటూ బాధితులను ఛీదరించుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పెండ్లి చూపులకు బొట్టుపెట్టుకోని కుల పెద్దలు
ఈనేపథ్యంలో బట్టు విజరుకుమార్‌కు పెండ్లి చూపులు చూ స్తున్నారు. అమ్మాయి తరుపు వారు అబ్బా యి ఇంటికి వచ్చారు. వారి చుట్టాల మధ్య మాటా ముచ్చట ముగిసిన తర్వాత అం దరికీ బొట్టు పెట్టడం సాంప్రదాయం. ఆ సందర్భంలో నలుగు రు కులపోళ్లకు కూడా బొట్టు పెడతారు. బొట్టు పెట్టుకు నేందుకు కులపోళ్లను పిలవాలని అమ్మాయి తరుపువారు కోరారు. అబ్బాయి కుటుంబీకులు కులపోళ్లందరికీ బొట్టు పెట్టుకునేందుకు రావాలని ఇల్లిల్లు తిరిగి బతిమాలారు. కానీ గుడికి భూమి ఇచ్చేవరకు ఎవరూ రాలేమని మొఖం మీదే చెప్పారు. ఎవరూ రాకపోవడంతో కులపోళ్లు వస్తేనే మిగతా కార్యక్రమాలు కొనసాగిస్తామని అమ్మాయి తరుపువారు లేచి వెళ్లిపోయారు. దీనిని బాధిత కుటుంబం తీవ్ర అవమానంగా భావించిం ది. కనీసం అబ్బాయి సొంత బాబాయి, పెద నాన్నలను కూడా రాకుండా కులం వారు కట్టడి చేశారంటే గ్రామాల్లో కుల కట్టుబాట్లు ఏ స్థాయిలో రాజ్యమేలుతున్నాయో అర్థం చేసుకోవ చ్చు. ఒకరికి అన్యాయం జరుగుతుందంటే పది మంది బాధితుడికి అండగా నిలబడి న్యాయం చేయాల్సిన ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబాన్ని ఒంటరి చేసి, వారి జీవనాధారమైన భూమిని లాగేసుకునేలా కులం కట్టుబాటు పేరుతో మానసిక క్షోభకు గురి చేస్తున్నది. దీనిపై గ్రామ పెద్దలు సైతం నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం.
కులపోళ్లు బొట్టు పెట్టుకోలేదు
ఇటీవల నాకు పెండ్లి నిశ్చయమైంది. మాటా ముచ్చట ముగిసిన తర్వాత కులపోళ్లను బొట్టు పెట్టుకోవడానికి రావాలని ఇల్లిల్లు తిరిగినా ఒక్కరూ రాలేదు. మా తాత నుంచి లభించిన ఆ ఎకరం భూమే మాకు జీవనాధారం. అందులో అరెకరం రాసిస్తే మేమెలా బతకాలి. భూమి రాసిస్తేనే కులములో కలుపుకుంటారట. లేకుంటే మాతో ఎవరు మాట్లాడరట. కుల నిర్ణయమని మమ్నల్ని మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? పెద్దలు ఆలోచించాలి. లేకుంటే నాకు జరిగిన అన్యాయంపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడతాం. కోర్టును ఆశ్రయిస్తాం.
- బట్టు విజరుకుమార్, బాధిత యువకుడు
కుల పెద్దలైతే భూమి గుంజుకుంటరా?
కుల పెద్దలైతే అందరికీ మంచి చే యాలె. బక్కోడిని చూసి భూమి గుం జుకుంటరా? ఎకరం భూమిలో అరెక రం ఇవ్వమనడం న్యాయమే నా? మా పై కక్ష గట్టి ఇట్లా చేస్తుం డ్రు. ఏండ్ల నుంచి అక్కడ పండుగ చేసుకుంటు న్నరు. మేము వద్దన్న మా? ఎప్పుడూ లేనిది గిప్పుడెందుకు తిరకాసు పెడుతుండ్రు. ఆ భూమిలో కష్టం చేసుకొని బతుకుదామని పని చేసుకుం టున్నం. గందుకే గిట్లా భూమి గుంజుకునేందుకు అడ్డం పడు తుండ్రు. ఏదేమైనా భూమి ఇచ్చేదే లేదు. ఆ భూమి మాదే.
- బట్టు సోమయ్య, బాధితుడి తాతయ్య
- ఓగోటి కిరణ్‌కుమార్
సెల్ : 9666011107
Authorization