- భద్రాద్రి కొత్తగూడెం డెస్క్
అందరూ ఉన్నా ఆమెను అనాధను చేశారు. చివరి మజిలీని కూడా కమర్షియల్గా మార్చేశారు. ఆస్తిలో వాటా ఇవ్వబడుతుందనే తల్లి అంత్యక్రియలు అడ్డుకున్నారు. ఆస్తి కోసం వృద్ధురాలి మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లో ఉంచిన అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో బంగారుజాల గ్రామంలో ఇటీవల చోటు చేసుకుంది. బంగారుజాల గ్రామానికి చెందిన తాటి సమ్మయ్య, బుచ్చమ్మ భార్యా భర్తలు వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె అన్నారు. పిల్లలంతా చిన్నవారుగా ఉండగానే బుచ్చమ్మ అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సమ్మయ్య రత్తమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం లేదు. దీంతో గ్రామంలో రవి అనే అతన్ని దత్తత చేసుకుంది. కొంతకాలం క్రితం సమ్మయ్య కూడా మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. సమ్మయ్య ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడు కృష్ణ కొంత కాలం క్రితం మరణించాడు. రెండో కుమారుడు గోపాల్ గ్రామంలోనే ఉన్న భూమి సాగు చేసుకుంటున్నాడు. మూడో కుమారుడు ఆమీన్ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగి. కుమార్తె రాధ హైదరాబాద్లో ఉంటుంది. ఆస్తి పంపంకాల సందర్భంలో రత్తమ్మను చివరి వరకు చూసుకుని, అంత్యక్రియలు నిర్వహించే వారికి ఎకరం భూమి ఇచ్చేలా గ్రామపెద్దలు, బంధువుల సమక్షంలో కుమా రులు అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం పెంపుడు కొడుకు రవి ఆమె బాగోగులు చూసుకు న్నాడు. మార్చి 9న రత్తమ్మ (65) అనా రోగ్యంగా ఉంటే రవి కొత్తగూడెం ప్రభుత్వాసు పత్రికి తీసు కెళ్లాడు. ఆమె అక్కడే మృతి చెందింది. 10న అంత్య క్రియలకు ఏర్పాట్లు చేసే క్రమంలో ఆస్తి విషయం తెర మీదకొచ్చింది. అయితే పెంపుడు కొడుకు రవికి ఒప్పందం ప్రకారం ఎకరం భూమి ఇచ్చేది లేదని మొదటి భార్య వారసులు అడ్డుకున్నారు. ఆమె అంత్యక్రియలు చేస్తే పెంపుడు కొడుకు రవికి భూమి ఇవ్వాల్సి వస్తుందని అందుకు నిరాకరించారు. ఒప్పందం ప్రకారం ఎకరం భూమి ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామంటూ పెంపుడు కొడుకు రవి తరుపు వారు మొండికేశారు. మృతదేహాన్ని ఇంట్లో పెట్టి బేరసారాలు సాగించారు. ఒప్పందం కుదరకపోవడంతో ఇరుపక్షాల పంతాలతో రత్తమ్మ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేశారు. మూడు రోజులుగా గ్రామపెద్దలు, బంధువులు నచ్చజెప్పినా వారు వినలేదు. వ్యవహారం కాస్త పోలీసులు దృష్టికి వెళ్లడంతో వారు వచ్చి 'ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి, మృతదేహాన్ని అలా ఉంచకూడదు' అని వారికి చెప్పడంతో 11వ తేదీ రాత్రి ఏడు గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.
సెల్ : 9494636041
Authorization