ఫాక్స్ అందంతోపాటు అభినయంతోనూ మెప్పించారు. ఎక్కువగా గ్లామర్ తరహా పాత్రలు పోషించినప్పటికీ వాటిల్లో కూడా తనదైన నటనతో అలరించారు. టైప్కాస్ట్ పాత్రలను చేసేందుకు ఇష్టపడేవారు కాదు. సాధ్యమైనంత వరకు భిన్నమైన పాత్రలకే ప్రయారిటీ ఇచ్చారు. కామెడీ, యాక్షన్, రొమాంటిక్, ఇన్నోసెంట్, స్ట్రగుల్ ఇలా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
ఫాక్స్ ప్రధాన పాత్రధారిణిగా నటించిన చిత్రం 'కన్ఫెషన్స్ ఆఫ్ ఏ టీనేజ్ డ్రామా క్వీన్'. ఓ యువ నటి తన కెరీర్ కోసం, మ్యూజిక్ షోస్ ద్వారా అలరించడం కోసం తన కుటుంబాన్ని న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీకి మారుస్తుంది. అనంతరం ఆమె చేసే సందడి, హంగామా నేపథ్యంలో టీనేజ్ మ్యూజికల్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌కి ప్రత్యర్థిగా, తాను చదువుకునే స్కూల్లో అత్యంత ఆకర్షించబడే అమ్మాయిగా ఫాక్స్ నటించారు.
2007లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'ట్రాన్స్ఫార్మర్స్'లో నటించారు. ఒక టీనేజ్ ప్రేమ జంట ఇతివృత్తంగా భూమిపై హీరోయిక్ రోబోట్స్, రాక్షస రోబోస్ మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో రూపొందిన చిత్రం 'ట్రాన్స్ఫార్మర్స్'. మైఖేల్ బే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టీనేజ్ కుర్రాడు, ఆర్టిక్ ఎక్స్‌ప్లోరర్‌కి ప్రియురాలిగా, అతని మిషన్‌కు సహయకురాలిగా ఫాక్స్ తనదైన నటనతో మంత్రముగ్దుల్ని చేశారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'ట్రాన్స్ఫార్మర్స్: రివేంజ్ ఆఫ్ ది ఫాలెన్'లోనూ హీరోకి ప్రియురాలిగా శక్తివంతమైన పాత్రలో, యాక్షన్ సీక్వెన్స్‌లతో మైమరపించారు.
కామెడీ ప్రాధానంగా తెరకెక్కిన బ్రిటీష్ చిత్రం 'హౌ టు టాస్ ఫ్రెండ్స్ అండ్ ఎలియనేట్ పీపుల్'. ఒక రైటర్ స్ట్రగుల్‌ని, న్యూయార్క్ మ్యాగజైన్లో హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలని పడే సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నటిగా అందం, అభినయంతో మెప్పించారు. హీరోయిన్లుగా రాణించాలని హాలీవుడ్‌కి వచ్చిన కొంత మంది అమ్మాయిల జీవితాలను, వారి ఊహాలను ప్రతిబింబించే కథాంశంతో ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కిన చిత్రం 'వోర్'. హీరోయిన్ కావాలనుకునే అమ్మాయిల్లో ఒకరిగా నటించి ఫాక్స్ భిన్న భావోద్వేగాలతో
ఆకట్టుకున్నారు. ఒక స్కూల్ గర్ల్ తన క్లాస్‌మేట్‌ను హత్య చేస్తుంది. దాన్ని మరో ఫ్రెండ్ ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మరి ఆ అమ్మాయి అలా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది. ఆమెలో ఆవహించిన శక్తి ఏంటనే ఆసక్తికర కథనంతో సూపర్ నేచురల్ హర్రర్ డార్క్ కామెడీ ప్రధానంగా రూపొందిన చిత్రం 'జెన్సీఫర్స్ బాడీ'. ఇందులో హత్య చేసే విద్యార్థినిగా ఫాక్స్ నటన కట్టిపడేస్తుంది. భయపెడు తుంది. థ్రిల్‌కి గురిచేస్తుంది. అందంతో మంత్రమగ్దుల్ని చేస్తుంది. సూపర్ నేచురల్ యాక్షన్ ఫాంటసీ
డ్రామాగా రూపొందిన 'జోనా హెక్స్' చిత్రంలో వేశ్యగా, గన్ పట్టుకుని ప్రత్యర్థులను అంతం చేసే సైనికురాలిగా విభిన్న పాత్రలో నటించి మెప్పించారు. ఓ గ్యాంగ్‌స్టర్ వద్ద చిక్కుకుపోయిన దేవకన్య ఎలాంటి ఇబ్బంది పడిందనే నేపథ్యంలో రొమాంటిక్ ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన 'ప్యాషన్ ప్లే' చిత్రంలో దేవకన్యగా అందం, అమాయకమైన అభినయంతో ఫాక్స్ మంత్రముగ్దుల్ని చేసింది. అబ్బాయి, అమ్మాయి చిన్న నాటి స్నేహితులు. వీరు తమ బంధాన్ని మరింత కాలం కొనసాగించాలనుకుని పెళ్ళి చేసుకుంటారు. అనంతరం వీరి జీవితంలోకి ఓ అందమైన యువ కథానాయిక వస్తే ఏం జరిగింది?, పిల్లల విషయంలో వీరు తీసుకున్న నిర్ణయమేంటి అనే కథాంశంతో రొమాంటిక్ కామెడీ డ్రామాగా 'ఫ్రెండ్స్ విత్ కిడ్స్' చిత్రం రూపొందింది. ఇందులో అందమైన యువ కథానాయికగా ఫాక్స్ నటించి మెప్పించారు.
పెటా, దెబ్బీ 40ఏండ్లు దాటిన భార్యభర్తలు. వ్యాపారంలో ఫెయిల్ అవడంతో పిల్లలు వారిని ద్వేషిస్తారు. ఇంటిని కోల్పోవడంతోపాటు రిలేషన్షిప్ కూడా ప్రమాదంలో పడుతుంది. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారంగా రొమాంటిక్ కామెడీగా 'దిస్ ఈజ్ 40' చిత్రం రూపొందింది. ఇందులో దెబ్బీ ఆఫీసులో పనిచేసే అమ్మాయిగా ఫాక్స్ నటించారు. న్యూయార్క్ సిటీకి కింగ్‌పిన్‌గా రాణిస్తున్న నాయకుడికి శత్రు బృందం నుంచి అపాయం పొంచి ఉంది. దీంతో వింత ఆకారంలోని యోధుల బృందం అతనికి, వారి ఇంటికి రక్షణగా నిలిచి ప్రత్యర్థులను ఎదుర్కొనే కథాంశంతో రూపొందిన సూపర్ హీరో యాక్షన్ చిత్రం 'టీనేజ్ మ్యూటంట్ నింజా టర్టిల్స్'. ఇందులో ఛానెల్ 6 న్యూస్ రిపోర్టర్‌గా ఎప్రిల్ ఓ నీల్ పాత్రలో మేగాన్ ఫాక్స్ నటించి అలరించారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన సినిమాలోనూ అదే పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రాలు ఫాక్స్‌ను హాలీవుడ్లో అగ్రస్థాయి కథానాయికగా నిలబెట్టాయి.
Authorization