పాప్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్న జెన్నీఫర్‌పై శృంగార నాయికగా పేరు పడింది. శృతిమించిన అందాల అరబోతకు ప్రాధాన్యతనిచ్చారని పలు పత్రికలు కథనాలు రాసినప్పటికీ పాప్ కల్చర్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్నారు. విమర్శకులు, సినీ విశ్లేషకులు ఎలిజబెత్ టేలర్‌తో జెన్నీని పోల్చడం విశేషం. 1998లో డిటెయిల్ మ్యాగజీన్ ఆమెను సెక్సీయెస్ట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా అభివర్ణించింది. ఎఫ్హెచ్ఎం మ్యాగజీన్ ప్రకటించిన వంద మంది సెక్సీయెస్ట్ ఉమెన్‌లో ఒకరిగా నిలిచారు. 2011లో పీపుల్ మ్యాగజీన్ ఆమెను మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్‌గా వర్ణించింది. అమెరికాలో అత్యంత ప్రభావితం చేయగల పర్‌ఫెర్మర్‌గా పేరు తెచ్చుకున్నారు. వినోద రంగంలో ఉన్న అన్ని రకాల బారియర్స్‌ను బ్రేక్ చేసిందనే పేరు జెన్నీకి ఉంది. అలాగే మల్టీడైమెన్షనల్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకున్నారు. అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికల్లో ఒకరిగా, అత్యంత ధనవంతురాలైన సెలబ్రిటీగా నిలిచారు. ఫోర్బ్స్ ఆమెను మోస్ట్ పవర్ఫుల్ ఎంటర్టైనర్గా వర్ణించింది. మ్యూజిక్ కెరీర్ ప్రారంభంలో ఆమె లాటిన్ ఎక్స్ప్లోషన్గా నిలిచి, అమెరికాలో లాటిన్ పాప్ మూవ్‌మెంట్‌ను తీసుకొచ్చారు. ట్రిపుల్ ట్రీట్ పర్ఫార్మ్తో గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు. వంద మంది గొప్ప మ్యూజిక్ ఉమెన్‌లో 16వ స్థానం దక్కించుకున్నారు. ఎంతో మంది యువ పాప్స్టార్స్కి స్ఫూర్తిగా నిలిచారు. 2000లో హస్ వీక్లీ ఆమెను స్టయిల్ ఐకాన్ అని పిలిచింది. దీంతోపాటు పలు పత్రికలు ఫ్లై గర్ల్‌గా వర్ణించాయి. జెన్నీఫర్ లోపేజ్ నటనకు అనేక అవార్డులు క్యూకట్టాయి. నటిగా ఏడు ఆల్మా అవార్డులు, సింగర్‌గా మూడు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, మూడు బిల్బోర్డ్ అవార్డులు, ఒక ఐకాన్ పురస్కారం, సింగిల్స్కిగానూ పది బిల్బోర్డ్ పురస్కారాలు దక్కాయి. 'జే టు థా ఎల్ ఓ ది రీమిక్సెస్' మొదటి రీమిక్స్ ఆల్బమ్‌గా, 'ఆన్ ది ఫ్లోర్' అత్యధిక మంది చూసిన ఆల్బమ్‌గా గిన్నిస్ రికార్డు సృష్టించాయి. మొత్తంగా నటిగా, సింగర్‌గా దాదాపు 121 అవార్డులు సొంతం చేసుకున్నారు.