జెన్నీఫర్ లోపేజ్..
యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న సంచలన క్రేజీ పాప్ స్టార్. యువ ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన శృంగార నాయిక. నటిగా, సింగర్‌గా, డాన్సర్‌గా, నిర్మాతగా తనదైన మార్క్‌తో మోస్ట్ పవర్ఫుల్ ఎంటర్టైనర్గా చరిత్ర సృష్టించిన ఆల్‌రౌండర్. గర్భిణీ స్త్రీల సంరక్షణ, పేద పిల్లలకు విద్యతోపాటు టెర్రరిస్టుల దాడులు, తుపానులు, వరదల భీభత్సంతో సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థిక చేయూతనిచ్చి స్ఫూర్తిదాయక సామాజిక సేవకురాలిగా నిలిచిన జెన్నీఫర్ లోపేజ్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ఆటలతోపాటు పాటలపై కూడా ఆసక్తి..
అమెరికాలోని న్యూయార్క్‌లో 1969 జులై 24న జెన్నీఫర్ లిన్న్ లోపేజ్ జన్మించారు. తల్లిదండ్రులు గ్వాడలుపే రోడ్రిగెజ్, డేవిడ్ లోపేజ్. ముగ్గురు సంతానంలో జెన్నీఫర్ రెండో అమ్మాయి. అక్క లెస్లీ, చెల్లి లిండా ఉన్నారు. వీరిది పేద కుటుంబం. అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చేది. లోపేజ్‌కు ఐదవ ఏటనే పాటలపై ఆసక్తి ఏర్పడింది. పాటలు పాడటం, డాన్స్ చేయడం ప్రారంభించారు. ఏండేండ్ల వయసులోనే స్కూల్ తరఫున వివిధ ప్రాంతాలకు తిరిగి ప్రదర్శనలు ఇచ్చింది. పాటలు, డాన్స్ మాత్రమే కాదు జిమ్నాస్టిక్స్, ర్యాన్ ట్రాక్ వంటివి నేర్చుకుని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. స్కూల్ సాఫ్ట్‌బాల్ టీమ్‌లోనూ సభ్యురాలిగా ఉన్నారు. నేషనల్ ట్రాక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నారు. చదువు కంటే ఆటల్లో బాగా రాణించారు.
తల్లిదండ్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ..
హైస్కూల్ చివరి సంవత్సరంలో సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. 1986లో చిన్న సినిమా 'మై లిటిల్ గర్ల్'లో ఎంపికయ్యారు. తొలి చిత్రంలోనే స్ట్రగుల్స్ పడే అమ్మాయిగా నటించారు. తొలి సినిమా తర్వాత భవిష్యత్‌లో పెద్ద సినిమా స్టార్ కావాలని నిర్ణయించుకున్నారు. అయితే తల్లిదండ్రుల నుంచి భిóన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హీరోయిన్గా ప్రయత్నాలు సాగిస్తూనే 'జీసస్ క్రైస్ట్ట్్ సూపర్‌స్టార్', 'ఒక్లాహౌమా' వంటి మ్యూజికల్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. ఐదు నెలల యూరప్ టూర్లో లోపేజ్ అద్భుత ప్రతిభను గుర్తించి జపాన్‌కు చెందిన మ్యూజికల్ కంపెనీ సింక్రోనిసిటీ షోలో ఉద్యోగం ఇచ్చింది. ఇందులో నటిగానేకాదు, సింగర్‌గా, డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. అమెరికన్ బారు బ్యాండ్ గ్రూప్ 'న్యూ కిడ్స్ ఆన్ ది బ్లాక్'లో బ్యాకప్ డాన్సర్‌గా, 'గేమ్స్' అనే సింగిల్‌లో మెస్మరైజ్ చేసి, 18వ యాన్వల్ అమెరికన్ మ్యూజిక్ అవార్డు సొంతం చేసుకున్నారు. అనంతరం అమెరికన్ రికార్డింగ్ ఆర్టిస్టు జానెల్ జాక్సన్‌తో కలిసి పలు మ్యూజికల్ టూర్స్‌లో బ్యాకప్ డాన్సర్‌గా ఆకట్టుకున్నారు.
బుల్లితెర నుంచి వెండితెర అగ్రస్థాయి నటిగా..
1993 నుంచి పూర్తి స్థాయిలో సినీ రంగంపై దృష్టి సారించారు. టెలివిజన్ ఫిల్మ్ 'లాస్ట్ ఇన్ ది వైల్డ్'లో నటించారు. అందులో నటనకు మంచి పేరొచ్చింది. సీబీఎస్ టెలివిజన్ సంస్థ ఆమెతో 'సెకండ్ ఛాన్సెస్' టెలివిజన్‌లో నటించే డీల్ కుదుర్చుకున్నారు. ఈ రెండు సిరీస్‌లు జెన్నీకి 'మై ఫ్యామిలీ'లో నటించే ఛాన్స్ తెచ్చిపెట్టింది.
కానీ అది పెద్దగా గుర్తింపు లేని పాత్రే. పూర్తి స్థాయిలో మెయిన్ లీడ్‌గా 1995లో వచ్చిన 'మనీ ట్రైన్' సినిమా నటిగా మంచి పేరు తీసుకొచ్చింది. కామెడీ చిత్రం 'జాక్'లో రాబిన్ విలియమ్స్‌తో కలిసి నటించారు. ఫ్రాన్సిస్ కొప్పొల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నెగటివ్ రివ్యూను పొందినప్పటికీ నటిగా జెన్నీకి మంచి మార్కులే పడ్డాయి. 1997లో జాక్ నికోల్సన్, స్టీఫెన్ డార్ఫ్లతో కలిసి నటించిన థ్రిల్లర్ చిత్రం 'బ్లడ్ అండ్ వైన్' బాక్సాఫీసు వద్ద ఘోరపరాజయం చవిచూసింది. అదే ఏడాది ఆమె 'సెలెనా' చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. మోడల్, సింగర్, ఫ్యాషన్ డిజైనర్, మోస్ట్ పాపులర్ నటి సెలెనా జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జెన్నీఫర్ కెరీర్లో పెద్ద బ్రేక్ ఇచ్చింది. మరో బ్లాక్‌బస్టర్ 'ఆనకొండ' తన కెరీర్లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది. దీంతోపాటు ఒలివర్ స్టోన్ దర్శకత్వంలో అగ్రనటుడు సియన్ పెన్న్తో కలిసి నటించిన 'యూటర్న్' కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అనంతరం వరుసగా 'ఔట్ ఆఫ్ సైట్', 'అంట్జ్', 'ది సెల్', 'ది వెడ్డింగ్ ప్లానర్', 'ఏంజెల్ ఐస్', 'ఎనఫ్', 'మై ఇన్ మ్యాన్‌హట్టన్', 'గిగ్లీ', 'జెర్సీ గర్ల్', 'షల్ వి డాన్స్', 'మాంస్టర్ ఇన్ లా', 'యాన్ అన్ఫినిష్డ్ లైఫ్', 'బార్డర్టౌన్' చిత్రాల్లో నటించి అగ్ర నటిగా ఎదిగారు.
మలుపు తిప్పిన మ్యూజిక్ కాన్సర్ట్ టూర్..
2007లో సల్సా సింగర్ హెక్టర్ లావో జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ చిత్రం 'ఎల్ కాంటెంటే'లో బాక్సాఫీసు వద్ద ఘోరపరాజయం చవిచూసింది. అదే సమయంలో విడుదలైన తన ఆరవ ఆల్బమ్ 'బ్రేవ్' అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సంవత్సరం నటించిన టెలివిజన్ సిరీస్‌లు కూడా ఆదరణ పొందలేదు. దీనికితోడు ఆమె ప్రెగేెన్సీ కారణంగా కొంత కాలం కెరీర్‌కి దూరంగా ఉన్నారు. 2009లో రూపొందించిన ఏడవ ఆల్బమ్ 'లవ్', 2010లో నటించిన సెటైరికల్ చిత్రం 'ది బ్యాక్ అప్ ప్లాన్' ఆశించిన ఫలితాన్నివ్వలేదు. వరుస పరాజయాలతో జెన్నీ ఇమేజ్, మార్కెట్ అమాంతం పడిపోయింది. అప్పుడే అమెరికన్ ఐడల్‌లో జడ్జ్‌గా వ్యవహరించే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత పలు మ్యూజిక్ కాన్సర్ట్ కోసం టూర్ నిర్వహించారు. వీటితో తిరిగి పూర్వవైభవాన్ని పొందారు. ఆ తర్వాత వరుసగా 2010లో 'ది బ్యాకప్ ప్లాన్', 2012లో 'వాట్ టు ఎక్స్పెక్ట్ వెన్ యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్', 'ఐస్ ఏజ్: కంటినెంటల్ డ్రిఫ్ట్', 'పార్కర్', 2015లో 'ది బారు నెక్ట్స్ డోర్', 'లిలా అండ్ ఎవా', 'హౌమ్' 2016లో 'ఐస్ ఏజ్: కోల్లిసన్ కోర్స్', 2018 'సెకండ్ యాక్ట్' వంటి విభిన్న కథా చిత్రాల్లో మెప్పించి తిరుగులేని నటిగా ఎదిగారు. నటిగా రాణిస్తూనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తన అభిరుచిని చాటుకున్నారు. 'బార్డర్టౌన్', 'ఎల్ కాంటెంటే', 'ఫీల్ ది నాయిస్', 'జెన్నీఫర్ లోపేజ్: డాన్స్ ఎగైన్', 'ది బారు నెక్ట్స్ డోర్', 'సెకండ్ యాక్ట్' చిత్రాలను నిర్మించారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు మ్యూజిక్ షోస్ చేస్తూనే టెలివిజన్స్లోనూ రాణించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 'సెకండ్ ఛాన్సెస్', 'సౌత్ సెంట్రల్', 'హౌటల్ మలిబు', 'హౌ ఐ మీట్ యువర్ మదర్', 'షేడ్స్ ఆఫ్ బ్లూ', 'విల్ గ్రేస్' టెలివిజన్స్తో టీవీ రంగంలోనూ క్రేజీ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం 'బై బై బర్ల్డీ లైవ్'లో నటిస్తున్నారు. నిర్మాతగా 'సౌత్ బీచ్', 'డాన్స్ లైఫ్', 'జెన్నీఫర్ లోపేజ్ ప్రజెంట్స్: కోమో అమా ఉనా ముజర్' వంటి తదితర టెలివిజన్స్ నిర్మించారు.
ఉర్రూతలూగించే సంగీత తరంగం..
కెరీర్ ప్రారంభం నుంచి ఓ వైపు సినిమాలు, మరోవైపు టెలివిజన్స్, వీటి మధ్యలో మ్యూజిక్ షోలు.. ఇలా మూడు రంగాల్లో తన ప్రతిభను చాటారు. కథానాయికగా కంటే జెన్నీ మ్యూజిక్ షోస్ ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. తొలిసారి రూపొందించిన ఆల్బమ్ 'ఆన్ ది 6' సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే ఏడాది ఆమె రూపొందించిన సింగిల్ 'ఇఫ్ యు యాడ్ మై లవ్' ఆరు దేశాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది. 'జె.ఎల్ఓ' ఆల్బమ్ సైతం విశేష ఆదరణ పొందింది. అలాగే ఆమె నటించిన 'ది వెడ్డింగ్ ప్లానర్' చిత్రం విడుదలై హిట్ కావడంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ మరోసారి విపరీతంగా పెరిగింది. 2002లో 'జే టు థా ఎల్ ఓ, ది రీమిక్సెస్' అనే రీమిక్స్ ఆల్బమ్ చేశారు. ఇది వరల్డ్ మ్యూజికల్ హిస్టరీలోనే తొలి రీమిక్స్ ఆల్బమ్‌గా చరిత్ర సృష్టించింది. ఐదవ ఆల్బమ్ 'కోమో అమా ఉనా ముజెర్' మొదటివారంలో అత్యధికంగా అమ్ముడు పోయిన ఆల్బమ్‌గా నిలిచింది. దీంతోపాటు జెన్నీ అనేక దేశాల్లో లైవ్ కాన్సర్ట్స్ ఇచ్చారు. తనదైన ఆటపాటలతో ఉర్రూతలూగించారు. జెన్నీఫర్ రూపొందించిన ఆల్బమ్స్ దాదాపు 40 మిలియన్స్, రికార్డింగ్స్ 80 మిలియన్స్ అమ్ముడుపోయాయి. స్టూడియో ఆల్బమ్స్‌లో 'ఆన్ ది 6', 'జె.లో', 'దిజ్ ఈజ్ మీ.. దెన్', 'రీబర్త్', 'కోమో అమా ఉనా ముజెర్', 'బ్రేవ్', 'ఏకేఏ' ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా ఆదరణ పొందడంతోపాటు ఓ ఊపుఊపాయి. సింగిల్స్‌లో 'ఇఫ్ యు యాడ్ మై లవ్', 'ఐ యామ్ రియల్', 'ఐ నాట్ ఇట్ ఫన్నీ', 'ఆల్ ఐ హవ్', 'ఆన్ ది ఫ్లోర్' బెస్ట్ సింగిల్స్‌గా ఆల్‌టైమ్ రికార్డ్‌లు సృష్టించాయి. తన మ్యూజిక్ ద్వారా ఎక్కువగా రొమాంటిక్ ఇన్నోసెన్స్‌ను తెలియజేశారు. సల్సా, బచాటా మ్యూజిక్ ప్రభావం ఆమెపై ఎక్కువ. 1979లో ఆమె చేసిన హిప్ హాప్ 'ర్యాపర్స్ డిలైట్', 'ది షుగర్ హిల్ గ్యాంగ్' సాంగ్స్ తన మ్యూజిక్ స్టయిల్‌ను మార్చాయి. అంతేకాదు తన మ్యూజిక్ ద్వారా మహిళా సాధికారతను చాటారు. ఇక జెన్నీ సిగేచర్ డాన్స్‌లు అందరినీ ఫిదా చేశాయి.
లైవ్ కాన్సర్ట్స్తో విస్తృత సేవా కార్యక్రమాలు..
క్యూబన్ వెయిటర్ ఓజాని నోవా, నిర్మాత సియాన్ కోంబ్స్, డాన్సర్ క్రిస్ జుడ్, దర్శకుడు బెన్ ఎఫ్లెక్, మార్క్ ఆంథోనీ, బ్యాకప్ డాన్సర్ కాస్పర్ స్మార్ట్, బేస్‌బాల్ ప్లేయర్ అలెక్స్ రోడ్రిజ్డ్ వంటి తదితరులతో డేటింగ్, వివాహబంధం బ్రేకప్ అవడంతో జెన్నీ వ్యక్తిగత జీవితం సాఫీగా సాగలేదు. 2001 సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్‌పై టెర్రరిస్టుల దాడి సందర్భంగా, పలు ఛారిటీ యాక్టివిటీస్ చేపట్టారు. 'వాట్స్ గోయింగ్ ఆన్', 'ఎల్ అల్టిమో అడియాస్' పాటలతో పలు చోట్ల కాన్సర్ట్స్ నిర్వహించి పది మిలియన్ డాలర్ల విరాళం సేకరించి బాధితులకు అందించారు. 2009లో తన సోదరి లిండాతో కలిసి 'లోపేజ్ ఫ్యామిలీ ఫౌండేషన్'ను స్థాపించి, పేదరికంలో మగ్గుతున్న మహిళలు, చిన్న పిల్లల ఆరోగ్యం కోసం అండగా నిలిచారు. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, గర్బిణీ స్త్రీల సంరక్షణ, మహిళా, పేద పిల్లల విద్య, మహిళలపై జరిగే హింస వంటి వాటిపై బిసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండేషన్, యునైటెడ్ నేషన్స్ ఫౌండేషన్లతో కలిసి పలు ఛారిటీలు నిర్వహించారు. ఇర్మా, మారియా తుపాను బాధితులను ఆదుకునేందుకు తన మాజీ భర్త ఆంథోనితో కలిసి హ్యూమని టేరియన్ రిలీఫ్ క్యాంపెయిన్ చేపట్టారు. లైవ్ కాన్సర్ట్స్ నిర్వహించి 35 మిలియన్ డాలర్లు సేకరించారు. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ రైట్స్ కోసం సపోర్ట్ చేశారు. ఎయిడ్స్ పరిశోధనల కోసం భారీగా విరాళాలు సేకరించారు. 2016లో ఓర్లాండో నైట్ క్లబ్‌పై టెర్రరిస్ట్‌లు చేసిన దాడి కారణంగా అనేక మంది చనిపోయారు. వారి కోసం కాన్సర్ట్ నిర్వహించి తన వంతు సాయం అందించారు. అయితే యానిమల్ రైట్ ఆర్గనైజేషన్ పేటాను విమర్శించడం గమనార్హం.
Authorization