యాక్షన్ హీరోగా పాపులర్ అయిన సిల్వెస్టర్ స్టాలోన్ విభిన్న పాత్రల్లోనూ నటించి మెప్పించారు. రేసింగ్ ప్రధానంగా రూపొందిన 'డెత్ రేస్ 2000' సినిమాలో ఛాంపియన్ రేసర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. చిన్నపాటి క్లబ్ఫైటర్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్‌గా నిలవడమనే ఇతివృత్తంతో రూపొందిన 'రాకీ'లో బాక్సర్ రాకీ బాల్బోవా పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తనదైన పంచ్‌లతో ఆడియెన్స్‌ను మంత్రముగ్దుల్ని చేశారు. ఈ సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాల్లోనూ రాకీ పాత్రల్లో నటించి యాక్షన్ హీరోగా ఎదిగారు.
ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంలో రూపొందిన 'ఎస్కేప్ టు విక్టరీ'లో ఫుట్‌బాల్ కెప్టెన్‌గా మెప్పించారు. 'రాంబో' సిరీస్‌లో మొదటగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ఫస్ట్‌బ్లడ్'లో వియత్నాం యుద్ధ వీరుడిగా అబ్బుర పరిచారు. క్రైమ్‌ను అరికట్టేందుకు పోలీస్ చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'కోబ్రా'లో లాస్ ఏంజెల్స్‌కు చెందిన పోలీస్ అధికారిగా మెస్మరైజ్ చేశారు. మాఫియాను అంతమొందించేందుకు చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన బడ్డీ కాప్ యాక్షన్ కామెడీ 'ట్యాంగో అండ్ క్యాష్' చిత్రంలోనూ లాస్ ఏంజెల్స్‌కు చెందిన పోలీస్ అధికారిగా తనదైన స్టయిలీస్ యాక్షన్‌తో మెప్పించారు. ప్రిజన్ డ్రామా 'లాకప్'లో మెకానిక్‌గా, ఖైదీగా ఆకట్టుకున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన 'ఆస్కార్' చిత్రంలో మాజీ గ్యాంగ్‌స్టర్‌గా కామెడీ తరహా పాత్రలో కనువిందు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ 'ది స్పెషలిస్ట్'లో సీఐఏకు చెందిన ఏజెంట్‌గా, క్రైమ్ డ్రామా 'కాప్ ల్యాండ్'లో లాస్ ఏంజెల్స్ అధికారిగా నటించారు. మరో యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ఎక్స్‌పెండబుల్స్'లో సైనిక బృందానికి లీడర్‌గా అబ్బురపరిచారు. ఇందులో జానస్ స్టెథమ్, జెట్ లీ, స్టీవ్ ఆస్టిన్, బ్రూస్ విల్స్, మైఖీ రూక్ వంటి నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక కామెడీ ప్రధానంగా రూపొందిన 'జూకీపర్'లో జంతు సంరక్షకుడిగా, యాక్షన్ థ్రిల్లర్ 'బుల్లెట్ టు ది హెడ్'లో మంచి హంతకుడిగా, యాక్షన్ థ్రిల్లర్ 'ఎస్కేప్ ప్లాన్'లో వరల్డ్ బెస్ట్ ఎస్కేప్ ఆర్టిస్టుగా, వ్యాపారవేత్తగా, ఇంజనీర్‌గా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మైమరపించారు. 'రాకీ' సిరీస్‌లో భాగంగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'క్రీడ్'లో రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన రాకీగా, బాక్సింగ్ ట్రైనర్‌గా మెప్పించారు.
Authorization