రుతుస్రావం సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్న వారు ఐరన్ కోల్పోతారు. అలాంటప్పుడు యువతులు, మహిళలు తీసుకోవాల్సిన ఆహారం గురించి అవగాహన ఉండటం ఎంతో అవసరం... మీరు శాకాహారులైతే రోజూవారీ ఆహారంలో తాజాగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు, ఎండు ఖర్జూరం, నువ్వులు, బెల్లం, గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారులైతే చేపలు, చికెన్‌తో పాటు... లివర్‌ను ప్రత్యేకంగా తీసుకోండి. మాంసాహారులైనా, శాకాహారులైనా కోడి గుడ్డు, పాలు తప్పనిసరి. ప్రతినెలా రక్తం కోల్పోతుండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గుతుంది. అందుకే రక్తహీనత రాకుండా ఐరన్‌ను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ఉన్నప్పటికీ మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే అది తిన్నవెంటనే ఒంటికి పడుతుంది. అదే శాకాహార పదార్థాల్లోని నాన్‌హీమ్ ఐరన్ మన ఒంటికి పట్టాలంటే.. అదనంగా విటమిన్ 'సి' కావాలి. కాబట్టి శాకాహార పదార్థాలతో పాటు విటమిన్ 'సి' ఉండే తాజాపండ్లు... జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటి వాటినీ కొవ్వులు ఉండే ఆహారాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా పరిమితంగా తీసుకోవాలి. బేకరీ ఐటమ్స్, కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అసలు తీసుకోకూడదు.