విశ్వ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులను ఈ ఏడాది ఎవరు గెల్చుకుంటారనే ఉత్సుకత అందరిలోనూ ఉంది. 92వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవం ఫిబ్రవరి 9న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా సినీ విశ్లేషకులు ఫలానా చిత్రానికి, ఫలానా నటుడికి.. ఆస్కార్ గ్యారంటీ అంటూ జోస్యం చెబుతున్నారు. అయితే గతేడాది వీరి జోస్యం తారుమారైన విషయం విదితమే. ఎవ్వరూ ఊహించని రీతిలో కొన్ని చిత్రాలు అవార్డుల్ని దక్కించుకున్నాయి. మరి ఈసారైనా సినీ విశ్లేషకుల జోస్యం ఫలిస్తుందో లేదో వేచి చూద్దాం..
ఉత్తమ చిత్రాల విభాగంలో పోటీ పడుతున్న కొన్ని చిత్రాలు
జోకర్
ఈ ఏడాది ఆస్కార్ బరిలో 'జోకర్' చిత్రం ముందు వరుసలో ఉంది. ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఎడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నటుడు, సినిమాటోగ్రఫీ, మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్, కాస్ట్యూమ్ డిజైన్, ఎడిటింగ్, ఒరిజినల్ స్కోర్, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ వంటి తదితర 11 విభాగాల్లో ఆస్కార్ కోసం పోటీ పడుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా దర్శకుడు టాడ్ ఫిలిప్స్ రూపొందించిన ఈ చిత్రంలో జోకర్ ఆర్థూర్ ఫ్లెక్ పాత్రలో జోవాక్విన్ ఫోయినిక్స్ నటించారు. రియల్ లైఫ్‌లోని అమెరికాకు చెందిన ఓ కమెడీయన్, జోకర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదలైన ఈ సినిమా కేవలం 70 మిలియన్ డాలర్లతో తెరకెక్కి సంచలన విజయం సాధించి ఏకంగా ఒక బిలియన్ డాలర్లని వసూలు చేసి రికార్డులు బ్రేక్ చేసింది. స్ట్రీట్ షోస్‌తో నవ్వించే ఓ జోకర్ బిగ్ స్క్రీన్‌పై రాణించాలనుకుంటాడు. కానీ అవకాశాలు రావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. ఓ రకంగా సినీ నిరుద్యోగంతో బాధపడుతుంటాడు. అంతేకాకుండా చుట్టూ ఉన్న జనాలు కూడా అవమానిస్తుంటారు. దీంతో మానసికంగా కృంగిపోయి నేరాలకు పాల్పడుతుంటాడు. మరి అతని కథ ఏ తీరం చేరిందనేది సినిమా. సినీ, కళా రంగాల్లోని నిరుద్యోగం, అక్కడి కష్టాలను తెలిపే చిత్రమిది. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది అత్యధికంగా ఆస్కార్లను సొంతం చేసుకునే చిత్రంగా నిలుస్తుందని విశ్లేషకులు జోస్యం చెప్పారు.
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధానంగా పోటీపడుతున్న చిత్రాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రంతోపాటు దర్శకత్వం, ఉత్తమ నటుడు, సహాయనటుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైన్, సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్‌లో ఆస్కార్ కోసం పోటీ పడుతుంది. ఇదిలా ఉంటే హాలీవుడ్ స్టార్స్ లియోనార్డో డికాప్రియో, బ్రాడ్‌పిట్, మార్గోట్ రాబీ వంటి భారీ తారాగణం ఉండటంపై దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ ఫేడౌట్ అయిన టీవీ నటుడు, అతని స్టంట్ డూప్ జర్నీని ఈ చిత్రం తెలియజేస్తుంది. హాలీవుడ్ గోల్డెన్ ఎరా సాగే టైమ్‌లో ఈ ఇద్దరూ సక్సెస్ కోసం పడే స్ట్రగుల్స్, ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనల ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి క్వెంటిన్ టరంటినో దర్శకత్వం వహించారు. కామెడీ డ్రామాగా కమర్షియల్ అంశాల ప్రధానంగా రూపొందిన ఈ సినిమా 85 మిలియన్ డాలర్లతో రూపొంది 379 మిలియన్ డాలర్లని సాధించింది. అంతేకాదు 2019 బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఇది కేన్స్‌లో పాల్ డాగ్ అవార్డుతోపాటు ఇతర అంతర్జాతీయ పురస్కారాలను సైతం కైవసం చేసుకుంది.
పారాసైట్
ఇప్పటికే కేన్స్‌లో గోల్డెన్ పామ్ అవార్డుని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఈసారి ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, విదేశీ చిత్రం, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ వంటి ఆరు విభాగాల్లో ఆస్కార్ కోసం బరిలో ఉంది. ఆస్కార్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగం ప్రధానంగా రూపొందిన ఈ సౌత్ కొరియన్ చిత్రానికి బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మేలో విడుదలైన సినిమా ఘన విజయం సాధించింది. 11 మిలియన్ డాలర్లతో రూపొంది 137 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. పేద కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు నిరుద్యోగంతో బాధపడుతుంటాడు. ఫ్యామిలీలో ఎవరికీ ఉద్యోగం లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. ఓ అపార్ట్మెంట్లోని చిన్న రూమ్‌లో ఉంటూ జీవనం సాగిస్తుంటారు. దగ్గర్లో ఉన్న ఓ సంపన్న కుటుంబంలోని అమ్మాయికి పెయింటింగ్ అంటే ఇష్టం. ఆ విషయం తెలుసుకున్న కుర్రాడు ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుని ఆ అమ్మాయికి ట్యూటర్‌గా వెళ్తాడు.
ఆ సంపన్న ఫ్యామిలీ గురించి వివరాలు తెలుసుకుని క్రమంగా ఆ కుర్రాడి కుటుంబం మొత్తం వివిధ రూపాల్లో వాళ్ళింటికి చేరతారు. అనంతరం ఏం జరిగిందనే ఆసక్తికర పరిణామాల సమాహారమే సినిమా. ఇందులో సాంగ్ కాంగ్ హౌ, లీ సన్ క్యూన్, చో యె జియాంగ్, చోయి వూ షిక్, పార్క్ సో డామ్ ప్రధానపాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు.
ది ఐరీష్మ్యాన్
ఈసారి ఆస్కార్ బరిలో అత్యధికంగా 10 నామినేషన్లతో ముందు వరుసలో ఉన్న చిత్రాల్లో ఇదొకటి. ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు,
ఎడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైన్, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఆస్కార్‌కి పోటీ పడుతుంది.
ఈ చిత్ర విశేషాలు చూస్తే, అత్యంత సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్. ఇందులో లెజెండరీ నటులు రాబర్ట్ డి నీరో, ఆల్ పసినో, జోయి పెస్కీ ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఓ టాక్సీ డ్రైవర్ గ్యాంగ్‌స్టర్‌గా మారేందుకు దారి తీసిన అంశాలు, నేరస్థుడిగా అనేక ఘటనలకు పాల్పడి, మాఫియా లీడర్‌గా ఎదిగిన వైనం.. ఈ క్రమంలో అమెరికన్ లేబర్ యూనియన్ లీడర్ మిస్టరీని, తన గతాన్ని తెలిపే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
1917
అత్యధికంగా 10 నామినేషన్లతో ఆస్కార్‌కి పోటీ పడుతున్న చిత్రాల్లో ఇదీ ఒకటి. ఎపిక్ వార్‌గా రూపొందిన ఈ బ్రిటీష్ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఒరిజినల్ స్కోర్, సినిమాటోగ్రఫీ,
మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్, ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఆస్కార్‌కి పోటీ పడుతుంది.
ప్రముఖ దర్శకుడు సామ్ మెండెస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘోర పరాజయం చెందింది. కానీ విమర్శలను మెప్పించింది. జార్జ్మాక్ కీ, డీయన్ చార్లెస్ చాప్మన్ ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇద్దరు బ్రిటీష్ సైనికులు అత్యంత ప్రమాదకర, అసాధారణమైన మిషన్ చేపడతారు. ప్రత్యర్థుల దాడిని ఆపేందుకు ప్రాణాలకు తెగించి పోరాడతారు. మరి ఆ మిషన్‌ని విజయవంతంగా పూర్తి చేశారా లేదా అనేదే ఈ చిత్ర కథ. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా.
మ్యారేజ్ స్టోరీ
ఈ చిన్న బడ్జెట్ చిత్రం ఆస్కార్ బరిలో ఆరు నామినేషన్లతో పోటీ పడటం విశేషం. నోV్‌ా బంబాచ్ దర్శకత్వం వహించిన ఈ డ్రామా చిత్రం ప్రధానంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, సహాయనటి, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో నామినేషన్స్ పంపబడింది.
ఈ చిత్రం కూడా పరాజయం చెందినప్పటికీ ఆస్కార్ బరిలో మంచి పోటీ ఇవ్వడం మరో విశేషం. కథ పరంగా చూస్తే, ఇది ఓ అందమైన జంట విడాకులు తీసుకునే విషయాన్ని తెలియజేస్తుంది. కుమారుడి కోసం వీళ్ళు కలిశారా లేక తమ పట్టుదలతో విడిపోయారా అనేది ఆద్యంతం నాటకీయభరితం. ఇందులో స్కార్లెట్ జాన్సన్, ఆడమ్ డ్రైవర్ జంటగా నటించి ఆకట్టుకున్నారు. ముఖ్య పాత్రల్లో
లారా డెర్న్, అలన్ అల్డా, రే లియోటా, పిల్లాడిగా అజా రాబర్ట్సన్ నటించారు.
లిటిల్ ఉమెన్
ఈసారి ఆస్కార్ బరిలో మహిళా ప్రధాన చిత్రం 'లిటిల్ ఉమెన్' నిలవడం విశేషం. మహిళా దర్శకురాలు గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన ఈ కమింగ్ ఏజ్ పీరియడ్ డ్రామా అదే పేరుతో 1868లో పబ్లిష్ అయిన నవల ఆధారంగా రూపొందించారు. ఈ నవల పేరుతో వచ్చిన ఏడో చిత్రమిది కావడం విశేషం. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, సహాయనటి, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఒరిజినల్ స్కోర్, కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కి పంపబడింది. కథ పరంగా చూస్తే ఇది నలుగురు అమ్మాయిల జర్నీని తెలియజేస్తుంది. తన సోదరీమణుల కోసం, వారే తమ సర్వస్వంగా, డ్రీమ్‌గా భావించి పడే స్ట్రగుల్స్‌ని తెలిపే కథాంశంతో రూపొందించారు.
40 మిలియన్ డాలర్లతో రూపొంది 112 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ఇందులో అక్కగా సాయోర్స్ రోనన్, ఇతర పాత్రల్లో ఎమ్మా వాట్సన్, ఫ్లోరెన్స్ పఫ్, ఎలిజా స్కాన్లెన్ నటించారు.
జోజో రాబిట్
కామెడీ డ్రామాగా రూపొందిన 'జోజో రాబిట్' ఆరు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకి ఎంపికైంది. అందులో ముఖ్యంగా ఉత్తమ చిత్రంతోపాటు సహాయ నటి, ఎడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్‌కి పోటీ పడుతుంది. లో బడ్జెట్ చిత్రంగా టైకా వైట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 14మిలియన్ డాలర్లతో తెరకెక్కి 36 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ఇందులో రోమన్ గ్రిఫిన్ డేవిస్, టైకా వైట్టి, థామసిన్ మెక్ కెంజీ, రెబెల్ విల్సన్‌తోపాటు స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా ప్రధానంగా హిట్లర్ ఆర్మీలో బాలల బృందంలో పనిచేసే ఓ కుర్రాడు తల్లి ప్రేమని వెతుక్కునే కథాంశంతో రూపొందించారు. ఆద్యంతం హాస్యభరితంగా సాగే సినిమా విశేషంగా ఆకట్టుకుంది.
వీటితోపాటు 'ఫోర్డ్ వర్సెస్ ఫెరారి', 'ది ఫేర్వెల్', 'హస్', 'హాస్టిలర్', 'ఏ బ్యూటీఫుల్ డే ఇన్ ది నైబర్‌హుడ్', 'రాకెట్‌మ్యాన్' వంటి చిత్రాలు సైతం ఉత్తమ చిత్రం కోసం ఆస్కార్ బరిలో ఉన్నాయి.
వివిధ విభాగాల్లో పోటీ పడుతున్న వారి వివరాలు
ఉత్తమ నటుడు
ఆడమ్ డ్రైవర్ (మ్యారేజ్ స్టోరీ), లియోనార్డో డికాప్రియో(వన్స్ ఆపాన్ ఏ టైమ్ఇన్హాలీవుడ్),టరాన్ఎగెర్టన్(రాకెట్‌మ్యాన్), జోవాక్విన్ ఫోనిక్ (జోకర్), జోనాథన్ప్రైస్ (ది టూ పాప్స్), రాబర్ట్డినీరో (ది ఐరీష్ మ్యాన్).
ఉత్తమ కథానాయిక
సింతియా ఎరివో (హరియట్), స్కార్లెట్ జాన్సన్ (మ్యారేజ్ స్టోరీ), సావోయిర్స్ రోనన్ (లిటిల్ ఉమెన్), ఛార్లెస్ థెరాన్ (బాంబ్‌షెల్), రెనీ జెల్వెగర్ (జుడే).
ఉత్తమ దర్శకులు
ఉత్తమ దర్శకుడు: మార్టిన్ స్కోర్సెస్(ది ఐరీష్మ్యాన్), టైకా వైటిటి(జోజో రాబిట్), బాంగ్ జూన్ హౌ(పారాసైట్), సామ్ మెండెస్(1917), క్వాంటిన్ టరంటినో(వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్), గ్రెటా గెర్వింగ్ (లిటిల్ ఉమెన్).
ఉత్తమ సహాయ నటుడు
టామ్ హ్యాంక్స్(ఏ బ్యూటిఫుల్ డే ఇన్ ది నైబర్‌హుడ్), ఆంథోని హాప్కిన్స్(ది టూ పాప్స్), ఆల్ పసినో(ది ఐరీష్ మ్యాన్), జోయి పెస్కి(ది ఐరీష్ మ్యాన్), బ్రాడ్ పిట్(వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్).
ఉత్తమ సహాయ నటి
లారా డెర్న్(మ్యారేజ్ స్టోరీ), స్కార్లెట్ జాన్సన్(జోజో రాబిట్), జెన్నీఫర్ లోపేజ్(హాస్టలర్), మార్గోట్ రాబీ(బాంబ్‌షెల్), జా షుజెన్(ది ఫేర్వెల్).
బెస్ట్ ఎడాప్టెడ్ స్క్రీన్‌ప్లే
టైకా వైటిటి(జోజో రాబిట్), టాడ్ ఫిలిప్స్, స్కాట్ సిల్వర్(జోకర్), స్టీవెన్ జియలియన్(ది ఐరీష్ మ్యాన్), ఆంటోని మెక్ కార్టెన్(ది టూ పాప్స్).
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే
సామ్ మెండెస్, క్రిస్టీ విల్సన్, కైర్న్స్(1917), ఎమిలీ హల్‌పెర్న్, సారా హాస్కిన్స్, సుసాన్నా ఫోగెల్, క్యాటీ సిల్బర్మన్(బుక్స్మార్ట్), నోహా బాంబాచ్(మ్యారేజ్ స్టోరీ), క్వాంటికో టరంటినో(వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్), బాంగ్ జూన్ హౌ, జిన్ వాన్ హాన్(పారాసైట్).
బెస్ట్ సినిమాటోగ్రఫీ
రోగర్ డీకిన్స్(1917), రోడ్రిగో ప్రీటో(ది ఐరీష్మ్యాన్), లారెన్స్ షేర్(జోకర్), జారిన్ బ్లాస్కీ(ది లైట్ హౌస్), రాబర్ట్ రిచర్డ్సన్(వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్).
బెస్ట్ ఎడిటింగ్
'ది ఐరీష్ మ్యాన్', 'జోజో రాబిట్', 'జోకర్', 'ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ', 'పారాసైట్'.
బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫీచర్ ఫిల్మ్
'పారాసైట్' (సౌత్ కొరియా), 'లెస్ మిసరబుల్స్'(ఫ్రాన్స్), 'హానీల్యాండ్' (నార్త్ మెక్డోనియా), 'క్రిస్టీ'(పోలాండ్), 'పెయిన్ అండ్ గ్లోరీ'(స్పెయిన్).
బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్
'అబోమినేబుల్', ఫ్రోజెన్ 2', 'హౌ టు ట్రైన్ యువ డ్రాగన్: ది హిడెన్ వరల్డ్', 'మిస్సింగ్ లింక్', 'టారు స్టోరీ 4'.
బెస్ట్ ఒరిజినల్ స్కోర్
'జోకర్', 'లిటిల్ ఉమెన్', 'మ్యారేజ్ స్టోరీ', '1917', 'స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్'.
బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైనింగ్
సాండీ పావెల్, క్రిస్టోఫర్ పీటర్సన్(ది ఐరీష్మ్యాన్), మార్క్ బ్రిడ్జెస్(జోకర్), అరియాన్నె ఫిలిప్స్(వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్), జాక్వెలిన్ డుర్రాన్(లిటిల్ ఉమెన్), మేస్ సి.రుబియో(జోజో రాబిట్).
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
'ఐ యామ్ స్టాండింగ్ విత్ యు'(బ్రేక్థ్య్రూ), 'ఇన్‌టూ ది అన్నోన్(ఫ్రోజెన్ 2), 'స్టాండ్ అప్'(హర్రీట్), 'లవ్ మీ ఎగైన్' 'రాకెట్‌మ్యాన్), 'ఐ కాంట్ లెట్ యు థ్రో యువర్సెల్ఫ్ అవే'(టారు స్టోరీ 4), 'గ్లాస్గౌ'(వైల్డ్ రోజ్).
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్
'1917', 'ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ', 'జోకర్', 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్', 'స్టార్స్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కై వాకర్'.
బెస్ట్ సౌండ్ మిక్సింగ్
'అడ్ ఆస్ట్రా', 'జోకర్', '1917', 'ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ', 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్'.
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్
'అవెంజర్స్: ఎండ్‌గేమ్', 'ది ఐరీష్మ్యాన్', 'ది లయన్ కింగ్', '1917', 'స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్'.