టెక్నాలజీ వాడకం రోజురోజుకూ పెరగడంతో సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన 'వాన్న క్రై' రాన్సమ్వేర్, ఆ తర్వాత వచ్చిన ఇటర్నల్ రాక్స్. ఇలా ఎన్నో రకాల వైరస్లు కంప్యూటర్లోకి వ్యాప్తిచెంది అంతర్జాతీయంగా అలజడి సృష్టిస్తున్నాయి. ఏదైనా ఒక మాల్వేర్ కంప్యూటర్లోకి చొరబడాలంటే ప్రమాదకర లింక్ లేదా ప్రమాదకర ప్రోగ్రామ్ పై క్లిక్ చేయాలి. అప్పుడే మాల్వేర్ అనేది పీసీలోకి వస్తుంది. కొన్ని రకాల మాల్వేర్ ఏవిధమైన లింక్స్ పై క్లిక్ చేయకుండానే కంప్యూటర్లలోకి వ్యాపిస్తుంది. మరి ఇలాంటి వాటినుంచి హౌం నెట్‌వర్క్‌ను ఎలా కాపాడుకోవాలి? అన్నది అందరినీ వేధిస్తున్న సమస్య.. హ్యాకర్ల బారిన పడకుండా తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
పెద్దపెద్ద కంపెనీలలో, సంస్థలలోనే కాదు ఇంట్లో, ఆఫీస్‌లో ఉపయో గించే కంప్యూటర్లు కూడా హ్యాకర్ల నుంచి సైబర్ దాడులను ఎదుర్కొవల్సి వస్తుంది. నిజానికి..ప్రతి ఒక్కరూ ఈ మాల్వేర్ దాడులకు గురవుతారు. ముఖ్యమైన సమాచారాన్ని డేటా రూపంలో కంప్యూటర్లలో భద్రపరిచేవారంతా అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటి కప్పుడు ఈ దాడుల బారిన పడకుండా అవగాహన పెంచుకోవాలి.
రూటర్ పేరు మార్చండి..
సాధారణంగా అందరు ఉపయోగించే నెట్వర్క్ పేరు కామన్‌గా ఉంటుంది. నగరాలలో చాలా మంది వై-ఫై నెట్ వర్క్‌ను ఉపయో గిస్తున్నారు. దీనినిూూ×ణ (సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్)గా పిలుస్తారు. రూటర్ కనెక్షన్ ద్వారా నెట్వర్క్ వాడుతారు. అయితే మీరు ఉపయోగించే రూటర్ పేరు మార్చినట్లయితే...హ్యాకర్లకు పేరు తెలుసుకోవడం చాలా కష్టం. హ్యాకర్లు మీ రౌటర్ కనెక్షన్ గురించి, నెట్వర్క్ గురించి మాత్రం తెలుసుకోగలుగుతారు.. కానీ, మీరు వ్యక్తిగతంగా సెట్ చేసుకునే పేరును ఊహించడం కష్టంగా ఉంటుంది. కామన్ పేరు కాకుండా మీకు మాత్రమే తెలిసిన వాటిని రూటర్ పేరుగా మార్చుకోండి.
స్ట్రాంగ్ పాస్ వర్డ్
మీరు వై-ఫై రూటర్ కొనుగోలు చేసినప్పుడు అది డిఫాల్ట్ పాస్ వర్డ్ తో వస్తుంది. దీనిని మీరు మార్చి స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. మీ పేరు, ఫోన్ నెంబర్ వంటివి పాస్‌వర్డ్‌గా పెట్టవద్దు. వీటిని హ్యకర్లు ట్రాక్ చేయడం సులభం. కాబట్టి మీరు ఎక్కువ అక్షరాలతో స్ట్రాంగ్ పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవడం మంచిది. పాస్ వర్డ్ లెటర్స్, నంబర్స్ తో కలిపి చేర్చినట్లయితే హ్యాక్‌కు చేయడం కష్టమవుతుంది.
రూటర్ సిగల్స్ రేంజ్..
కంప్యూటర్ను హ్యాక్ చేయడంలో వై- ఫై రూటర్ ఏర్పాటుచేసిన ప్రదేశం కూడా ముఖ్యమైనదే. చాలా మంది దీనిని గమనించరు. సిగల్స్ బాగా రావాలంటూ వై-ఫై రూటర్‌ను మెయిన్ డోర్ దగ్గర, కిటికి దగ్గర సెట్ చేస్తారు. ఇది సరైన పద్దతి కాదు. సిగల్ బయటి వరకు వెళ్లకుండా రూటర్‌ను ఇంటి మధ్యలో ఏర్పాటుచేసుకోవాలి. ఇంటి మధ్యలో వై - ఫై రూటర్‌ను ఉంచడంతో అన్ని గదులకు సిగల్ అందుతుంది. మీరు సిగల్స్ బయటకు వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఐపీ చిరునామా భద్రమేనా..?
మీరు డెస్క్‌టాప్, ల్యాపీ, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ ఏదైనా కానివ్వండి.. ఇంటర్ నెట్ వాడుతున్నారు కదా... అయితే మీ ఆపరేటర్ మీకు ఒక ఐపీ నెంబర్ ఇస్తారు. దానినే ఇంటర్నెట్ ప్రొటోకాల్ నెంబరు అంటారు. మీరు ఏ డివైజ్ నుంచి నెట్ వాడుతున్నా మీకు కేటాయించిన ఐపీ నెంబర్‌తో కనెక్ట్ అవుతుంది. అయితే దీనిని భద్రంగా ఉంచుకునే మార్గం మాత్రం చాలా మందికి తెలియదు. కొన్ని సార్లు మీ కంప్యూటర్ను హ్యాక్ చేయడానికి ఇది కారణం కావచ్చు.
మీ సిస్టమ్‌లో మాల్వేర్ ఉందనడానికి ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మీ కంప్యూటర్లో మాల్వేర్ ఉంటే, మీరు ఈ లక్షణాలను గమనించవచ్చు:
- పాప్-అప్ ప్రకటనలు
- తెలియని గూగుల్ సెర్చ్ ఫలితాలు, ప్రకటనలు
- మీ హౌమ్పేజీ దారి మళ్లించడం
- తెలియని ఖ=ూ లోగో కనిపించడం
- రాంగ్ సెర్చింగ్
బ్రౌజర్ రీ సెట్..
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్నిసార్లు వైరస్ కంప్యూటర్లోకి వస్తుంది. మరి దీనిని తీసివేయాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ అన్ఇన్స్టాల్ చేయాలి. మీ సెట్టింగ్‌లను తిరిగి నార్మల్ స్థితికి తీసుకురావడానికి బ్రౌజర్ రీసెట్ చేయాలి.
- మీరు వేరొక బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటే, మీ కంప్యూటర్లోని మాల్వేర్ను గుర్తించి, తీసివేయడానికి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించండి. భవిష్యత్తులో మీ కంప్యూటర్ మాల్వేర్ బారిన పడకుండా కాపాడుకోవాలి.
- మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్గా ఉంచుకోండి.
- మీరు క్లిక్ చేసే, డౌన్లోడ్ చేసే వాటిని గమనించండి. కొన్ని లింక్‌లు మీకు తెలియకుండానే వస్తాయి. అలాంటి లింక్స్‌పై క్లిక్ చేయవద్దు.
- తెలియని ఫైల్స్, ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేయవద్దు.
- డౌన్లోడ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పరిమాణంలో ఉండే అక్షరాలను గమనించండి.
- ఇన్స్టాల్ అవుతున్న ప్రోగ్రామ్‌ల గురించి అవగాహన పెంచు కోవాలి. అప్పుడే మీరు ఇంటిలో, ఆఫీస్‌లో ఉపయోగించే కంప్యూ టర్లు, వాటిలోని డేటా సురక్షితంగా ఉంటాయి.
-వి.ఎస్ ఆదిత్య
Authorization