షియోమి మొబైల్ సంస్థ షియోమి ఫోన్లకు MIUI 9 అప్డేట్ తీసుకొచ్చింది. గతంలో బీటా వర్షన్ లో ఉన్న ఈ అప్డేట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. మరి కొత్త వచ్చే అప్డేట్ వివరాలు తెలుసుకోండి..
గూగుల్ స్మార్ట్ అసిస్టెంట్ ఆప్షన్ తరహాలోనే షియోమి MIUI 9 అప్డేట్ ఫోన్లలోనూ స్మార్ట్ అసిస్టెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. షియోమి ఫోన్లలోని హౌమ్ స్క్రీన్ కుడివైపున ఈ స్మార్ట్ అసిస్టెంట్ వివరాలు కనిపిస్తాయి. హౌమ్ స్క్రీన్ పై సెర్చ్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీకు కావల్సిన సమాచారం లభిస్తుంది. photos, text messages, emails, notes లాంటి వాటిని సెర్చ్ చేయవచ్చు. స్క్రీన్ మీద ఆప్స్‌కి సంబంధించిన మొత్తం సమాచారం కనిపిస్తుంది. మీరు ఒక్కో ఆప్ కోసం వెతికే పని లేకుండా అన్ని ఆప్స్ ఒకే ఫైల్లో కనిపిస్తాయి. నచ్చిన ఆప్స్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. దీని కోసం హౌమ్ స్క్రీన్‌ను ఓపెన్ చేయనవసరం లేదు. ఇమెజ్ సెర్చ్ ఫీచర్ ద్వారా అన్ని రకాల ఫోటోలను సెర్చ్ చేయవచ్చు. Image Search ఈ ఫీచర్ ద్వారా మీరు అన్ని రకాల ఫోటలను సెర్చ్ చేసుకోవచ్చు. ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నా కాని మీరు ఈ ఫీచర్ ద్వారా people, locations, expressions, events, documents, screenshots లాంటి వాటిని సెలక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫోటోస్ మాదిరిగానే ఈ ఫీచర్ ఉంటుంది.
System Optimizations అనే ఫీచర్ ద్వారా ఫోన్ బ్యాటరీ బాగా సేవ్ చేయవచ్చు. బ్యాక్ రన్ అవుతున్న ఆప్స్‌ని గుర్తించి వాటిని అప్డేట్ చేస్తుంది. బ్యాటరీ ఎక్కువ టైం వస్తుంది.
Lock Screen Enhancements MIUI 9 లో లాక్ స్క్రీన్ ప్రెస్ చేస్తే ఓ పేజీ కనిపిస్తుంది. ఇందులో Mi Home and Mi Remote ఫీచర్లు కనిపిస్తాయి. అలాగే ఫ్లాష్ లైట్ కూడా కనిపిస్తుంది.
Security App Enhancements - ఈ ఫీచర్ ద్వారా ఫోన్లోని వెస్ట్‌ను బూస్ట్ చేయవచ్చు. హౌమ్ పేజీ మీద మీకు అన్ని రకాల actions కనిపిస్తాయి. ఇది MIUI 9లో వచ్చిన బెస్ట్ ఫీచర్.
Authorization