స్మార్ట్ఫోన్లు కొన్ని వందల రకాల బ్యాక్టీరియాలకు, సూక్ష్మజీవులకు నిల యాలుగా మారుతున్నాయి. అది కూడా టాయిలెట్లో ఉండే క్రీములకంటే దారుణమైన క్రీములని పరిశోధనకులు అంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 రకాల బ్యాక్టీరియాలను హ్యాండ్సెట్లలో ఉంటాయని పుణెకు చెందిన పరిశోధనకారులు గుర్తించారు. వీటిల్లో ఇప్పటి వరకు బయటపడిన వాటికంటే కొత్తగా మూడు రకాల సూక్ష్మజీవులను, 30 రకాల ఫంగస్లను గుర్తించారు. అయితే, ఇవేవీ ప్రాణహాని చేసేవి కావని , ఎక్కువగా ఫోన్లు చేతిలో పట్టుకుని ఉండే చర్మసంబంధమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని, లేదంటే బ్యాక్టీరియాతో వచ్చే అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.