టీవీ ఛానల్ మార్చాలంటే రిమోట్ కోసం వెతకాలి. లైట్ ఆన్ చేయాలంటే స్విచ్ కోసం వెతకాలి. కంప్యూటర్లో టైప్ చేయాలంటే కీబోర్డు వచ్చి ఉండాలి. ఇదంతా ప్రస్తుతం ఉన్న ట్రెండ్. దీనికి అప్ డేట్‌గా ఇన్టర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి. అప్పుడప్పుడూ సినిమాల్లో చూస్తూ ఉంటాం గదిలోకి వెళ్లగానే లైట్ ఆన్ అవడం. అటోమెటిక్‌గా డోర్లు తెర్చుకోవడం. ఇంతేనా ? ఇంకా ఈజీగా మన డివైజ్‌లను కంట్రోల్ చేయలేమా..? మీరెప్పుడైనా అనుకున్నారా కనుసైగలతో లైట్లు ఆన్ ఆఫ్ చేయొచ్చని, చేతి సంజ్ఞలతో కంప్యూటర్లో టైప్ చేయొచ్చని. సంజ్ఞలతో టీవీ ఛానల్ మార్చవచ్చు అని. అవును నిజమే.. సెన్సార్ గాడ్జెట్స్‌తో అది సాధ్యమవుతోంది. ప్రస్తుతం అలాంటి గాడ్జెట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
వెల్ డెవెలప్డ్ కంట్రీస్‌లో వీటిని ఎక్కువ వాడుతున్నారు. సో మనం కూడా వాటికి వెల్కం చెబూతూ ఈ సన్సార్ గాడ్జెట్ల సంగతి ఏంటో తెలుసుకుందామా ?
1
Singlecue: రిమోట్ లేకుండా టీవీని ఆక్సెస్ చేయొచ్చు. చేతి సంజ్ఞలతో ఛానల్ మార్చడం, వాల్యుమ్ అడ్జస్ట్ చేయటటం ఈ గాడ్జెట్ పని. టీవీ, డీవీడీ, సెటాప్‌బాక్స్, స్మార్ట్ హోం గాడ్జెట్లనూ దీంతో కంట్రోల్ చేయొచ్చు. ఐఆర్ రిమోట్ కంట్రోల్ డివైజ్‌లకు. వైఫై ఉన్న డివైజ్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది. దీనితో ఒకే సారీ మల్టిపుల్ డివైజ్‌లను వేలి సైగలతోనియంత్రించవచ్చు. https://goo.gl/QHkZXo
2 Ring ZERO S : స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టచ్ చేయకుండానే ఆపరేట్ చేయలనుకుంటే Ring ZERO S తో సాధ్యమే. 12 గంటలు ఆక్టీవ్ మోడ్ లో ఉంటుంది. 3 రోజుల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అచ్చం రింగ్లాగే దీన్ని చేతి వేళికి తొడుక్కోవాలి. బ్లూటూత్ ఉన్న ఏ స్మార్ట్ ఫోన్‌ను అయినా ఆపరేట్ చేయవచ్చు. ఆప్స్ ఓపెన్ చేయడానిక, మెసెజ్ రాయడానికి ఈ హై స్మార్ట్ గాడ్జెట్ బాగా పనిచేస్తుంది. https://goo.gl/jbC48M
3 జెస్ట్ సెన్సార్ కీబోర్డ్
కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే కీబోర్డు తప్పనిసరి, మౌస్ లేకపోతే పనవ్వదు. ఇప్పుడు వాటితో పని లేదంటోంది. జెస్ట్ సెన్సార్ కీ బోర్డు. ఈ కీ బోర్డు ఉంటే.. మనం గాల్లో టైప్‌చేసిన కంప్యూటర్లో అక్షరాలుగా మారిపోతాయి. నాలుగు వేళ్లకు తగిలించుకునే రింగ్‌లు, అరచేతిపై అమర్చుకుని పట్టీలతో కూడిన జెస్ట్‌లో యాక్సెలరోమీటర్లు, గైరో స్కోపులు, మాగెటో మీటర్లు ఇలా బోలెడు సెన్సార్ ఆబ్జెక్ట్‌లు ఉన్నాయి. మన వేలి కదలికలను బట్టి అక్షరాలను అంచనా వేసి స్క్రీన్‌పై చూపుతాయి. స్మార్ట్ ఫోన్లో మాదిరిగా ప్రిడిక్టివ్ టెక్స్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటాయి. జెస్ట్ ఎక్స్‌బాక్స్ కైనిక్ట్ లేదా లీప్ మోషన్ మాదిరిగా పూర్తిగా వేలి కదలికలపై మాత్రమే ఆధార పడదు. మౌస్ బటన్‌ను డబుల్ క్లిక్ చేసినట్టు, లేదా కీబోర్డ్ షార్టకట్ల తీరులో ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు నిర్దిష్టమైన పని జరిగేట్టు కూడా పని చేస్తుంది. బ్లూటూత్ ఉన్న ఏ డివైజ్‌కైనా జెస్ట్ కనెక్ట్ అవుతుంది ఈ కీబోర్డ్ ఎలా పని చేస్తుందో చూడాలంటే క్లిక్ చేయండి : https://goo.gl/ZaWtH8
4 Myo armband: దీన్ని మోచేతికి ధరించాల్సి ఉంటుంది. దీని ద్వారా మ్యూజిక్స్, వీడియో గేమ్స్, ప్రసెంటేషన్స్, వీజువల్ ఎంట ర్టెన్మెంట్స్ అన్నిటినీ కంట్రోల్ చేయ వచ్చు. ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు రిమోట్‌తో పని ఉండదు. దీన్ని దరించి హ్యాండ్ మూమెంట్స్ ఇస్తే చాలు తెరమీద ఆక్సెస్ అవుద్ది. వీడియో గేమ్స్ ఆడేట ప్పుడు రిమోట్ లేకుండానే ప్లేయర్‌ను కంట్రోల్ చేయ వచ్చు. ప్రధానంగా డ్రోన్‌ను కూడా ఇది ఆపరేట్ చేస్తుంది. హ్యాండ్ మూవ్‌మెంట్స్‌ని రిసీవ్ చేసుకుని డ్రోన్ మూవ్ అవుతుంది. థల్మిక్ ల్యాబ్స్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. https://goo.gl/zBd8iA
Authorization