ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ తన కీ సిరీస్‌లో భాగంగా మరో సరికొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. టీసీఎల్ లైసెన్స్‌తో విక్రయిస్తున్న ఈ స్మార్ట్ఫోన్లను టీసీఎల్ బ్లాక్‌బెర్రీ కీ సిరీస్‌లో భాగంగా న్యూయార్క్‌లో ఆవిష్కరించింది. విజయవంతమైన వెర్షన్ కీ1కి కొనసాగింపుగా కీ2 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ అందుబాటులోకి తీసుకొచ్చింది. డీటెక్, లాకర్, పవర్ సెంటర్ లాంటి బిల్ట్ఇన్ సెక్యూరిటీ ఫీచర్లు డ్యుయల్ రియర్ కెమెరా, క్వర్టీ (ఫిజికల్) కీబోర్డు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. బ్లాక్అండ్ సిల్వర్ కలర్స్‌లో లభిస్తున్న దీని ధర సుమారు రూ.43,893గా ఉండనుంది. ఇక దీనిలోని ఇతర ఫీచర్ల విషయానికొస్తే... 4.5 అంగుళాల ఐపిఎస్ డిస్ప్లే, 1620ఐ1080 రిజల్యూషన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ఆక్టాకోర్ ప్రాసెసర్, స్టోరేజ్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1, 6జీబీర్యామ్, 64జీబీ స్టోరేజ్, 12ం12 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా, 3500ఎంఏహచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.