ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవటం మామూలైపోయింది. ముఖ్యంగా వీటిపై యూత్ ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వారి అభిరుచులకు అనుగుణంగా బోలెడన్ని అప్లికేషన్లు నిత్యం వరదలా వచ్చి పడుతుంటాయి. ఈ జనరేషన్‌కి తగ్గట్టుగానే సోషల్ మీడియా, సోషల్ యాప్‌ల స్పీడు పెరిగింది. యువతకు ఎంటర్టైన్మెంట్తోపాటే వారి కెరీర్‌కి ఇవి దోహదపడుతున్నాయి. అందుకే.. యాప్స్‌తో యూత్‌కు దోస్తీ బాగా పెరిగింది.
ఉద్యోగాన్వేషణకు..
గతంలో ఉద్యోగం కావాలంటే దరఖాస్తు చేసి నెలల తరబడి ఎదురు చూసేవారు. ఇంటర్నెట్ విస్త తి పెరిగాక ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. మరి ఇప్పుడంతా యాప్‌ల హవా నడుస్తోంది కదా! మరి జాబ్ దరఖాస్తుకు, ప్రిపరేషన్ కూడా ఏమైనా యాప్‌లు ఉన్నాయా? చాలా ఉన్నాయి.
సెంట్రల్ సర్వీసుల్లో తరచూ జాబ్ నోటిఫికేషన్లు విడుదలవు తూనే ఉం టాయి. వాటి గురించి తెలుసుకునే లోపే దరఖాస్తు గడువు కాస్తా ముగిసిపోతుంది. ఇలాంటి ఇబ్బందులను 'ఎంప్లాయిమెంట్ న్యూస్ ఇండియా' యాప్‌తో అధిగమిం చొచ్చు. కేంద్ర సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలు, వివిధ రాష్ట్రాల్లోని ఉద్యోగ ప్రకటనలు అన్నీ ఇందులో ఉం టాయి.అంతేకాదు.. జాబ్ అలెర్ట్, లేటెస్ట్ నోటిఫకేషన్లు తెలిపే యాప్స్, చరిత్ర, సామాజిక అంశాలు ఇమిడి ఉన్న యాప్స్ చాలా ఉన్నాయి. naukri.com job search, Indeed job search, linkedin job search, monster jobs, job today, sarkari naukari యాప్స్ ద్వారా ఉద్యోగాన్వేషణ చాలా ఈజీ.
shots:
ఇదో ఫొటో షేరింగ్ యాప్. ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ పరిచయం చేసిన ఈ అప్లికేషన్‌కి యువతరంలో క్రేజ్ విపరీతంగా ఉంది. సెల్ఫీలు, ఫొటోలను ఇతరులతో షేర్ చేసుకునే యాప్ ఇది. స్నేహితులతోనూ, బంధువులతోనూ టచ్‌లో ఉంటూ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు ఇది ఉచితం.
apple music :
మ్యూజిక్ ప్రపంచంలో రకరకాల ఫీచర్లను అందిస్తూ ట్రెండ్ సెట్టర్‌గా మారింది యాపిల్. ఐట్యూన్స్ వంటి అనేక సర్వీసులతో ఇది యువతరాన్ని ఆకట్టుకుంటోంది. తాజా సంగీతాన్ని అందిస్తున్న యాపిల్ మ్యూజిక్ యాప్ సంగీత ప్రేమికులకు మరింత చేరువైంది. ఐఓఎస్ ఫోన్ వినియోగదా రులకు ఇది అందుబాటులో ఉంది.
frontback :
ఫొటోలతోనే కథ అల్లి చెప్పేవారికి ఇది సరైన యాప్. ఫ్రంట్, రియర్ కెమెరాలతో ఫొటోలు తీసి వాటిని ఒకేసారి పక్కపక్కనే పోస్ట్ చేసే వెసులుబాటు కల్పించే అప్లికేషన్ ఇది. ఫ్రెండ్ పంపించిన ఫొటోపై ఐదు సెకన్ల వీడియో రెస్పాన్స్ పంపించే సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు ఇది ఉచితం.
khan academy :
యాప్స్‌లో చాలావరకూ కాలక్షేపానికి ఉపయోగ పడేవే . కెరీర్‌కు దోహదపడే యాప్స్ తక్కువనే చెప్పాలి. ఆ కోవకు చెందినదే ఖాన్ అకాడెమీ యాప్. ఆర్థిక శాస్త్రం నుంచి జీవశాస్త్రం వరకు, ఆంత్రోపాలజీ నుంచి వైరాలజీ వరకు రకరకాల కోర్సుల్ని అందించే అప్లికేషన్ ఇది. వెబ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై ఈ యాప్ ఉచితం.
quora : ఏదైనా ప్రశ్నకు సమాధానం దొరకలేదా? మరెందుకు ఆలస్యం... కోరాను అడగండి. చిటికెలో సమాధానం దొరుకుతుంది. వాస్తవానికి ఇదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్సైట్. ఇద్దరు ఫేస్బుక్ మాజీ ఉద్యోగులు కలసి దీన్ని లాంచ్ చేశారు. మీరడిగిన ప్రశ్నలకు నిపుణుల సాయంతో జవాబులు చెప్పడం దీని ప్రత్యేకత.
ఫ్రెండ్స్‌ని వెతకొచ్చు
ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అందరూ ఒకే సమయానికి చేరుకోవాలి. ఎవరు ఎప్పుడు బయలు దేరారు. ప్రస్తుతం ఏ లొకేషన్లో ఉన్నారో తెలుసుకుంటే ఏ సమయానికి చేరుకుంటారో తెలిసిపోతుంది. ఇందుకోసం ఖీఱఅస వీy ఖీతీఱవఅసర యాప్ ఉపయోగ పడుతుంది. ఫ్రెండ్స్ లొకేషన్ తెలుసుకుంటే దాన్నిబట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్ మిస్ అయితే మిస్సింగ్ లొకేషన్‌ను గుర్తించి నావిగేషన్ హెల్ప్‌ను అందించవచ్చు. ఒకసారి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే స్నేహితులతో కమ్యునికేట్ చేయడానికి, లొకేట్ చేయడానికి, ఎప్పుడూ టచ్‌లో ఉండటానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ అందరూ రాత్రి ఇంటికి క్షేమంగా చేరుకున్నారా లేదా చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ ఫ్రెండ్స్ కమ్యూనికేట్ చేయడానికి ఇది ఉత్తమమైన యాప్. అంతేకాకుండా మీరు మంచి రెస్టారెంట్‌ను చూశారు లేక ఒక షాపింగ్ మాల్లో గ్రేట్ ఆఫర్స్ గురించి తెలిసింది. వెంటనే ఆ సమాచారాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసు కోవచ్చు.
ఒకేరకమైన ఆసక్తి
ఒకేరకమైన ఆసక్తి ఉన్న వారితో ఫ్రెండ్షిప్ తొందరగా కుదురుతుంది. మరి మీలాగే భిన్నమైన ఆసక్తులను కలిగి ఉన్న వ్యక్తులను కలుసుకోవాలంటే వీవవ్బజూ అప్లికేషన్‌ను ఎంచుకోవాలి. ఈ యాప్‌లో మీకున్న అభిరుచులు, ఆసక్తులను ఇతరు లతో పంచుకోవచ్చు. ప్రత్యేకంగా మీకున్న ఆసక్తిని బట్టి, అదే రకమైన ఆసక్తులను సెర్చ్ చేసి పట్టుకోవచ్చు. యాక్టివిటీ ఆధారంగా కూడా వెతకొచ్చు. మీకు నచ్చితే గ్రూప్‌లో జాయిన్ కావచ్చు. కొన్నాళ్లు పోయాక నచ్చకపోతే గ్రూప్ నుంచి బయటకు రావచ్చు. గ్రూప్‌లో ఉంటే గ్రూప్సభ్యుల నుంచి మీకు మెసేజ్‌లు వస్తుంటాయి. మీరుండే ప్రాంతానికి దగ్గరలో జరుగుతున్న ఈవెంట్స్ సమాచారం పొందవచ్చు. బేస్ చేసుకుని సెర్చ్ చేసుకోవచ్చు. యాప్‌లో నుంచే గ్రూప్‌లో జాయిన్ కావడం, విత్డ్రాకావడం చేయొచ్చు. గ్రూప్‌లో ఉన్న ఇతర మెంబర్ల నుంచి సంక్షిప్త సందేశాలు సైతం పొందవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్నేహితులను కలుసుకోవడానికి ఇది మోస్ట్ ఎఫెక్టివ్ యాప్ అని చెప్పవచ్చు.
Authorization